శా:ఆ విప్రోత్తము డా ప్రభాతమున గాయత్రిన్ జపించున్ సుధా ప్రాయమ్మో యన నీరమే యొసగుచున్ బ్రార్థించు నా భానునిన్ పూవుల్ బుట్టెడు,పండ్లు,పాకముల తో బూజింపడే?నీటినే నైవేద్యం బిడ, నట్టి పూజయె మాహానందంబునుం గూర్చెడిన్” (సంధ్యావందనం లో ఒక ప్రత్యేకత ఉంది.అక్కడ ఖాద్యాలు నివేదించ నవసరం లేదు.నీటినే నైవేద్యం గా ఇచ్చే ఆ పూజ ఒకరికి నచ్చినట్టు.నీటినే నైవేద్యమ్మిడన్+అట్టి పూజయె అని విడగొట్టాను.)
13 కామెంట్లు:
కందం
దైవము కోరునె బలులను
భావమ్మున భక్తులెల్ల పాయసములతో
సేవలొనర్పఁగ మాంసపు
నైవేద్యము లేని పూజ నచ్చిరి భక్తుల్
శార్దూలవిక్రీడితము
దైవంబెప్పుడు కోరడంచు బలులన్ తత్త్వాన భక్త్యాత్ములై
భావంబందున చిత్తశుద్ధి నిలుపన్ భక్ష్యంపు శాకాలతో
సేవింపంగను గూడ భక్తులటనే క్షీరాలతో, మాంసపున్
నైవేద్యం బిడనట్టి పూజయె మహానందంబునుం గూర్చెడిన్
భావము కలుషిత మగుచున్
దేవున కర్పించు నట్టి దివ్యపు వంటల్
కావవి ప్రియమె వ్వా రికి
నైవేద్యము లేని పూజ నచ్చిరి భక్తుల్
దేవళమందలి పూజరి
యా వేల్పును తృప్తిబరచ నాహారముగన్
లావయిన మేక నెంచగ
నైవేద్యము లేని పూజ నచ్చిరి భక్తుల్
దైవాధీనులు దీనులు
దేవాలయమునకు చేరి దేవుని గనుచున్
వైవిధ్యంబుగఁ గొలిచిరి
నైవేద్యము లేని పూజ నచ్చిరి భక్తుల్
దైవాధీనములైన జన్మలుగదా దారిద్ర్యమున్ బొందినన్
దేవామమ్ములఁ బ్రోవుమంచు సిసువుల్ దీనంబుగావేడుచున్
వైవిధ్యంబగు రీతి సల్పితిరహో వారచ్చటన్ బూజలే
నైవేద్యం బిడనట్టి పూజయె మహానందంబునుం గూర్చెడిన్
దైవంబున్ మది నిల్పి భక్తి కదురన్ తాదాత్మ్యముం జెందుచున్
జీవుండున్ భగవానుడొక్కటనుచున్ చింతించి చేతమ్మునన్
భావింపన్ నిరుపేద మానవుల సేవా భాగ్యమే పూజగా
నైవేద్యం బిడనట్టి పూజయె మహానందంబునుం గూర్చెడిన్
దైవము మదిలో గలఁడని
భావన జేయవలె భక్తి భావము గదురన్
జీవులకదియే మేలని
నైవేద్యము లేని పూజ నచ్చిరి భక్తుల్
దైవమ్మే కనగ సకల
జీవుల రక్షించునట్టి చేతను డతడే
యా విశ్వపునకు కలిమపు
నైవేద్యము లేని పూజ నచ్చిరి భక్తుల్.
ఆ విశ్వేశ్వరుడద్రిజాత మతడే యగ్రాహ్యుడీ సృష్టిలో
జీవశ్రేణిని రక్షజేయునతడే క్షేమంబు నేగూర్చెడిన్
దైవంబంచును కీర్తినందుకొను ప్రత్యక్షేత్రకున్ కౌచనే
నైవేద్యం బిడనట్టి పూజయె మహానందంబునుం గూర్చెడిన్.
కం॥ దైవమ్మె యొసఁగ నన్నియు
నా వేద్యము నెరిఁగి భక్తి ననిశముఁ గనఁగన్
నీవే దిక్కనిఁ జాలని
నైవేద్యము లేని పూజ నచ్చిరి భక్తుల్
శా॥ దైవమ్మేఁ గద సర్వమిచ్చినది సంత్రాణమ్ము మోదమ్మునున్
నీవే దిక్కని సద్గుణమ్మొదవుచున్ నిత్యమ్ము నిష్ఠాధృతిన్
భావాబ్ధిన్ గని భక్తి తత్పరతతోఁ బ్రార్థించినం జాలదే
నైవేద్యం బిడనట్టి పూజయె మహానందంబునుం గుర్చెడిన్
కం:కావించి జంతు బలులన్
సేవింతురు కొంద రిచట శివరాత్రులలో
నీ వత్సరమున మాంసపు
నైవేద్యము లేని పూజ నచ్చిరి భక్తుల్”
శా:ఆ విప్రోత్తము డా ప్రభాతమున గాయత్రిన్ జపించున్ సుధా
ప్రాయమ్మో యన నీరమే యొసగుచున్ బ్రార్థించు నా భానునిన్
పూవుల్ బుట్టెడు,పండ్లు,పాకముల తో బూజింపడే?నీటినే
నైవేద్యం బిడ, నట్టి పూజయె మాహానందంబునుం గూర్చెడిన్”
(సంధ్యావందనం లో ఒక ప్రత్యేకత ఉంది.అక్కడ ఖాద్యాలు నివేదించ నవసరం లేదు.నీటినే నైవేద్యం గా ఇచ్చే ఆ పూజ ఒకరికి నచ్చినట్టు.నీటినే నైవేద్యమ్మిడన్+అట్టి పూజయె అని విడగొట్టాను.)
(3)శా:సేవింపన్ బలు గ్రామదేవతల రాశిన్ బోసి మాంసమ్మునే
నైవేద్యం బిడ నట్టి పూజయె మాహానందంబునుం గూర్చెడిన్
యావత్తామసభక్తపాళికిని ,విప్రాచార్యుకున్ మాంసమే
నైవేద్య మ్మిడనట్టి పూజయె మహానందంబునున్ గూర్చెడిన్.
(ఇక్కడ సమస్యని భిన్నార్థాలలో రెండు సార్లు.రెండవ పాదం లో నైవేద్యమ్మిడన్+అట్టి పూజ.నాలుగవ పాదం లో నైవేద్య మ్మిడనట్టి పూజ అని వ్యతిరేకార్థం లో.)
ఈ విశ్వాసము గొప్పది
భావి జనులకు నవినీతి వాపఁగ నిలలోఁ
గావుండని నేతల కే
నైవేద్యము లేని పూజ నచ్చిరి భక్తుల్
కైవారమ్ములు సేసి చక్కఁగను శాఖాప్రాశ నౌచిత్య ని
త్యావిష్కార సమర్థ భక్ష్యముల నిత్యం బిమ్ము దేవాళికిన్
దైవశ్రేణికి భక్తియుక్త మయినం ద్యాజ్యం బశుద్ధంపు టే
నైవేద్యం బిడ నట్టి పూజయె మహానందంబునుం గూర్చెడిన్
పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
దేవుడు కోరడు బలులని
సేవలు చేయంగ తెచ్చె క్షీరాన్నముతో
పూవులు,ఫలముల్; మాంసపు
నైవేద్యము లేని పూజ నచ్చిరి భక్తుల్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి