2-11-2025 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“దుర్దినమని బాలురెల్లఁ దోషముఁ గనిరే”(లేదా...)“దుర్దినమంచు బాలకులె తోరఁపుఁ దోషము నందిరత్తఱిన్”(వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధానంలో నారుమంచి అనంతకృష్ణ గారి సమస్య)
నిర్దయ బూనుచు వరుణుడు దర్దురమును వీడి కురియ ధరణిని కనగన్ కర్దము నిండిన పాళము దుర్దినమని బాలురెల్లఁ దోషముఁ గనిరే.దర్దుర వాహకుండగుచు ధాత్రిని సంద్రము సేయ నెంచుచున్ నిర్దయ బూని జంబుకుడు నేలను జేరగ తీవ్ర రూపమున్ కర్దము నిండి శుభ్రమగు కర్పటముల్ చెడగొట్టు చుండగా దుర్దినమంచు బాలకులె తోరఁపుఁ దోషము నందిరత్తఱిన్.
నిర్దయుడగు బడిపంతులు వర్ది నొనగిరి మరునాడు ప్రశ్నలనిడుటన్అర్దితమెరుగక రేపదిదుర్దినమని బాలురెల్లఁ దోషముఁ గనిరే”
రిప్లయితొలగించండినిర్దయ బూనుచు వరుణుడు
దర్దురమును వీడి కురియ ధరణిని కనగన్
కర్దము నిండిన పాళము
దుర్దినమని బాలురెల్లఁ దోషముఁ గనిరే.
దర్దుర వాహకుండగుచు ధాత్రిని సంద్రము సేయ నెంచుచున్
నిర్దయ బూని జంబుకుడు నేలను జేరగ తీవ్ర రూపమున్
కర్దము నిండి శుభ్రమగు కర్పటముల్ చెడగొట్టు చుండగా
దుర్దినమంచు బాలకులె తోరఁపుఁ దోషము నందిరత్తఱిన్.
నిర్దయుడగు బడిపంతులు
రిప్లయితొలగించండివర్ది నొనగిరి మరునాడు ప్రశ్నలనిడుటన్
అర్దితమెరుగక రేపది
దుర్దినమని బాలురెల్లఁ దోషముఁ గనిరే”