22-6-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్వేదముం బాయసమ్మని చెప్పి కొనిరి”
(లేదా...)
“స్వేదముఁ బాయసమ్మనుచుఁ జిత్తము రంజిలఁ గ్రోలిరెల్లరున్”
తేటగీతిఘర్మజలము సిందంగ మాగాణి పండుమురిసిపోవుచు జగమెల్ల భుక్తినందుప్రభునికిడెడు నైవేద్యమ్ము, రైతు మేనిస్వేదముం, బాయసమ్మని చెప్పి కొనిరి!ఉత్పలమాలమేదిని కర్షకుల్ వెతల మేనిని ఘర్మజలమ్ము సిందుచున్గాదెల నింపు ధాన్యమదె ఖాద్యము గాదె జగమ్ముకంతకున్మోదము మీర దేవునకుఁ బూజ ప్రసాదమునౌచు, రైతుదౌస్వేదముఁ, బాయసమ్మనుచుఁ జిత్తము రంజిలఁ గ్రోలిరెల్లరున్
పేదలకు విందు సేయుచు పిల్చెనామెముందు వేడిగ పాకము నందజేయక్షుత్తు దీర్చుకొనన్, బోవనొత్తుకొనుచుస్వేదముం, బాయసమ్మని చెప్పి కొనిరిపేదలకై పరిత్రమని వేసవి కాలపు మండుటెండలోసాదము సిద్ధమైనదని చప్పున రండని పిల్చి ముందుగాపైదలి వేడిపాకమును వడ్డన సల్పగ, పోవనొత్తుచున్స్వేదముఁ, బాయసమ్మనుచుఁ జిత్తము రంజిలఁ గ్రోలిరెల్లరున్
తే॥ భువినిఁ గష్టనష్టములకుఁ బోరి నిలిచిసంపదలఁ గన స్వేదము జాలువారుపిదప సౌఖ్యమబ్బ జనులుఁ బ్రియము మీరస్వేదముం బాయసమ్మని చెప్పికొనిరిఉ॥ మేదిని కష్టనష్టములు మిన్నగఁ బొందిన నెందరెందరోమోదము మీర సంపదలఁ బొందిరి ఘర్మజలమ్ము చిందఁగన్సేదయుఁ దీరె నెమ్మదిగ స్వేదము సంపద రూపమొందె నాస్వేదముఁ బాయసమ్మనుచుఁ జిత్తము రంజిలఁ గ్రోలిరెల్లరున్కష్టేఫలీ అండి. అందరూ అనుభవించినదే నండి
వేసవి దినములందలి వేడి నోర్చదాటి వృక్షమొసంగెడు ధవళవర్ణస్వేదముం బాయసమ్మని చెప్పి కొనిరిపల్లె జనులు శరీరపు బాగుగోరి
ఆరు గాలము శ్రమియించు నన్న దాత జనుల కడుపులు నింపెడు శక్తి యుతుడు కష్ట పడుచును చిందించు కమ్మ నైన స్వేద మును పాయసమ్మ ని చెప్పు కొనిరి
అప్పుడెప్పుడొ చేసిన యప్పులనుచుతిరిగి రాబట్టు కొనుటకై దొరలు వారువెట్టి చాకిరి పేరున పేద జనులస్వేదముం బాయసమ్మని చెప్పి కొనిరి.వాదన జేయనేల యిది వాస్తవ మంటిని యాలకించుమాపేదల పాత బాకియని వేతన మిచ్చుట మాని వెట్టియే మోదమటంచు స్వార్థమున భూపతు లెల్ల గరీబు రక్తమున్ స్వేదముఁ బాయసమ్మనుచుఁ జిత్తము రంజిలఁ గ్రోలిరెల్లరున్.
తేటగీతి
రిప్లయితొలగించండిఘర్మజలము సిందంగ మాగాణి పండు
మురిసిపోవుచు జగమెల్ల భుక్తినందు
ప్రభునికిడెడు నైవేద్యమ్ము, రైతు మేని
స్వేదముం, బాయసమ్మని చెప్పి కొనిరి!
ఉత్పలమాల
మేదిని కర్షకుల్ వెతల మేనిని ఘర్మజలమ్ము సిందుచున్
గాదెల నింపు ధాన్యమదె ఖాద్యము గాదె జగమ్ముకంతకున్
మోదము మీర దేవునకుఁ బూజ ప్రసాదమునౌచు, రైతుదౌ
స్వేదముఁ, బాయసమ్మనుచుఁ జిత్తము రంజిలఁ గ్రోలిరెల్లరున్
పేదలకు విందు సేయుచు పిల్చెనామె
రిప్లయితొలగించండిముందు వేడిగ పాకము నందజేయ
క్షుత్తు దీర్చుకొనన్, బోవనొత్తుకొనుచు
స్వేదముం, బాయసమ్మని చెప్పి కొనిరి
పేదలకై పరిత్రమని వేసవి కాలపు మండుటెండలో
సాదము సిద్ధమైనదని చప్పున రండని పిల్చి ముందుగా
పైదలి వేడిపాకమును వడ్డన సల్పగ, పోవనొత్తుచున్
స్వేదముఁ, బాయసమ్మనుచుఁ జిత్తము రంజిలఁ గ్రోలిరెల్లరున్
తే॥ భువినిఁ గష్టనష్టములకుఁ బోరి నిలిచి
రిప్లయితొలగించండిసంపదలఁ గన స్వేదము జాలువారు
పిదప సౌఖ్యమబ్బ జనులుఁ బ్రియము మీర
స్వేదముం బాయసమ్మని చెప్పికొనిరి
ఉ॥ మేదిని కష్టనష్టములు మిన్నగఁ బొందిన నెందరెందరో
మోదము మీర సంపదలఁ బొందిరి ఘర్మజలమ్ము చిందఁగన్
సేదయుఁ దీరె నెమ్మదిగ స్వేదము సంపద రూపమొందె నా
స్వేదముఁ బాయసమ్మనుచుఁ జిత్తము రంజిలఁ గ్రోలిరెల్లరున్
కష్టేఫలీ అండి. అందరూ అనుభవించినదే నండి
వేసవి దినములందలి వేడి నోర్చ
రిప్లయితొలగించండిదాటి వృక్షమొసంగెడు ధవళవర్ణ
స్వేదముం బాయసమ్మని చెప్పి కొనిరి
పల్లె జనులు శరీరపు బాగుగోరి
ఆరు గాలము శ్రమియించు నన్న దాత
రిప్లయితొలగించండిజనుల కడుపులు నింపెడు శక్తి యుతుడు
కష్ట పడుచును చిందించు కమ్మ నైన
స్వేద మును పాయసమ్మ ని చెప్పు కొనిరి
అప్పుడెప్పుడొ చేసిన యప్పులనుచు
రిప్లయితొలగించండితిరిగి రాబట్టు కొనుటకై దొరలు వారు
వెట్టి చాకిరి పేరున పేద జనుల
స్వేదముం బాయసమ్మని చెప్పి కొనిరి.
వాదన జేయనేల యిది వాస్తవ మంటిని యాలకించుమా
పేదల పాత బాకియని వేతన మిచ్చుట మాని వెట్టియే
మోదమటంచు స్వార్థమున భూపతు లెల్ల గరీబు రక్తమున్
స్వేదముఁ బాయసమ్మనుచుఁ జిత్తము రంజిలఁ గ్రోలిరెల్లరున్.