20-6-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే”
(లేదా...)
“కారున్ గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యంబగున్”
శా.శ్రీరాకేశ్వర ఖండ మౌళిని చలచ్ఛీతాఢ్య గంగాధరుం జారు ప్రాభవ రత్నభోగ కలితోత్సర్పావళీ ధారిఁ స ద్ధీరానీక మనస్సరోజ రవినిన్ దివ్యాగ్ర నృత్యన్మహా కారుం గాంచి నమస్కరించినను మోక్షప్రాప్తి లభ్యంబగున్ !
చేరన్ జేరుచుభక్తిమార్గమున రాజీవాక్షు సత్సంగమున్బేరున్ బొందిన గేయకారులనుసంప్రీతిన్ విచారించుచున్దీరున్ జేయగగీర్తనంబులను శ్రీదివ్యా వతారున్శుభాకారున్ గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యంబగున్కొరుప్రోలు రాధాకృష్ణ రావు
కం॥ పారావారపు కాంక్షనుపోరామిని సద్గుణముల పోఁడిమిఁ గనుచున్ధారాళముగ నటు శుభాకారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే!శా॥ పారావారముఁ గోరి సద్గుణములన్ వర్ధిల్లి సత్కార్యముల్ భారంబంచుఁ దలంచకన్ జనుచు నింపారంగఁ గావించుచున్ధారాదత్తము జేసి మానసము సద్భక్తిన్ సదా నిర్మలాకారున్ గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యంబగున్
మండోదరి రావణాసురునితో... కందంనేరక సీతను దెచ్చితె?దారుణములె సంభవించు! ధర్మపరుడనన్శ్రీరామునికొసఁగుము, శుభకారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే!శార్దూలవిక్రీడితముసారాచార విశారదుండవనగన్ సందేహమింకేటికిన్నేరంబౌనయ! లంకఁజేర్చ మహిజన్! నీరేజ పత్రేక్షణుండా రాముండన భక్తితో తిరిగి నీవర్పించుచున్ మోహనాకారున్ గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యంబగున్!
కోరిక యుండిన గూడనుతీరిక లేదనుచు నీవు దేవళమందున్వారము నందొక పరి లయకారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే
కోరిన వరముల నొసఁగుచుతీరుగ భక్తులను బ్రోచు దీనావనునిన్తోరఁపు భక్తిని శాంతాకారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే
హీరుండంబర కేశుడుసారంగుడు వాడె జ్వాలి శంకరుడు క్రియాకారుండు ఖరువు లింగా కారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే.ఆరాధింపడు విశ్వతో ముఖుని సత్యమ్మెప్పుడున్ బల్కకన్ దారిద్ర్యమ్మున నున్నవారికెపుడున్ దా సాయమందింపకన్ మైరేయమ్మును గ్రోలువాడు కడు దుర్మార్గుండతండై క్రియా కారున్ గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యంబగున్? వారవనితలం గూడుచు మైరేయము గ్రోలునట్టి మందుడు వీవైనేరస్థుండవు, లింగాకారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే?గౌరీనాథుని నామకీర్తనమె సత్కార్యంబు గా వారి నేయారాధించుచు మోక్షమార్గమను సత్యాన్వేషనన్ జేయుచున్ దారిద్ర్యంబున మ్రగ్గువారి కెపు డాధారమ్మె తానై క్రియాకారున్ గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యంబగున్.
చేరగ నెంచిన నాకముసారంగుని సానుభూతి సాధ్యంబగునేఘోర తపముతో నిరహంకారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువేసారగ్రీవుని సంప్రసాదమమరన్ సద్భక్తి సేవించుచున్గారుణ్యాలయుడైన వాని కృపకై కాఠిన్యమౌ దీక్షతోఁజేరన్ స్వర్గము సిద్ధమైతివిగదా చిత్రంబుగన్ మంగళాకారున్ గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యంబగున్
సారపు ధర్మా త్ముo డై మీరక హద్ధుల ను సతము మేధావి గ యే వైరము ల నెరు o గని సం స్కా రున్ గని మ్రొ క్క మోక్ష గామి వగు దు వే
శా.
రిప్లయితొలగించండిశ్రీరాకేశ్వర ఖండ మౌళిని చలచ్ఛీతాఢ్య గంగాధరుం
జారు ప్రాభవ రత్నభోగ కలితోత్సర్పావళీ ధారిఁ స
ద్ధీరానీక మనస్సరోజ రవినిన్ దివ్యాగ్ర నృత్యన్మహా
కారుం గాంచి నమస్కరించినను మోక్షప్రాప్తి లభ్యంబగున్ !
చేరన్ జేరుచుభక్తిమార్గమున రాజీవాక్షు సత్సంగమున్
రిప్లయితొలగించండిబేరున్ బొందిన గేయకారులనుసంప్రీతిన్ విచారించుచున్
దీరున్ జేయగగీర్తనంబులను శ్రీదివ్యా వతారున్శుభా
కారున్ గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యంబగున్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
కం॥ పారావారపు కాంక్షను
రిప్లయితొలగించండిపోరామిని సద్గుణముల పోఁడిమిఁ గనుచున్
ధారాళముగ నటు శుభా
కారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే!
శా॥ పారావారముఁ గోరి సద్గుణములన్ వర్ధిల్లి సత్కార్యముల్
భారంబంచుఁ దలంచకన్ జనుచు నింపారంగఁ గావించుచున్
ధారాదత్తము జేసి మానసము సద్భక్తిన్ సదా నిర్మలా
కారున్ గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యంబగున్
మండోదరి రావణాసురునితో...
రిప్లయితొలగించండికందం
నేరక సీతను దెచ్చితె?
దారుణములె సంభవించు! ధర్మపరుడనన్
శ్రీరామునికొసఁగుము, శుభ
కారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే!
శార్దూలవిక్రీడితము
సారాచార విశారదుండవనగన్ సందేహమింకేటికిన్
నేరంబౌనయ! లంకఁజేర్చ మహిజన్! నీరేజ పత్రేక్షణుం
డా రాముండన భక్తితో తిరిగి నీవర్పించుచున్ మోహనా
కారున్ గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యంబగున్!
కోరిక యుండిన గూడను
రిప్లయితొలగించండితీరిక లేదనుచు నీవు దేవళమందున్
వారము నందొక పరి లయ
కారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే
కోరిన వరముల నొసఁగుచు
రిప్లయితొలగించండితీరుగ భక్తులను బ్రోచు దీనావనునిన్
తోరఁపు భక్తిని శాంతా
కారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే
హీరుండంబర కేశుడు
రిప్లయితొలగించండిసారంగుడు వాడె జ్వాలి శంకరుడు క్రియా
కారుండు ఖరువు లింగా
కారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే.
ఆరాధింపడు విశ్వతో ముఖుని సత్యమ్మెప్పుడున్ బల్కకన్
దారిద్ర్యమ్మున నున్నవారికెపుడున్ దా సాయమందింపకన్
మైరేయమ్మును గ్రోలువాడు కడు దుర్మార్గుండతండై క్రియా
కారున్ గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యంబగున్?
వారవనితలం గూడుచు
మైరేయము గ్రోలునట్టి మందుడు వీవై
నేరస్థుండవు, లింగా
కారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే?
గౌరీనాథుని నామకీర్తనమె సత్కార్యంబు గా వారి నే
యారాధించుచు మోక్షమార్గమను సత్యాన్వేషనన్ జేయుచున్
దారిద్ర్యంబున మ్రగ్గువారి కెపు డాధారమ్మె తానై క్రియా
కారున్ గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యంబగున్.
చేరగ నెంచిన నాకము
రిప్లయితొలగించండిసారంగుని సానుభూతి సాధ్యంబగునే
ఘోర తపముతో నిరహం
కారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే
సారగ్రీవుని సంప్రసాదమమరన్ సద్భక్తి సేవించుచున్
గారుణ్యాలయుడైన వాని కృపకై కాఠిన్యమౌ దీక్షతోఁ
జేరన్ స్వర్గము సిద్ధమైతివిగదా చిత్రంబుగన్ మంగళా
కారున్ గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యంబగున్
సారపు ధర్మా త్ముo డై
రిప్లయితొలగించండిమీరక హద్ధుల ను సతము మేధావి గ యే
వైరము ల నెరు o గని సం
స్కా రున్ గని మ్రొ క్క మోక్ష గామి వగు దు వే