28-6-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“యాగ మొనరించు వారు మద్యమును గొంద్రు”
(లేదా...)
“యాగంబుం బొనరించు వారలకు మద్యంబిచ్చుటే యొప్పగున్”
తేటగీతియాగమొనరింప మౌనులు నాజ్యమెంత్రుయుగ్రవాదుల మారణహోమమెంచిమానవత్వమన్నది పాయ, పూని దుష్టయాగ మొనరించు వారు మద్యమును గొంద్రు!
శార్దూలవిక్రీడితముయాగంబెంచి మునీశ్వరుల్ భువిని నాజ్యంబగ్నికర్పించుచున్సాగింపన్దగు గాదె లోకహితమున్ సాధించు సంకల్పమైదాగన్ మారణహోమమున్ సలుపుగోదానుగ్రవాదంపు దుర్యాగంబుం బొనరించు వారలకు మద్యంబిచ్చుటే యొప్పగున్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పూర్వ జన్మపు బుణ్యంబు బొసగు ననగపౌరు లందరి క్షేమంబు గోరు నపుడుతీరు లోకక ళ్యాణమై దేలు మధువుయాగ మొనరించు వారు మద్యమును గొంద్రుకొరుప్రోలు రాధాకృష్ణ రావు
తల్లిదండ్రుల నీతము దప్పినంతదుష్ట సాంగత్యము బడసి దుష్టులగుచుమంచి తలపుల గావించ మనసునుండిత్యాగ మొనరించు వారు మద్యమును గొంద్రు
శా.జాగృద్దర్ప విశేష భావములెదన్ జ్వాలల్ వలెన్ రేగి యాభోగాళిన్, సిరి, వేల్పులేమలను వే పూర్ణమ్ముగా దక్కగం బ్రాగద్రిన్ దనుజేంద్రుఁ గోర్కెకయి దుర్వారోగ్ర హింసల్ సదా యాగంబుం బొనరించు వారలకు మద్యంబిచ్చుటే యొప్పగున్ !
సంతతమ్మితరుల వినాశమును గోరుక్షుద్ర పూజలు నిర్వహించు జురభుండుతాను హద్దుల దాటి యధర్మపు శవయాగ మొనరించు వారు మద్యమును గొంద్రు.భోగాలెన్నియొ కోరువారలకిటన్ మోదమ్మునే కూర్చ కాయోగుల్ స్వాములు స్వార్థ చిత్తమున నత్యుత్సా హమున్ జూపుచున్ సాగింపన్ దలబోయు దుర్మతులకున్ సంతృప్తి కై క్షుద్రమౌయాగంబుం బొనరించు వారలకు మద్యంబిచ్చుటే యొప్పగున్.
తోటయింటను బ్రతుకు సంతోషమిడగభోగ మలరగ మత్తున మునిగి తేలినిలిచి యెన్నిక లందున గెలుపు కోరి యాగ మొనరించు వారు మద్యమును గొంద్రుసాగింపన్ వలె మత్తులోన బ్రతుకుల్ సంతృప్తి చేకూరగాభోగాలందునఁ దేలియాడు ప్రముఖుల్ మోసాల ముంచెత్తుచున్వాగాడంబరులై సదా పదవులే వాంఛించుచున్ గెల్పుకైయాగంబుం బొనరించు వారలకు మద్యంబిచ్చుటే యొప్పగున్
భక్తి శ్రద్ధ ల తోడుత పరమ శివుని ధ్యాన మందున మునుగ రే జ్ఞాను లగుచు యాగ మొనరించు వారు :: మద్యమును గొంద్రు దురిత ములు సేయ బూనెడు దుష్ట జనులు
తేటగీతి
రిప్లయితొలగించండియాగమొనరింప మౌనులు నాజ్యమెంత్రు
యుగ్రవాదుల మారణహోమమెంచి
మానవత్వమన్నది పాయ, పూని దుష్ట
యాగ మొనరించు వారు మద్యమును గొంద్రు!
శార్దూలవిక్రీడితము
తొలగించండియాగంబెంచి మునీశ్వరుల్ భువిని నాజ్యంబగ్నికర్పించుచున్
సాగింపన్దగు గాదె లోకహితమున్ సాధించు సంకల్పమై
దాగన్ మారణహోమమున్ సలుపుగోదానుగ్రవాదంపు దు
ర్యాగంబుం బొనరించు వారలకు మద్యంబిచ్చుటే యొప్పగున్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూర్వ జన్మపు బుణ్యంబు బొసగు ననగ
రిప్లయితొలగించండిపౌరు లందరి క్షేమంబు గోరు నపుడు
తీరు లోకక ళ్యాణమై దేలు మధువు
యాగ మొనరించు వారు మద్యమును గొంద్రు
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
తల్లిదండ్రుల నీతము దప్పినంత
రిప్లయితొలగించండిదుష్ట సాంగత్యము బడసి దుష్టులగుచు
మంచి తలపుల గావించ మనసునుండి
త్యాగ మొనరించు వారు మద్యమును గొంద్రు
శా.
రిప్లయితొలగించండిజాగృద్దర్ప విశేష భావములెదన్ జ్వాలల్ వలెన్ రేగి యా
భోగాళిన్, సిరి, వేల్పులేమలను వే పూర్ణమ్ముగా దక్కగం
బ్రాగద్రిన్ దనుజేంద్రుఁ గోర్కెకయి దుర్వారోగ్ర హింసల్ సదా యాగంబుం బొనరించు వారలకు మద్యంబిచ్చుటే యొప్పగున్ !
రిప్లయితొలగించండిసంతతమ్మితరుల వినాశమును గోరు
క్షుద్ర పూజలు నిర్వహించు జురభుండు
తాను హద్దుల దాటి యధర్మపు శవ
యాగ మొనరించు వారు మద్యమును గొంద్రు.
భోగాలెన్నియొ కోరువారలకిటన్ మోదమ్మునే కూర్చ కా
యోగుల్ స్వాములు స్వార్థ చిత్తమున నత్యుత్సా హమున్ జూపుచున్
సాగింపన్ దలబోయు దుర్మతులకున్ సంతృప్తి కై క్షుద్రమౌ
యాగంబుం బొనరించు వారలకు మద్యంబిచ్చుటే యొప్పగున్.
తోటయింటను బ్రతుకు సంతోషమిడగ
రిప్లయితొలగించండిభోగ మలరగ మత్తున మునిగి తేలి
నిలిచి యెన్నిక లందున గెలుపు కోరి
యాగ మొనరించు వారు మద్యమును గొంద్రు
సాగింపన్ వలె మత్తులోన బ్రతుకుల్ సంతృప్తి చేకూరగా
భోగాలందునఁ దేలియాడు ప్రముఖుల్ మోసాల ముంచెత్తుచున్
వాగాడంబరులై సదా పదవులే వాంఛించుచున్ గెల్పుకై
యాగంబుం బొనరించు వారలకు మద్యంబిచ్చుటే యొప్పగున్
భక్తి శ్రద్ధ ల తోడుత పరమ శివుని
రిప్లయితొలగించండిధ్యాన మందున మునుగ రే జ్ఞాను లగుచు
యాగ మొనరించు వారు :: మద్యమును గొంద్రు
దురిత ములు సేయ బూనెడు దుష్ట జనులు