24-5-2026 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అవధానికి శిక్షణమ్ము లవసర మగునా”
(లేదా...)
“అవధానాభ్యసనార్థశిక్షణము లయ్యా మేలుఁ జేకూర్చునే”
అవిరతము జేయు చుండెడిఅవధానికి , శిక్షణమ్ము లవసర మగునా !అవసరమా యాతరగాలి ! ప్రవీణతను పెంచు కొనగ పరిమితి కలదే!
కవనము నందు న ప్రతిభ యు జవమున పద్యముల నల్లు చాతుర్య ము తో ప్రవిమ ల ధారయు కలిగిన నవ ధాని కి శిక్షణ మ్ము లవసర మగునా?
కవి సహజమ్ముగ పద్యము నవలీలగ చెప్పువాడె యవధానిగ నీ భువిలో రాణించును మరి యవధానికి శిక్షణమ్ము లవసర మగునావ్యవహారమ్మది కాదు కాదె యదియే పాండిత్య సయ్యాట తా జవమున్ బద్యము జెప్పి పృచ్ఛకులకున్ సంపత్తి నే జూపెడిన్ గవికిన్ గావలె ప్రాకృతంబగు చమత్కా రమ్మదే కావునన్ యవధానాభ్యసనార్థశిక్షణము లయ్యా మేలుఁ జేకూర్చునే?
వ్యవధికి వశమై పలికెడియవధానికి శిక్షణమ్ము లవసర మగునావివరింపుమనుట తగునాజవనాశ్వముకైన వలయు సద్బోధనమేవ్యవధానమ్మున దీటుగా బలుకుచున్ వాగ్బాణముల్ వీడుచున్నవచైతన్యము తోడ నిండు సభలో నైపుణ్యముంజూపగాలవలేశంబగు సంశయమ్ము గలదా లక్ష్యంబు సాధింపగానవధానాభ్యసనార్థశిక్షణము లయ్యా మేలుఁ జేకూర్చునే
అవిరతము జేయు చుండెడి
రిప్లయితొలగించండిఅవధానికి , శిక్షణమ్ము లవసర మగునా !
అవసరమా యాతరగాలి !
ప్రవీణతను పెంచు కొనగ పరిమితి కలదే!
కవనము నందు న ప్రతిభ యు
రిప్లయితొలగించండిజవమున పద్యముల నల్లు చాతుర్య ము తో ప్రవిమ ల ధారయు కలిగిన
నవ ధాని కి శిక్షణ మ్ము లవసర మగునా?
రిప్లయితొలగించండికవి సహజమ్ముగ పద్యము
నవలీలగ చెప్పువాడె యవధానిగ నీ
భువిలో రాణించును మరి
యవధానికి శిక్షణమ్ము లవసర మగునా
వ్యవహారమ్మది కాదు కాదె యదియే పాండిత్య సయ్యాట తా
జవమున్ బద్యము జెప్పి పృచ్ఛకులకున్ సంపత్తి నే జూపెడిన్
గవికిన్ గావలె ప్రాకృతంబగు చమత్కా రమ్మదే కావునన్
యవధానాభ్యసనార్థశిక్షణము లయ్యా మేలుఁ జేకూర్చునే?
వ్యవధికి వశమై పలికెడి
రిప్లయితొలగించండియవధానికి శిక్షణమ్ము లవసర మగునా
వివరింపుమనుట తగునా
జవనాశ్వముకైన వలయు సద్బోధనమే
వ్యవధానమ్మున దీటుగా బలుకుచున్ వాగ్బాణముల్ వీడుచున్
నవచైతన్యము తోడ నిండు సభలో నైపుణ్యముంజూపగా
లవలేశంబగు సంశయమ్ము గలదా లక్ష్యంబు సాధింపగా
నవధానాభ్యసనార్థశిక్షణము లయ్యా మేలుఁ జేకూర్చునే