9-11-2025 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“దీపశిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్”(లేదా...)“దీపశిఖాగ్రభాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమా”
కందంనైపుణ్యము పెంపొందఁగఁజూపెను కృత్రిమపు మేధ చోద్యమనంగన్చేప ముఖాగ్రము నేనుగు! దీపశిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్! ఉత్పలమాలనైపుణి మీరె లోకమున నమ్మగ లేనివి నమ్ము నట్లుగన్జూపెను గృత్రిమంబనెడు చోద్యముఁ గొల్పెడు మేధ వింతలన్చేప ముఖాగ్ర భాగమున చిత్రమనంగను నిల్చె నేనుగే!దీపశిఖాగ్రభాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమా!
దీపము వెలిగెడి తరి కా సేపటి పిదపను గన కొడి చిక్కగ గట్టన్ దీపిక కొడి గన నగుపడె దీపశిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్.పాపహరంబు పూజలని భక్తుడొకండట చిత్తశుద్ధి తో నా పరమాత్ము గోల్వదివియన్ వెలిగించగ దీపకమ్ము కా సేపది వెల్గి వత్తి కొడి చిక్కగ కట్టిన వేళ కాంచగా దీపశిఖాగ్రభాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమా.
కందం
రిప్లయితొలగించండినైపుణ్యము పెంపొందఁగఁ
జూపెను కృత్రిమపు మేధ చోద్యమనంగన్
చేప ముఖాగ్రము నేనుగు!
దీపశిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్!
ఉత్పలమాల
నైపుణి మీరె లోకమున నమ్మగ లేనివి నమ్ము నట్లుగన్
జూపెను గృత్రిమంబనెడు చోద్యముఁ గొల్పెడు మేధ వింతలన్
చేప ముఖాగ్ర భాగమున చిత్రమనంగను నిల్చె నేనుగే!
దీపశిఖాగ్రభాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమా!
రిప్లయితొలగించండిదీపము వెలిగెడి తరి కా
సేపటి పిదపను గన కొడి చిక్కగ గట్టన్
దీపిక కొడి గన నగుపడె
దీపశిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్.
పాపహరంబు పూజలని భక్తుడొకండట చిత్తశుద్ధి తో
నా పరమాత్ము గోల్వదివియన్ వెలిగించగ దీపకమ్ము కా
సేపది వెల్గి వత్తి కొడి చిక్కగ కట్టిన వేళ కాంచగా
దీపశిఖాగ్రభాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమా.