5, నవంబర్ 2025, బుధవారం

సమస్య - 5296

6-11-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గుట్కా సేవించువాఁడె గురువై నెగడెన్”
(లేదా...)
“గుట్కా సేవన మాచరించెడి గురున్ గుర్తించి కీర్తించిరే”

3 కామెంట్‌లు:

  1. శా.
    జట్కాబండిని తోలుచున్ దినములన్ సంచారముల్ సేసి యీ
    పుట్కం బైదిలి పిల్లలన్ సొరిది తా బోషించుచున్ రాత్రులం
    గాట్కం బోలెడి గోడపై చదువులం గల్పించు, విద్యార్థులా
    గుట్కా సేవన మాచరించెడి గురున్ గుర్తించి కీర్తించిరే !

    రిప్లయితొలగించండి
  2. మట్కా నాడుట కొరకయి
    జట్కా నెక్కి యదియాడు జాగా వెదుకన్
    అట్కావు నొందుచుండగ
    గుట్కా సేవించువాఁడె గురువై నెగడెన్

    రిప్లయితొలగించండి
  3. కందం
    మట్కా నాడుచు నిత్యము
    కిట్కులు విని దూరి రాజకీయములందున్
    జిట్కా లెన్నో పారగ
    గుట్కా సేవించువాఁడె గురువై నెగడెన్!

    శార్దూలవిక్రీడితము
    మట్కా నాడుచు నిత్యమున్ దినఁగ సంపాదించుటల్ మృగ్యమై
    కిట్కుల్ నేరిచి రాజకీయములఁ దా గెల్వంగఁ గాలూనుచున్
    జిట్కాలెన్నియొ పారగన్ నెగడుచున్ జేరంగ గమ్యమ్ము వా
    గుట్కా సేవన మాచరించెడి గురున్ గుర్తించి కీర్తించిరే!

    రిప్లయితొలగించండి