4, నవంబర్ 2025, మంగళవారం

సమస్య - 5295

5-11-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శంకరులను నాచార్యులచే హైందవమ్ము సర్వమ్ము చెడెన్”
(లేదా...)
“శంకరాచార్యుల చేత హైందవము సర్వవిధంబుల భ్రష్టమై చెడెన్” 

6 కామెంట్‌లు:

  1. ఆర్యావర్తము నందున
    మర్యాద గలిగి బహుజన మతమై, మూఢా
    చార్యపు శంకరులను నా
    చార్యులచే హైందవమ్ము సర్వమ్ము చెడెన్

    రిప్లయితొలగించండి

  2. ఆర్యుల మాటలు మరచిన
    ధైర్యమ్మించుకయు లేని దరితుడు చెప్పెన్
    భార్యకు శంకరులను నా
    చార్యులచే హైందవమ్ము సర్వమ్ము చెడెన్


    ఆర్యులు చెప్పిరైరి యిల హైందవ జాతికి చూడ శంకరా
    చార్యులె పెద్ద దిక్కని ప్రచారము జేసిరి కాని నీచుడే
    ధైర్యము లేక నా పరమతస్థుల తో వచియించె శంకరా
    చార్యుల చేత హైందవము సర్వవిధంబుల భ్రష్టమై చెడెన్.

    రిప్లయితొలగించండి
  3. కందం
    సూర్యసమానులనఁగ నా
    చార్యులు హైందవము నిలుప, సణఁగ తగునె? యె
    ట్లార్యా! శంకరులను నా
    చార్యులచే హైందవమ్ము సర్వమ్ము చెడెన్?

    ఉత్పలమాల
    ఆర్యులు కార్యదక్షుఁగని హారతులన్ వచియింప, శంకరా
    చార్యుల చేత హైందవము సర్వవిధంబుల శ్రేష్టమై మనెన్!
    సూర్యుని పైన నుమ్మిడియు స్రుక్కెడు వాగుడు కాదె? "శంకరా
    చార్యుల చేత హైందవము సర్వవిధంబుల భ్రష్టమై చెడెన్"

    రిప్లయితొలగించండి
  4. ఆర్యుఁడు శంకరుడు నిలిపె
    ధైర్యముగా హైందవమ్ము ధరలో నిపుఁడా
    తిర్యక్శంకరులను నా
    చార్యులచే హైందవమ్ము సర్వమ్ము చెడెన్

    రిప్లయితొలగించండి
  5. మరొక పూరణ:

    కార్యాకార్యము లివియని
    నార్యావర్తమున దెలిపె, నౌరా! యననా
    శ్చర్యమె! శంకరులను నా
    చార్యులచే హైందవమ్ము సర్వమ్ము చెడెన్

    రిప్లయితొలగించండి
  6. ఆర్యావర్తము నందున
    కార్యాచరణము కొరకొర ఘటించు చుండన్
    భార్యవశంకరులను నా
    చార్యులచే హైందవమ్ము సర్వమ్ము చెడెన్

    రిప్లయితొలగించండి