17-11-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాకిస్తాన్ మంచి దనుచుఁ బలికెన్ మోడీ”
(లేదా...)
“పాకిస్తాన్ మన మిత్రదేశమనుచున్ వాక్రుచ్చె మోడీ సభన్”
(ఈనాటి చేపూరి శ్రీరామ్ గారి అష్టావధానంలో జీడికంటి శ్రీనివాస మూర్తి గారి సమస్య... కొద్ది మార్పుతో)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాకిస్తాన్ మంచి దనుచుఁ బలికెన్ మోడీ”
(లేదా...)
“పాకిస్తాన్ మన మిత్రదేశమనుచున్ వాక్రుచ్చె మోడీ సభన్”
(ఈనాటి చేపూరి శ్రీరామ్ గారి అష్టావధానంలో జీడికంటి శ్రీనివాస మూర్తి గారి సమస్య... కొద్ది మార్పుతో)
ఏకారణమున నిప్పుడు
రిప్లయితొలగించండిపాకిస్తాన్ మంచి దనుచుఁ బలికెన్ మోడీ ?
జోకగ నటుల దెలిపిరా!
ఏకార్యమునందు వారు హెచ్చుగ నుండెన్
కందం
రిప్లయితొలగించండిఏకును మేకుగ జేసెడు
రాకాశియనఁగ నమెరిక, రక్కెడు చైనా
దూకుడు లేనంత దనుక
పాకిస్తాన్ మంచి దనుచుఁ బలికెన్ మోడీ
శార్దూలవిక్రీడితము
ఏకున్ మేకుగ జేయు రాజ్యములె యూరింపంగ వెన్నంటుచున్
గోకుల్లూతమటంచు నెంచి పగతో క్రూరాత్మయై దూకెడున్
లేకే, కుక్కిన పేనురీతిగఁ బ్రవర్తింపంగ ముందుండుచున్
పాకిస్తాన్ మన మిత్రదేశమనుచున్ వాక్రుచ్చె మోడీ సభన్
రిప్లయితొలగించండిచీకటి లో ద్రావిన మా
ర్ద్వీకపు మత్తది వదలక విజ్ఞత చెడెనో
నీకెవ్వడు చెప్పె నెపుడు
పాకిస్తాన్ మంచి దనుచుఁ బలికెన్ మోడీ?
లోకంబంత యెఱుంగు శత్రువని యాలోచించుమా మిత్రమా
యేకాలంబునచూచినన్ మనను తా నేకాకిగా చేయగన్
సంకోచించని దేశమయ్యదియె గాంచన్ సోదరా యె వ్విధిన్
పాకిస్తాన్ మన మిత్రదేశమనుచున్ , వాక్రుచ్చె మోడీ సభన్.
ప్రాకటముగఁ బ్రజలకలలు
రిప్లయితొలగించండిసాకారంబై చివరకు స్వాతంత్ర్యమ్మే
చేకూరిన సమయంబున
పాకిస్తాన్ మంచి దనుచుఁ బలికెన్ మోడీ
ఆకాలంబున నాంగ్లజాతి దొరలల్లాడంగ గొంతెత్తుచున్
మాకొద్దీ దొరలంచు నుద్యమముతో మార్మ్రోగె లేదిక్కులే
చీకట్లే తొలగంగ స్వేచ్ఛ మనకున్ సిద్దించు కాలంబులో
పాకిస్తాన్ మన మిత్రదేశమనుచున్ వాక్రుచ్చె మోడీ సభన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరాభరణం సమస్య
రిప్లయితొలగించండిపాకిస్తాన్ మన మిత్రదేశమనుచున్ వాక్రుచ్చె మోడీ సభన్
శా!!
ఆ కశ్మీరుయె మాది యంచు సలుపున్ వ్యాసమ్ముగా దాడులన్
జేకూర్చున్ గద యుగ్రవాదులను...దర్శించన్ బ్రమాదమ్ములున్,
చీకాకుల్ మరి పెట్టుచుండుఁ గడు. ఛీ!ఛీ! కాదు ముమ్మాటికిన్
పాకిస్తాన్ మన మిత్రదేశమనుచున్ వాక్రుచ్చె మోడీ సభన్
ఆకుల శాంతి భూషణ్
వనపర్తి