7, నవంబర్ 2025, శుక్రవారం

సమస్య - 5298

8-11-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మేలొనర్చెడి వాఁడె సుమీ విరోధి”
(లేదా...)
“మేలొనరించు వ్యక్తియె సుమీ జగమందునఁ జూడ శత్రువౌ”

16 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. తేటగీతి
      శల్య సారధ్యమన్నది శాపమౌచు
      యుద్ధమందున కర్ణునకూనమయ్యె
      ముందు నడుపుచు పరులకు సందుచూచి
      మేలొనర్చెడి వాఁడె సుమీ విరోధి!

      ఉత్పలమాల
      ఆలమునందునన్ గుదిరి యార్కికి సాదిగ శల్యుడెప్పుడున్
      జాలము మేరకున్ మిగుల సాయము జేయుచు పాండవాళికిన్
      వాలెను నేలకున్ దుదిని పాపము పండగ! వైరి పక్షమై
      మేలొనరించు వ్యక్తియె సుమీ జగమందునఁ జూడ శత్రువౌ!

      తొలగించండి

  2. మిత్రుడవటంచు నెప్పుడు మిన్నగాను
    చెప్పుకున్న నేమిర చూడ చేత లందు
    భేద మెంతయొ చూపుచు విద్విషునకు
    మేలొనర్చెడి వాఁడె సుమీ విరోధి.


    మాలిమి జూప నేమి కడు మందుడు మిత్రుడు కాదు వాడిలన్
    బేలతనమ్ముతో కపట ప్రేమ నటించుచు మాటలాడు దు
    శ్శీలుడు నిన్ను కోడిగము చేయుచు నిత్యము కానివానికిన్
    మేలొనరించు వ్యక్తియె సుమీ జగమందునఁ జూడ శత్రువౌ.

    రిప్లయితొలగించండి
  3. దివసమంత ను పగతునిదెస దలచుచు
    మరచిబోత నాడు బయనమగుట గూర్చి ,
    పయన మొంద నెంచిన బండి బన్నమొందె
    మేలొనర్చెడి వాఁడె సుమీ విరోధి

    రిప్లయితొలగించండి
  4. సమస్య


    మేలొనరించు వ్యక్తియె సుమీ జగమందునఁ జూడ శత్రువౌ


    ఉ. మా
    ------

    ఆలిని బ్రేమ జూచి తన యాశల దీర్చుచు మేలు నేలినన్

    శీలము వీడి తా బ్రియుని జెంతకు జేరి వసించ గోరుచున్

    జాలిక నీతొ బంధమని చంపగ జూచెను బ్రాణనాథునే

    మేలొనరించు వ్యక్తియె సుమీ జగమందునఁ జూడ శత్రువౌ


    -- ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  5. పాలు పోసిపెంచిన నేమి వీలుచూచి
    కచ్చితంబుగ కాటేయు గాలిదిండి
    మిత్రుడనని వచించుచు శత్రువులకు
    మేలొనర్చెడి వాఁడె సుమీ విరోధి

    పాలను పోసి పెంచినను వ్యాలము మేలొనరించదెన్నడున్
    జాలిదలంచినన్ దులువ సల్పుట మానడు కీడు! మిత్రునిన్
    బోలుచు బూటకంబులగు పొంకపు మాటల శత్రుకోటికిన్
    మేలొనరించు వ్యక్తియె సుమీ జగమందునఁ జూడ శత్రువౌ

    రిప్లయితొలగించండి
  6. మంచి తనమున నటియించి మాయ జేసి
    హితుని వోలెను మెలగుచు హే య మైన
    పనులు జేసెది వానిని పలుక దగును
    మేలొ న ర్చె డి వాడె సుమీ విరోధి

    రిప్లయితొలగించండి
  7. యదార్థవాది లోక విరోధి:-

    హేలగ మాటలాడి కడు నిష్టము జూపి యబద్ద వాదముల్
    వీలుగ పల్కు వాని నుడి వేద సమానము గాగ మిత్రుడౌ!
    ఆలము జేసి యైనను యదార్థము బల్కుచు జీవితమ్ములో
    మేలొనరించు వ్యక్తియె సుమీ జగమందునఁ జూడ శత్రువౌ!!

    రిప్లయితొలగించండి
  8. స్పర్ధచేనిలఁ విద్యలు వర్ధిలునను
    లోకనానుడి సత్యమాలోకనమున
    ప్రతిఘటించి ప్రవర్ధించు ప్రతిభగాన
    మేలొనర్చెడి వాఁడె సుమీ విరోధి

    రిప్లయితొలగించండి
  9. ఉగ్రవాదులు దేశద్రోహులకు ఏమాత్రము తీసిపోని వారు వారికి ఆశ్రయమిచ్చే వారు. వారు నిజమైన శత్రువులు

    తే॥దేశభద్రతకు ఖలులు దినదినమటు
    చెలఁగి గోతులుతీయఁగఁ దెలిసి ధనముఁ
    బడయు వాంఛను వారికి వసతులనిడి
    మేలొనర్చెడి వాఁడె సుమీ విరోధి

    ఉ॥ కూలఁగ దేశభద్రతయె గోతులుతవ్వెడి యుగ్రవాదులే
    గాలము వేసి సంపదలు కానుక లెన్నియొ కుమ్మరించఁగన్
    మేలని వాటి మోహమున మిక్కిలి తోషము నొంది వారికిన్
    మేలొనరించు వ్యక్తియె సుమీ జగమందునఁ జూడ శత్రువౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరోక పూరణండి

      ఉ॥ కాల మహాత్మ్యమో కనుల క్రమ్మిన మోహమొ భోగ మాధురీ
      లాలసయో వినాశకర లక్షణమో ధర మద్యపానమే
      వేలము వెఱ్ఱియై చనఁగ వీడుమటంచు హితమ్ముఁ గోరుచున్
      మేలొనరించు వ్యక్తియె సుమీ జగమందునఁ జూడ శత్రువౌ

      తొలగించండి
    2. కాల మహాత్మ్యమో కనులఁ గ్రమ్మిన మోహమొ
      చిన్న సవరణ అండి

      తొలగించండి
  10. తే.గీ:ప్రజలకున్ మేలు జేసెడు ప్రభుత యున్న
    వోట్లు ప్రతిపక్షమునకు మరెట్లు వచ్చు?
    భ్రాత! ప్రతిపక్ష దృష్టికి ప్రజల కింత
    మేలొనర్చెడి వాఁడె సుమీ విరోధి”

    రిప్లయితొలగించండి
  11. ఉ:"మే లొనరింతు స్త్రీల" కన, " మే లొనరింతును నేను నిమ్న వ
    ర్గాలకు" నంచు బల్కగను, "గాచెద నన్య మతాల" నన్నచో
    రాలును వోట్లు స్వచ్ఛ్గముగ రాష్ట్రము నెంచుచు వర్గదూరుడై
    మేలొనరించు వ్యక్తియె సుమీ జగమందునఁ జూడ శత్రువౌ”
    (నేటి రాజకీయాలలో ప్రతి పార్టీ ఏదో ఒక వర్గాన్ని పట్టుకోవాలే కానీ రాష్ట్రానికి మేలు చేస్తా అంటే శత్రువై పోతాడు.స్త్రీలకు మేలు చేస్తా,దళితులకు మేలు చేస్తా,మైనారిటీలని కాపాడతా అంటూ మాట్లాడాలి. )

    రిప్లయితొలగించండి
  12. సర్వధారి చనిన యంత నుర్వి లోన
    నశుభములు దొలంగు నరయ నక్కజముగ
    గ్రహముల గమనమ్మును గాంచ రాహువు తగు
    మే లొనర్చెడి వాఁడె సుమీ విరోధి

    [విరోధి (న్) = విరోధి నామ సంవత్సరములో]


    కాలుని భంగి శాత్రవ నికాయము మార్కొని చంపుచుండఁగాఁ
    జాలక హింస నోర్వఁగను సంకట ముక్తికిఁ బ్రాణ రక్షకై
    యాలము నందు నెట్టి గతి నైనను నింతయు శత్రు సేనకున్
    మే లొనరించు వ్యక్తియె సుమీ జగ మందునఁ జూడ శత్రువౌ

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    జ్ఞాన మార్జించి మాతృదేశపు ధనమ్ము
    తోడ,తుదకు దేశమ్మును వీడి కొలువు
    నాశ తోడ నేగి పరాయి దేశములకు
    మేలొనర్చెడి వాడె సుమీ విరోధి!

    రిప్లయితొలగించండి