23, జనవరి 2026, శుక్రవారం

సమస్య - 5360

24-1-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దూరువాఁడె యఘవిదూరుఁ డగును”
(లేదా...)
“దూరెడివాఁడె దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్”
(భరతశర్మ గారి శతావధానంలో పంతుల విట్టుబాబు గారి సమస్య)

3 కామెంట్‌లు:

  1. ఇంత వయసు వ చ్చినగూడ , నెన్నటికిని
    పెద్దవారి నసలు గౌరవించకుండి
    పరుష వచనము పలికెడు పాలసుడిని
    దూరువాఁడె యఘవిదూరుఁ డగును

    రిప్లయితొలగించండి
  2. సమస్య : “దూరువాఁడె యఘవిదూరుఁ డగును”

    ఆ. సాధు వర్తనమ్ము సత్యశీలతగల్గి
    మానితమగు తెరగు నరుగు వాడు
    అహము దర్పమాది అవగుణముల నెల్ల
    దూరువాఁడె యఘవిదూరుఁ డగును

    భావం : మంచి ప్రవర్తన, సత్యం పట్ల నిబద్ధత కలిగి ఉండి, గౌరవప్రదమైన మార్గంలో నడిచేవాడు, అలాగే అహంకారం, గర్వం వంటి దుర్గుణాలన్నింటినీ నిరసించి దూరం చేసేవాడు మాత్రమే పుణ్యాత్ముడవుతాడు.

    రిప్లయితొలగించండి