11, నవంబర్ 2025, మంగళవారం

సమస్య - 5302

12-11-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శల్యుఁడు ధర్మజునకెంతొ సాయమొనర్చెన్”
(లేదా...)
“శల్యుఁడు మేనమామనని సాయ మొనర్చెను ధర్మసూతికిన్”

6 కామెంట్‌లు:

  1. ఉ.
    తుల్యము లేని వాడనను తూరుపు బిడ్డ కుమారునాజి సా
    ఫల్యము లేని వీరునిగ పద్ధితి మల్చుచు బల్కుతూపుచే
    లౌల్యము గ్రుంగ దీసి తగు లక్ష్యము గెల్చి ప్రతిజ్ఞ నిల్పెనా
    శల్యుడు మేనమామనని సాయ మొనర్చె ధర్మసూతికిన్ !

    రిప్లయితొలగించండి
  2. కందం
    లౌల్యమునలొంగి తుది విష
    తుల్యుఁడనఁగ కర్ణుఁడోడ దుర్యోధను వై
    ఫల్యమునెంచి రణమునన్
    శల్యుఁడు ధర్మజునకెంతొ సాయమొనర్చెన్

    ఉత్పలమాల
    లౌల్యము మీరి కౌరవుల రంధిని జిక్కియు యుద్ధమందు సా
    ఫల్యమునొంద పాండవులు పాత్రతఁ దప్పెడి రీతి కర్ణ వై
    ఫల్యమె ముఖ్యమన్ బగిదిఁ బల్కులనొల్కుచు సాగి సాదిగన్
    శల్యుఁడు మేనమామనని సాయ మొనర్చెను ధర్మసూతికిన్

    రిప్లయితొలగించండి
  3. బాల్యపు విరోధి నంటగ
    మూల్యము జెల్లించుటకయి పోరున కర్ణున్
    తుల్యుడవు కావని యడచి
    శల్యుఁడు ధర్మజునకెంతొ సాయమొనర్చెన్

    రిప్లయితొలగించండి

  4. శల్యుడు కుచ్చితుడై వై
    ఫల్యము కర్ణుండగు విధి భండన మందున్
    శల్యపు మాటలు రువ్వుచు
    శల్యుఁడు ధర్మజునకెంతొ సాయమొనర్చెన్.


    శల్యుడు కర్ణ సారథిగ సంగర మందున నంగరాజు వై
    ఫల్యము చెందు నట్లుగనబాసి విధమ్మనిశమ్మ తండ నిన్
    శల్యపు పల్కులందు నభి షంగము జేయుచు కించ పర్చుచున్
    శల్యుఁడు మేనమామనని సాయ మొనర్చెను ధర్మసూతికిన్.

    రిప్లయితొలగించండి
  5. శల్యుని సారధ్యమ్మున
    మూల్యము చెల్లించెనార్కి పోరాటములో
    తుల్యుడగు నరుడు చెలగన్
    శల్యుఁడు ధర్మజునకెంతొ సాయమొనర్చెన్

    శల్యుడు రాజరాజునకు చప్పున తప్పుగ మాటయిచ్చి ప్రా
    బల్యము కల్గియున్న కురుపక్షము చేరెను యుద్దమందునన్
    లౌల్యము పాండుపుత్రులకు లబ్ధిని గూర్చుట కాకపోవునా
    శల్యుఁడు మేనమామనని సాయ మొనర్చెను ధర్మసూతికిన్

    రిప్లయితొలగించండి
  6. కుల్యుడవుగాక పార్థుని
    తౌల్యుడు గావంచు సూతతనయుఁ మనో వై
    కల్యమునకు కారణమై
    శల్యుఁడు ధర్మజునకెంతొ సాయమొనర్చెన్

    రిప్లయితొలగించండి