19-6-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వరద మేలొసంగుఁ బ్రజల కెపుడు”
(లేదా...)
“మేలు నొసంగదే వరద మేదిని నెల్లరు సంతసిల్లరే”
ఆటవెలదిదేశమందు రైతు కాశలు దీర్చెడుపథకమొకటి నీటిపారుదలకుసాయమన నదులనుసంధానమైనచోవరద మేలొసంగుఁ బ్రజల కెపుడుఉత్పలమాలపాలకులెల్లరున్ నదులు భారతమందున మేళవించెడున్గీలక మైన కార్యమును క్లిష్టమునైనను పూర్తి చేసినన్జాలును నీటిపారుదల సాగును రైతుకు శ్రేయమెంచుచున్మేలు నొసంగదే వరద మేదిని నెల్లరు సంతసిల్లరే
ఆ.వె.నీవె దెసయు గతియు నీలకంధర దేవ !నీవె మదిని నిలుచు భావమెపుడుభక్తి మీఱ మ్రొక్కి బాధ కూల కిరీటివరద ! మేలొసంగు ప్రజలకెపుడు !
సతము నిన్ను కొలుచు జనులను గావవేవరద ! మేలొసంగుఁ బ్రజల కెపుడుముక్తి గోరు కొనుచు బూజించు చుండిన ,యపుడె వారి కున్న యాద తొలగు
వసుధ రాలినట్టి వర్షపు చినుకులన్ నిలువ చేయదలచి కొలనులనటసిద్ధ పరచి నంత చింతింప పనియేల వరద మేలొసంగుఁ బ్రజల కెపుడునేలకు రాలు గోఘృతపు నీటిని తామిక సాగునీరుగాచేలకు పంపనెంచి హలజీవులు నింప జలాశయమ్మునేకాలువలెన్నొ త్రవ్వినను క్షత్రము కోసము ముందుచూపుతో మేలు నొసంగదే వరద మేదిని నెల్లరు సంతసిల్లరే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కొన్ని రోజులుగా ప్రయాణాల కారణంగా పూరణలు ఇక్కడ ఉంచలేక పోయానండి
ఆ॥ భక్తి తనర నమ్మ ప్రార్థన నిరతముఁగనఁగ శిరము వంచి కలతఁ బాపుకనికరించి ప్రోచు కాత్యాయణి భువినివరద మేలొసంగుఁ బ్రజల కెపుడుఉ॥ పాలనఁ జేయు నమ్మ భవబాధల నిత్యముఁ బాపుచున్ గృపాహేలను ప్రోచు నమ్మ నిజ హేమపు ఛాయను పల్లవించెడున్మ్రోలను జేరి భక్తిఁగని మ్రొక్కినఁ జాలు దయాంతరంగయైమేలు నొసంగదే! వరద, మేదిని నెల్లరు సంతసిల్లరే!వరద దుర్గ
నిత్యదర్శనమిడు నింద్ర కీలాద్రిపైమనకు గోచరించు కనకదుర్గకోర్కె లన్ని దీరు కొండచూలికిఁ మ్రొక్కవరద మేలొసంగుఁ బ్రజల కెపుడుశైలజ కొల్వుదీరెనట చల్లని తల్లిగ నింద్రకీలమన్మేలినగంబుపై జనులు మెచ్చిన రీతిని కొండచూలిగాజాలిని చూపిభక్తులకు సాయమొసంగును భద్రకాళిగామేలు నొసంగదే వరద మేదిని నెల్లరు సంతసిల్లరే
పాడి పంట లెల్ల బాగుగా వృద్ధి యై కర్ష కాళి మిగుల హర్ష ముగను సేద్య మందు మునిగి జీవింప హేతు వై వరద మేలొ సంగు ప్రజల కెపుడు
ఆటవెలది
రిప్లయితొలగించండిదేశమందు రైతు కాశలు దీర్చెడు
పథకమొకటి నీటిపారుదలకు
సాయమన నదులనుసంధానమైనచో
వరద మేలొసంగుఁ బ్రజల కెపుడు
ఉత్పలమాల
పాలకులెల్లరున్ నదులు భారతమందున మేళవించెడున్
గీలక మైన కార్యమును క్లిష్టమునైనను పూర్తి చేసినన్
జాలును నీటిపారుదల సాగును రైతుకు శ్రేయమెంచుచున్
మేలు నొసంగదే వరద మేదిని నెల్లరు సంతసిల్లరే
ఆ.వె.
రిప్లయితొలగించండినీవె దెసయు గతియు నీలకంధర దేవ !
నీవె మదిని నిలుచు భావమెపుడు
భక్తి మీఱ మ్రొక్కి బాధ కూల కిరీటి
వరద ! మేలొసంగు ప్రజలకెపుడు !
సతము నిన్ను కొలుచు జనులను గావవే
రిప్లయితొలగించండివరద ! మేలొసంగుఁ బ్రజల కెపుడు
ముక్తి గోరు కొనుచు బూజించు చుండిన ,
యపుడె వారి కున్న యాద తొలగు
రిప్లయితొలగించండివసుధ రాలినట్టి వర్షపు చినుకులన్
నిలువ చేయదలచి కొలనులనట
సిద్ధ పరచి నంత చింతింప పనియేల
వరద మేలొసంగుఁ బ్రజల కెపుడు
నేలకు రాలు గోఘృతపు నీటిని తామిక సాగునీరుగా
చేలకు పంపనెంచి హలజీవులు నింప జలాశయమ్మునే
కాలువలెన్నొ త్రవ్వినను క్షత్రము కోసము ముందుచూపుతో
మేలు నొసంగదే వరద మేదిని నెల్లరు సంతసిల్లరే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికొన్ని రోజులుగా ప్రయాణాల కారణంగా పూరణలు ఇక్కడ ఉంచలేక పోయానండి
తొలగించండిఆ॥ భక్తి తనర నమ్మ ప్రార్థన నిరతముఁ
తొలగించండిగనఁగ శిరము వంచి కలతఁ బాపు
కనికరించి ప్రోచు కాత్యాయణి భువిని
వరద మేలొసంగుఁ బ్రజల కెపుడు
ఉ॥ పాలనఁ జేయు నమ్మ భవబాధల నిత్యముఁ బాపుచున్ గృపా
హేలను ప్రోచు నమ్మ నిజ హేమపు ఛాయను పల్లవించెడున్
మ్రోలను జేరి భక్తిఁగని మ్రొక్కినఁ జాలు దయాంతరంగయై
మేలు నొసంగదే! వరద, మేదిని నెల్లరు సంతసిల్లరే!
వరద దుర్గ
నిత్యదర్శనమిడు నింద్ర కీలాద్రిపై
రిప్లయితొలగించండిమనకు గోచరించు కనకదుర్గ
కోర్కె లన్ని దీరు కొండచూలికిఁ మ్రొక్క
వరద మేలొసంగుఁ బ్రజల కెపుడు
శైలజ కొల్వుదీరెనట చల్లని తల్లిగ నింద్రకీలమన్
మేలినగంబుపై జనులు మెచ్చిన రీతిని కొండచూలిగా
జాలిని చూపిభక్తులకు సాయమొసంగును భద్రకాళిగా
మేలు నొసంగదే వరద మేదిని నెల్లరు సంతసిల్లరే
పాడి పంట లెల్ల బాగుగా వృద్ధి యై
రిప్లయితొలగించండికర్ష కాళి మిగుల హర్ష ముగను
సేద్య మందు మునిగి జీవింప హేతు వై
వరద మేలొ సంగు ప్రజల కెపుడు