25, జనవరి 2026, ఆదివారం

సమస్య - 5362

26-1-2026 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వాగ్వ్యాపారమ్ము లేనివాఁడె బుధుండౌ”
(లేదా...)
“వాగ్వ్యాపారము లేనివాఁడె బుధుఁడై ప్రఖ్యాతినందెన్ గదా”
(భరతశర్మ గారి శతావధానంలో చేపూరి శ్రీరామ్ గారి సమస్య)

3 కామెంట్‌లు:


  1. వాగ్వ్యాపారమధిక మవ
    వాగ్వ్యాపారులను గాంచి బర్బరు లనరే
    వాగ్వ్యాపారులు మొకరులు
    వాగ్వ్యాపారమ్ము లేనివాఁడె బుధుండౌ.


    ఈ గ్వ్యా ప్రాసను గూర్చి పద్యముల నేనేరీతిగా వ్రాయుదున్
    వాగ్వ్యాపారపు పాటవమ్మదియె లుప్తంబైన వాడన్ గదా
    వాగ్వ్యాపారము సేయనట్టి మునులే ప్రఖ్యాతు లై వెల్గిరే
    వాగ్వ్యాపారము లేనివాఁడె బుధుఁడై ప్రఖ్యాతినందెన్ గదా.

    రిప్లయితొలగించండి
  2. వాగ్వ్యసనము విడకుండిన
    వాగ్వ్యాధిని నొందుట యలవాటగుచుండున్ ,
    వాగ్వ్యవధానమె మంచిది
    వాగ్వ్యాపారమ్ము లేనివాఁడె బుధుండౌ”

    రిప్లయితొలగించండి