20-11-2025 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“విముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె”(లేదా...)“విముఖుండై పతి వీడి పోయెననుచున్ బ్రీతిన్ గనెన్ సాధ్వియే”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మ.అమితోన్మత్త కర ప్రమాద విష మద్యాసక్తి సామీప్యుడై కమనీయంబగు జీవితంబున ననుం గష్టంబులం ద్రోసె విశ్వమయుండౌ హరికై యుపాస్తులను సల్పన్ మానె బానంబిటన్ విముఖుండై పతి వీడి పోయెననుచుం బ్రీతిం గనెన్ సాధ్వియే !
సుముఖుడు దయార్ధ హృదయుడు సుగుణశీలిసతము పరుల మేల్గోరెడు సజ్జనుండుసత్యసంధుడె యగుచు దుష్కృత్యములకువిముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె ఆకుల శాంతి భూషణ్ వనపర్తి
వ్యసనములకు బానిసయైన పతిని గూర్చిపరితపించుచు పూజింప పరమశివునిపడతి వాంఛితమీడేరి వ్యసనములకువిముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె
అందగాడనుచు నతిపలందరు భర్త వైపు మొగ్గుజూపించుట పసిగొనంగ ,పొరుగున సఖి దన మగని పొందుగోర విముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె
మత్తికాడు పతియటంచు మగువ యెఱగి సహనమును జూపి మార్చగా సహచరండు విలువ జవరాలు లన్నను వెగటు గలిగి విముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె.విమలుండంచును బంధువుల్ తెలుపగా స్వీకారమున్ జేయ నా రమణుండే రత తాలియై చెలగ నారాటమ్ము తా జెందకన్కమితన్మార్చగ వాడు మంజికల పై గారాబమున్ వీడగా విముఖుండై పతి వీడి పోయెననుచున్ బ్రీతిన్ గనెన్ సాధ్వియే.
తేటగీతివ్యసనములచేత విత్తము వ్యయము గాగపోషణంబుకు తిండియె పుట్టదయ్యబాలల చదువు కెట్లన వాటి పట్లవిముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె! మత్తేభవిక్రీడితముసుముఖుండై చెడు నేస్తునిన్ గలువఁగన్ శోకంబునన్ నష్టమెట్లు మహమ్మారులు కల్గ జేయుదురనన్ రోదించి వాగ్రుచ్చఁగన్నిముషంబైనను వెంటరాని సఖునిన్ నిందించి యా నేస్తుఁడున్విముఖుండై పతి వీడి పోయెననుచున్ బ్రీతిన్ గనెన్ సాధ్వియే!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమ.
తొలగించండిఅమితోన్మత్త కర ప్రమాద విష మద్యాసక్తి సామీప్యుడై
కమనీయంబగు జీవితంబున ననుం గష్టంబులం ద్రోసె వి
శ్వమయుండౌ హరికై యుపాస్తులను సల్పన్ మానె బానంబిటన్
విముఖుండై పతి వీడి పోయెననుచుం బ్రీతిం గనెన్ సాధ్వియే !
సుముఖుడు దయార్ధ హృదయుడు సుగుణశీలి
రిప్లయితొలగించండిసతము పరుల మేల్గోరెడు సజ్జనుండు
సత్యసంధుడె యగుచు దుష్కృత్యములకు
విముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె
ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
వ్యసనములకు బానిసయైన పతిని గూర్చి
రిప్లయితొలగించండిపరితపించుచు పూజింప పరమశివుని
పడతి వాంఛితమీడేరి వ్యసనములకు
విముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె
అందగాడనుచు నతిపలందరు భర్త
రిప్లయితొలగించండివైపు మొగ్గుజూపించుట పసిగొనంగ ,
పొరుగున సఖి దన మగని పొందుగోర
విముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె
రిప్లయితొలగించండిమత్తికాడు పతియటంచు మగువ యెఱగి
సహనమును జూపి మార్చగా సహచరండు
విలువ జవరాలు లన్నను వెగటు గలిగి
విముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె.
విమలుండంచును బంధువుల్ తెలుపగా స్వీకారమున్ జేయ నా
రమణుండే రత తాలియై చెలగ నారాటమ్ము తా జెందకన్
కమితన్మార్చగ వాడు మంజికల పై గారాబమున్ వీడగా
విముఖుండై పతి వీడి పోయెననుచున్ బ్రీతిన్ గనెన్ సాధ్వియే.
తేటగీతి
రిప్లయితొలగించండివ్యసనములచేత విత్తము వ్యయము గాగ
పోషణంబుకు తిండియె పుట్టదయ్య
బాలల చదువు కెట్లన వాటి పట్ల
విముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె!
మత్తేభవిక్రీడితము
సుముఖుండై చెడు నేస్తునిన్ గలువఁగన్ శోకంబునన్ నష్టమె
ట్లు మహమ్మారులు కల్గ జేయుదురనన్ రోదించి వాగ్రుచ్చఁగన్
నిముషంబైనను వెంటరాని సఖునిన్ నిందించి యా నేస్తుఁడున్
విముఖుండై పతి వీడి పోయెననుచున్ బ్రీతిన్ గనెన్ సాధ్వియే!