3-6-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వాడ దొంగ యెటుల్ భగవంతుఁడగును”
(లేదా...)
“వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు దేవుఁడా”
లోకులు నుడువుచుండిన రూపును విని ,తనను కోరిన రుక్మిణీ తరుణిని మనువాడ , దొంగ యెటుల్ ? భగవంతుఁడగునుకోమలికి , తాను వేడిన కోర్కె దీర్చ
తేటగీతివెన్న మీగడ దోచియు వీధులిండ్లనంగనలు జలకాలాడ తొంగి చూచిచీరలెత్తుకు పోయిన శ్రీకరుండె!వాడ? దొంగ! యెటుల్ భగవంతుఁడగును?మత్తకోకిలచూడకూడదటన్న జ్ఞానము సుంతయైనను లేకయేనాడువారలు తానమాడగ నందిపోయెను చీరలన్తోడు దొంగలు వెంటనంటగ దూరి యిండ్లను వెన్నలన్వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు దేవుఁడా?
☝☝☝అగ్ర పూజకెంచిన శ్రీకృష్ణుని గురించి శిశుపాలుడు ధర్మరాజుతో.....
(కృష్ణుని వెన్నదొంగతనం చూసి ఆశ్చర్యపడిన ఓ ఇల్లాలి మాటలు)మత్తకోకిల.వేడుకల్ దరి చేరుచున్నవి వెన్న ముద్దులు మాయమై నేడు గంటికిఁ గానిపించెను, నిస్తులంబగు నేర్పుతో ప్రోడయౌచట తస్కరించెను బోసి నవ్వులఁ జింది యా వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుడు, దేవుడా !!
జలకములనాడు పడతుల శాటికలనుదొంగిలించెనతడు, సగంధులను కూడితక్రసారమ్ము నిశివేళ తస్కరించు వాడ దొంగ యెటుల్ భగవంతుఁడగును.వీడినెవ్విధి గారవింతురు వృద్ధులిందరు నుండగానాడవారలు స్నానమాడగ నంబరమ్ముల నెత్తెనే తోడుగా సఖులండ జూచుక దొంగిలించెను వెన్నెనే వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు దేవుఁడా? *(శిశుపాలుని మాటలుగా)*
పురజనుల మేలు కోరిన గిరిధరుండువేణుగానామృతము పంచి పెట్టువాడుగోపకాంతల యెడదలు కొల్లగొట్టువాడ! దొంగ యెటుల్ భగవంతుఁడగునువీడ కుండగ నెల్ల వేళల వెన్నపూస నవశ్యమున్వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు దేవుఁడా !కోడెకత్తెల పావడాలను కొల్లగొట్టిన ధీరుడా !చూడచక్కని రూపుకల్గిన సుందరాంగుడు దేవుడా !
చీర లెత్తుకు వెళ్లిన చిలిపి వాని పొగడు చుందు ర దే ల కో పొంగి పోయి వెన్న మీగడ కొఱ కు నై వెదుకు చుండు వాడు దొంగ యెటు ల్ భగవంతుడ గును?
ఆడువారలు తానమాడగ అంబరమ్ముల దొంగిలెన్తోడునీడగ గోపబాలురు దొంగలై నడయాడగావాడు యిండ్లను మ్రుచ్చిలించెను పాలు మీగడ వెన్నలన్వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు దేవుఁడా
వెన్న మీగడల్ దొంగిలి తిన్నవాడువాడ కన్నెలు తానములాడుచుండచీరలెత్తుకు పోయిన చిన్నవాడువాడ దొంగ, యెటుల్ భగవంతుఁడగును
తే.గీ:మతము మార్చగ నొక డిట్లు మాట లాడెఅల్లరుల్ జేయుచున్ పోయి గొల్ల యిండ్ల వెన్న గాజేసె కృష్ణుడు ,వినుము పిచ్చి వాడ !దొంగ యెటుల్భగవంతుఁడగును”
2)మ.కో:చేడియల్ వగ తో యశోదను జేరి కృష్ణుని చేష్టలన్వీడ కొక్కటి చెప్పుచుండగ వించు జాలిగ జూచుచున్వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు "దేవుఁడా!చూడు మిచ్చటె యుంటిగా !"యనుచున్ వచించెడు నమ్మతోన్.(కృస్ణు డేవో ఆగాలు చేసా డని స్త్రీలు వచ్చి యశోద తో చెపుతుంటే "దేవుడా! నే నిక్కడే ఉన్నా కదా!అంటాడు కృష్ణుడు యశోద తో.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మగువ లెల్లరు విన మాయ మాట లడర గీత లోనఁ గన్పడు కొన్ని గిరల నుడివి గాంతలను జూచుచుండును గామి బుద్ధి వాడ దొంగ యెటుల్ భగవంతుఁ డగును [వాడు=మ్లాన మవు] ఆఁడుదానిని పాలు త్రాగుచు నంపెఁ గాలుని వీటికే తోడుగా జలకమ్ము లాడఁగ దొంగిలించెను బట్టలే పాఁడి నమ్మెడి గోపకాంతల వారిజాక్షులఁ దన్పెనే వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు దేవుఁడా
మత్తకోకిల :మేడ మిద్దెల చూడబోడుగ మేలు వెన్నను మ్రుచ్చిలన్ కూడియాడుచు గోపబాలుర కూర్మి యిల్లిలు దిర్గునే పీడ రక్కసి మూకలన్ భళి పెక్కు జంపిన బాలుడే వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు దేవుఁడా !
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.బాల్యమున గొనె పూతన ప్రాణములనుమన్ను తింటివట యనుచు వెన్ను నడుగచూపె నోటిలో విశ్వమున్ చోద్యముగనువాడ దొంగ!యెటుల్? భగవంతుడగును.
లోకులు నుడువుచుండిన రూపును విని ,
రిప్లయితొలగించండితనను కోరిన రుక్మిణీ తరుణిని మను
వాడ , దొంగ యెటుల్ ? భగవంతుఁడగును
కోమలికి , తాను వేడిన కోర్కె దీర్చ
తేటగీతి
రిప్లయితొలగించండివెన్న మీగడ దోచియు వీధులిండ్ల
నంగనలు జలకాలాడ తొంగి చూచి
చీరలెత్తుకు పోయిన శ్రీకరుండె!
వాడ? దొంగ! యెటుల్ భగవంతుఁడగును?
మత్తకోకిల
చూడకూడదటన్న జ్ఞానము సుంతయైనను లేకయే
నాడువారలు తానమాడగ నందిపోయెను చీరలన్
తోడు దొంగలు వెంటనంటగ దూరి యిండ్లను వెన్నలన్
వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు దేవుఁడా?
☝☝☝అగ్ర పూజకెంచిన శ్రీకృష్ణుని గురించి శిశుపాలుడు ధర్మరాజుతో.....
తొలగించండి(కృష్ణుని వెన్నదొంగతనం చూసి ఆశ్చర్యపడిన ఓ ఇల్లాలి మాటలు)
రిప్లయితొలగించండిమత్తకోకిల.
వేడుకల్ దరి చేరుచున్నవి వెన్న ముద్దులు మాయమై
నేడు గంటికిఁ గానిపించెను, నిస్తులంబగు నేర్పుతో
ప్రోడయౌచట తస్కరించెను బోసి నవ్వులఁ జింది యా
వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుడు, దేవుడా !!
రిప్లయితొలగించండిజలకములనాడు పడతుల శాటికలను
దొంగిలించెనతడు, సగంధులను కూడి
తక్రసారమ్ము నిశివేళ తస్కరించు
వాడ దొంగ యెటుల్ భగవంతుఁడగును.
వీడినెవ్విధి గారవింతురు వృద్ధులిందరు నుండగా
నాడవారలు స్నానమాడగ నంబరమ్ముల నెత్తెనే
తోడుగా సఖులండ జూచుక దొంగిలించెను వెన్నెనే
వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు దేవుఁడా?
*(శిశుపాలుని మాటలుగా)*
పురజనుల మేలు కోరిన గిరిధరుండు
రిప్లయితొలగించండివేణుగానామృతము పంచి పెట్టువాడు
గోపకాంతల యెడదలు కొల్లగొట్టు
వాడ! దొంగ యెటుల్ భగవంతుఁడగును
వీడ కుండగ నెల్ల వేళల వెన్నపూస నవశ్యమున్
వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు దేవుఁడా !
కోడెకత్తెల పావడాలను కొల్లగొట్టిన ధీరుడా !
చూడచక్కని రూపుకల్గిన సుందరాంగుడు దేవుడా !
చీర లెత్తుకు వెళ్లిన చిలిపి వాని
రిప్లయితొలగించండిపొగడు చుందు ర దే ల కో పొంగి పోయి
వెన్న మీగడ కొఱ కు నై వెదుకు చుండు
వాడు దొంగ యెటు ల్ భగవంతుడ గును?
ఆడువారలు తానమాడగ అంబరమ్ముల దొంగిలెన్
రిప్లయితొలగించండితోడునీడగ గోపబాలురు దొంగలై నడయాడగా
వాడు యిండ్లను మ్రుచ్చిలించెను పాలు మీగడ వెన్నలన్
వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు దేవుఁడా
వెన్న మీగడల్ దొంగిలి తిన్నవాడు
రిప్లయితొలగించండివాడ కన్నెలు తానములాడుచుండ
చీరలెత్తుకు పోయిన చిన్నవాడు
వాడ దొంగ, యెటుల్ భగవంతుఁడగును
తే.గీ:మతము మార్చగ నొక డిట్లు మాట లాడె
రిప్లయితొలగించండిఅల్లరుల్ జేయుచున్ పోయి గొల్ల యిండ్ల
వెన్న గాజేసె కృష్ణుడు ,వినుము పిచ్చి
వాడ !దొంగ యెటుల్భగవంతుఁడగును”
2)మ.కో:చేడియల్ వగ తో యశోదను జేరి కృష్ణుని చేష్టలన్
రిప్లయితొలగించండివీడ కొక్కటి చెప్పుచుండగ వించు జాలిగ జూచుచున్
వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు "దేవుఁడా!
చూడు మిచ్చటె యుంటిగా !"యనుచున్ వచించెడు నమ్మతోన్.
(కృస్ణు డేవో ఆగాలు చేసా డని స్త్రీలు వచ్చి యశోద తో చెపుతుంటే "దేవుడా! నే నిక్కడే ఉన్నా కదా!అంటాడు కృష్ణుడు యశోద తో.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమగువ లెల్లరు విన మాయ మాట లడర
తొలగించండిగీత లోనఁ గన్పడు కొన్ని గిరల నుడివి
గాంతలను జూచుచుండును గామి బుద్ధి
వాడ దొంగ యెటుల్ భగవంతుఁ డగును
[వాడు=మ్లాన మవు]
ఆఁడుదానిని పాలు త్రాగుచు నంపెఁ గాలుని వీటికే
తోడుగా జలకమ్ము లాడఁగ దొంగిలించెను బట్టలే
పాఁడి నమ్మెడి గోపకాంతల వారిజాక్షులఁ దన్పెనే
వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు దేవుఁడా
మత్తకోకిల :
రిప్లయితొలగించండిమేడ మిద్దెల చూడబోడుగ మేలు వెన్నను మ్రుచ్చిలన్
కూడియాడుచు గోపబాలుర కూర్మి యిల్లిలు దిర్గునే
పీడ రక్కసి మూకలన్ భళి పెక్కు జంపిన బాలుడే
వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు దేవుఁడా !
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
బాల్యమున గొనె పూతన ప్రాణములను
మన్ను తింటివట యనుచు వెన్ను నడుగ
చూపె నోటిలో విశ్వమున్ చోద్యముగను
వాడ దొంగ!యెటుల్? భగవంతుడగును.