ఉ: నా డత డొక్క సైనికుడు, నాశ మొనర్చుచు శత్రుసేనలన్ కూడగ జేసె భద్రతను,కుట్రల వమ్మొనరించి వృద్ధుడై వీడెను సైన్యమున్ , తనను వీడదు మద్యము, దాని నెంచుచున్ పీడను బాపినట్టి రణవిక్రము నెల్లరు దూలనాడిరే” (అతను గొప్ప సైనికుడు.కానీ మద్యము అలవాటైంది.అతడి వీరత్వాన్ని పక్కన బెట్టి అతని మద్యపానాన్ని మాత్రం ఎంచి అందరూ తూలనాడారు.)
27 కామెంట్‌లు:
ఉత్పలమాల
చీడగ దాపురించి ప్రజ చిత్తములందున భీతినింపగన్
గూడుచు సత్యతో ననిని క్రూరుని జంపగ నందగోపుడున్
వాడల దీపముల్ వెలుగ పాడిగ స్తోత్రము సేసి దుఃఖమన్
బీడను బాపినట్టి రణవిక్రమునిం దులనాడి రెల్లరున్!
(తులనాడు = తులన్ + ఆడు
స్తవములతో తూచి నారను భావము)
వాడొక దుండగీడు యనుభావ్యము కానివి కోరుచుండు నా
కీడులొనర్చి సజ్జనుల క్లేశములందున మున్గజేయు నా
చీడనుగూర్చు కీటమును చెచ్చెర ద్రుంచ దురమ్మునందు నా
పీడను బాపినట్టి రణవిక్రమునిం దులనాడి రెల్లరున్
పలు తడవులుగ మందును పంట కొసగె
పీడఁ బాప ; నతనిఁ దూలనాడి రెల్ల
దాని ఫలిత మెటులనుచు దలచ కుండ ,
బాగు కోరుచు జేయగ ఫలిత మిదియె
*(విరటుని సభలో ఉత్తరుని విజయమునెరగిన పిమ్మట కంకుభట్టుతో విరటుని మాటలుగా)*
పేడి వాడిని శూరుండు వీరుడనుచు
పొగడుటది యెంత మాత్రమ్ము తగదు గాదె
మూర్ఖు డాతడు కనగ నపుంసకుడని
పీడఁ బాప నతనిఁ దూలనాడి రెల్ల.
పేడిని యెక్కటీడనుచు భీరువు కాడు ప్రచండు డాతడై
మేడెము గెల్చి వచ్చునని మీరు వచించుట భావ్యమే టన్
తోడుగ నున్న షండకుని స్తోత్రము జేతువె పందనంచు నా
పీడను బాపినట్టి రణవిక్రమునెల్లరు దూలనాడిరే.
పాడు పనులను జేసె డి వాని నణ చ
మెచ్చు కొని యె ను జనతతి హి చ్చు గాను
పీడ బాప నతని :: తూల నాడి రెల్ల
దురిత మొనరించు వానిని దుష్టు డనుచు
యుద్ధ వీరుడని వచింతు రిద్ధరిత్రిఁ
రాజ్య విస్తరణాకాంక్ష రగులుకొనగ
వేల కొలదిగ బలిగొన్న వెర్రివాడు
పీడఁ బాప నతనిఁ దూలనాడి రెల్ల
వాడొక యుద్ధవీరుడని వాకొను చుంద్రు చరిత్రకారులే
వీడక పట్టుబట్టి తన వెర్రికి వేలను మట్టుబెట్టగా
కీడొనరించినట్టి ఘన కీర్తిని బొందిన మూర్ఖుడాతడే
పీడను బాపినట్టి రణవిక్రము నెల్లరు దూలనాడిరే
[పీడ = కరుణ, దయ]
తోడును నీడగా నిలిచి తోషము నింపెడు నాప్తమిత్రునిన్
వేడుక రమ్మనంగ వెనువెంటనె వచ్చియు దన్ను నిల్చెడిన్
మేడలు మిద్దెలే గనుచు మేలగు స్నేహము చిన్నబుచ్చుచున్
“ పీడను బాపినట్టి, రణవిక్రము నెల్లరు దూలనాడిరే"
కీడును చేయువాడు ఘన కీర్తిని బొందును ఝర్ఝరమ్మునన్
తే.గీ:ఉగ్రవాదుల దుశ్చర్య లోర్చకుండ
శత్రు దేశముననె వారి సంహరించి
పీడఁ బాప, నతనిఁ దూలనాడి రెల్ల”
యన్యపక్షములు ప్రథాని యనిన పడక.
నాల్గవ పాదం:
పీడను బాపినట్టి రణవిక్రము నెల్లరు దూలనాడిరే
ఉ: నా డత డొక్క సైనికుడు, నాశ మొనర్చుచు శత్రుసేనలన్
కూడగ జేసె భద్రతను,కుట్రల వమ్మొనరించి వృద్ధుడై
వీడెను సైన్యమున్ , తనను వీడదు మద్యము, దాని నెంచుచున్
పీడను బాపినట్టి రణవిక్రము నెల్లరు దూలనాడిరే”
(అతను గొప్ప సైనికుడు.కానీ మద్యము అలవాటైంది.అతడి వీరత్వాన్ని పక్కన బెట్టి అతని మద్యపానాన్ని మాత్రం ఎంచి అందరూ తూలనాడారు.)
దుష్టుడాతఁడు పీడించు శిష్ట జనుల
కోలుపులి గాని కనిపించు గోవువోలె
సలుపు యాగడములనింక సైపలేక
పీడఁ బాప నతనిఁ దూలనాడి రెల్ల
అక్కఱకు రాని యుక్తులు వెక్కసముగ
నున్న నేమి ఫలం బని యెన్ని యెదల
శక్తిమంతుండు నైనను శంక నూనఁ
బీడఁ బాప నతనిఁ దూలనాడి రెల్ల
[పీడఁ బాపను+అతని = పీడఁ బాపుటకై యతనిఁ]
వీఁ డొక విక్రముం డట వివేక విహీనుఁడు నిర్దయుండు దా
నోడక చేసె రాజునకు నోర్వఁగ రాని యకృత్య మివ్విధిన్
వేడుక గాఁగ నాశనము వేదన రాజ కుమారి పాణి సం
పీడను బాపి నట్టి రణ విక్రము నెల్లరు తూలనాడిరే
రయముగరణరంగమునందురథమునడపి
జయముకూర్చినవానిని సంతసమున
సన్నుతింపక, నీసుతో ,సత్వరముగ
పీడఁ బాప నతని దూలనాడి రెల్ల”*
Plsee
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పేడియునైనచూపనటవీరము పార్థుడు యుద్ధమందుతా
తోడుగ నున్ననుత్తరుడు తోషము నొందెను గాంచివీరమున్
వాడలనున్నవా రలదివాసిగ నెంచక క్రీడి సాయమున్
*“పీడను బాపినట్టి రణవిక్రమునెల్లరు దూలనాడిరే ”*
ధన్యవాదాలు గురూజీ 🙏
ఆటవెలది
ప్రజల బాధపెట్టు పాపి నరకుఁ జంప
సత్యభామఁ గృష్ణు స్తవములల్లి
యమవసనిశి వెలుగు నమరజేయుచు వాని
పీడఁ బాపఁగఁ దులనాడి రెల్ల!
(తులనాడు = తులన్ + ఆడు
స్తవములతో తూచి నారను భావము)
పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
హరుడు శిశుపాలుని సభను(లో)హత్య చేయ
సంతసించుచు నచ్చటి సభికులంత
పీడఁ బాప నతనిఁ దూలనాడి రెల్ల
నీచముగ నతడు హరుని నింద చేయ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి