ఉ:మాటి మాటికి జానకిన్ మన మౌను లెల్లరు మెచ్చరే ? తోటి సంఘము వారి మెచ్చగ తోచ దెట్టి విచిత్రమున్ తాటకిన్ గడుఁ బూజ్యురాలని తాపసుల్ నుతియించిరే తోటి దానిని దైత్య మౌనులు తోచి నట్టుల మెచ్చరే? (తపస్సు రాక్షసులు కూడా చేస్తారు.మన ఋషులు మన సీతను మెచ్చుకున్నట్టే రాక్షస తపస్వులు తాటకిని మెచ్చుకుంటారు. దానిలో విచిత్ర మేముంది?)
తాటకి కుమారులిద్దరు
రిప్లయితొలగించండిపోటీపడి మునులు జేయు భుజ్యువు లెల్లన్
వీటిగలుప మాన్పు మనుచు
తాటకిఁ బూజింపుఁ డనుచుఁ దాపసులనిరే
మేటియని భటుల్ మెచ్చిరి
రిప్లయితొలగించండితాటకిఁ బూజింపుఁ డనుచుఁ; దాపసులనిరే
సాటి గనరాని రామునిఁ
ధాటిగ దనుజులను గూల్చు ధన్యుండితడే
ధాటిగా కలహాన నిల్చును తాటకంచు మఖద్విషుల్
మేటిగా రహికెక్కెనంచును మెచ్చుచున్ బ్రణుతించిరే
తాటకిన్ గడుఁ బూజ్యురాలని; తాపసుల్ నుతియించిరే
సాటియే గన రాని వాడని శౌర్యవంతుని రామునిన్
రిప్లయితొలగించండిమేటి ప్రవీరుడు రాముడు
కాటిక ముని యావహనము కాచుట కొరకై
చేటొన రించు నని చిదిమె
తాటకిఁ,, బూజింపుఁ డనుచుఁ దాపసులనిరే.
ధాటిగా రఘు రాము డచ్చట దాన వాళిని ద్రుంచగా
నేటమందున సంత సించిరి హిండకుండ్రట చావగా
యేటి కిట్టుల వాగు చుంటివి హీనుడా మును లెప్పుడా
తాటకిన్ గడుఁ బూజ్యురాలని తాపసుల్ నుతియించిరే?
-
రిప్లయితొలగించండిపాటవమున కూలబడగ
తాటకిఁ బూజింపుఁ డనుచుఁ దాపసులనిరే
మేటి రఘురాముడాతని
సాటిగలరెవరిలని మనసా శ్లాఘింపన్!
రిప్లయితొలగించండిhttps://youtube.com/shorts/uS-W8RPVtDE?si=aZSAMnZl8RIS63Gg
చేటుకు కారణ మ య్యె ను
రిప్లయితొలగించండితాటకి :: పూజింపు డనుచు తాపసు లన రే
దీ టు గ ధర్మము నిలుప గ
మేటిగ పోరాడి నట్టి మేలిమి రామున్
కందం
రిప్లయితొలగించండిచీటికి మాటికి మునులకు
నాటంకమొనర్చి రామునమ్ముకు బలియై
మేటిగ పునీతయయ్యెను
దాటకిఁ బూజింపుఁ డనుచుఁ దాపసులనిరే!
మత్తకోకిల
మాటిమాటికినడ్డగించగ మౌనివర్యుల యజ్ఞమున్
దీటుగా రఘరామచంద్రుని దివ్యబాణము గూల్చఁగన్
మేటి పుణ్యము దక్కెనంచును మృత్యువందిన వేళలో
తాటకిన్ గడుఁ బూజ్యురాలని తాపసుల్ నుతియించిరే
మత్త॥ దీటుగా నటు తప్పునొప్పును దెల్పు ప్రశ్నను గూర్చుచున్
రిప్లయితొలగించండిబాటవమ్మిసుమంత లేకయె బాల బాలికలెల్లరున్
నీటుగా వివరించ నిచ్చిరి నేఁటి పద్ధతి నిట్టులన్
దాటకిన్ గడుఁ బూజ్యురాలని తాపసుల్ నుతియించిరే
(నేడు qualifying exams competitive exams రెండింటి లోను చాలా సులభమైన ప్రశ్నలే సామాన్యంగా ఇస్తారండి)
కం:చే టౌచు బ్రజకు హింసను
రిప్లయితొలగించండిబాటించెడు స్త్రీకి గౌరవమ్మిడ మునులే
యేటికి జెప్పెద రయ్యా?
తాటకిఁ బూజింపుఁ డనుచుఁ దాపసులనిరే?
ఉ:మాటి మాటికి జానకిన్ మన మౌను లెల్లరు మెచ్చరే ?
రిప్లయితొలగించండితోటి సంఘము వారి మెచ్చగ తోచ దెట్టి విచిత్రమున్
తాటకిన్ గడుఁ బూజ్యురాలని తాపసుల్ నుతియించిరే
తోటి దానిని దైత్య మౌనులు తోచి నట్టుల మెచ్చరే?
(తపస్సు రాక్షసులు కూడా చేస్తారు.మన ఋషులు మన సీతను మెచ్చుకున్నట్టే రాక్షస తపస్వులు తాటకిని మెచ్చుకుంటారు. దానిలో విచిత్ర మేముంది?)
కం॥
రిప్లయితొలగించండిదీటగు ధర్మాత్ముండౌ
పోటరి శ్రీరాము కరుణ పులుగాసైనన్
మేటిగ తాఁ బొంది చనిన
తాటకిఁబూజింపుఁడనుచుఁదాపసులనిరే!!
(పోటరి: శూరుడు
పులుగాసి: అల్పము
చను: చనిపోవు)
కాటికి పంపెను రాముడు
రిప్లయితొలగించండితాటకి, బూజింపుడనుచు దాపసులనిరే
మేటి పరాక్రమ చరితుడు
సాటిలలోలేరు రాము చాతుర్యముకున్.