25-1-2026 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“వరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్”(లేదా...)“వరమునఁ బుట్టె రాక్షసుఁడు వైభవమొప్ప జగంబు నేలఁగన్”(భరతశర్మ గారి శతావధానంలో గౌరీభట్ల రఘురామ శర్మ గారి సమస్య)
కందంసరసకుఁ జేరెడు సమయమసురసంధ్యన్ దగదనఁ బతి. ,చోద్యమనంగన్దరుణి దితియె పొరలిన కావరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్చంపకమాలసరసకుఁ జేరగానసురసంధ్యను కశ్యపు డొప్పకుండినన్మరిమరి కౌతుకమ్మున సమాగము దప్పదటన్నరీతిగన్వరుసను మార్చకే దితియె వాంఛలు దీరఁగ పొర్లినట్టి కావరమునఁ బుట్టె రాక్షసుఁడు వైభవమొప్ప జగంబు నేలఁగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సరికాదు సురత మిదియె య సురసంధ్య యని పతి దితికి సూచించిన నే మి రమణి కోరెనుగద కా వరమున, రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్.సరి యిది కాదు కాదసుర సంధ్యను సంగమమ్మటంచున్ పురుషుడు చెప్పనేమీ సతి మూర్ఖత వీడక సంప్ర యోగమున్ విరహము తాళలేననుచు వేడగ నాదితి యున్నతిల్లు కా వరమునఁ, బుట్టె రాక్షసుఁడు వైభవమొప్ప జగంబు నేలఁగన్.
తరతరముల జనహితముగ పరిపాలనమును సలిపిన వంశమె గాదా !అరుదగు విధముగ నిపుడు ప్రవరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్
కందం
రిప్లయితొలగించండిసరసకుఁ జేరెడు సమయమ
సురసంధ్యన్ దగదనఁ బతి. ,చోద్యమనంగన్
దరుణి దితియె పొరలిన కా
వరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్
చంపకమాల
సరసకుఁ జేరగానసురసంధ్యను కశ్యపు డొప్పకుండినన్
మరిమరి కౌతుకమ్మున సమాగము దప్పదటన్నరీతిగన్
వరుసను మార్చకే దితియె వాంఛలు దీరఁగ పొర్లినట్టి కా
వరమునఁ బుట్టె రాక్షసుఁడు వైభవమొప్ప జగంబు నేలఁగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిసరికాదు సురత మిదియె య
సురసంధ్య యని పతి దితికి సూచించిన నే
మి రమణి కోరెనుగద కా
వరమున, రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్.
సరి యిది కాదు కాదసుర సంధ్యను సంగమమ్మటంచున్
పురుషుడు చెప్పనేమీ సతి మూర్ఖత వీడక సంప్ర యోగమున్
విరహము తాళలేననుచు వేడగ నాదితి యున్నతిల్లు కా
వరమునఁ, బుట్టె రాక్షసుఁడు వైభవమొప్ప జగంబు నేలఁగన్.
తరతరముల జనహితముగ
రిప్లయితొలగించండిపరిపాలనమును సలిపిన వంశమె గాదా !
అరుదగు విధముగ నిపుడు ప్ర
వరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్