25-5-2026 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శివునిఁ జూడదంట శీతనగజ”
(లేదా...)
“శివుని ముఖమ్ముఁ జూడదఁట శీతనగాత్మజ మంచిదే కదా”
తలపయి సురనదిని ధరించ దప్పుగశివునిఁ జూడదంట శీతనగజ ;విపులపయి దిగుటకు వీలు కలుగు నట్లుతలను ప్రాపు జేయ దలచెనుగద
ఆటవెలదిఎన్నిజన్మలైన నీశ్వరునెంచుచున్బతిగ పొందజూచు పరవశమునజగములేలు జనని,నగుమోములేకుండశివునిఁ జూడదంట శీతనగజ! చంపకమాలఅవగుణుఁడంచునెందరును నాదిశివున్ దెగనాడుచుండినవ్భవునినె జన్మజన్మలకు భర్తగనెంచెడు భక్తిభావనన్శివము నొసంగు వాడనెడు చింతనతో నగుమోములేకయేశివుని ముఖమ్ముఁ జూడదఁట శీతనగాత్మజ మంచిదే కదా!
తాను కోరు కొనిన దక్షాధ్వరధ్వంసి తనను పెండ్లి యాడు తరుణ మందు సహజ సిద్ధ మైన శాలీనతయె క్రమ్మ శివునిఁ జూడదంట శీతనగజ.కవికుల శ్రేష్టుడైన కవి కావ్యము నందు రచించె నివ్విధిన్ సవుని ధరించి నట్టి నగ చాపుని భర్తగ బొంద గోరి భై రవి తప మాచరించిన, కరగ్రహణమ్ము తరిన్ హ్రిణీయ తోన్ శివుని ముఖమ్ముఁ జూడదఁట శీతనగాత్మజ, మంచిదే కదా.
పరమశివునిజూచి పరవశించి కడకుశూలిపత్నియయ్యె శైలపుత్రి స్వామి దేహమందు సగమయ్యెఁ గావునన్శివునిఁ జూడదంట శీతనగజభవహరుడే మనోహరుడు భార్గవి చేతన మందు నెన్నడున్శివునికి భార్యయై పరవ శించెడు భామిని కండ్లు మూసినన్ శివుని విలాసమే తనదు చిత్తమునందున నిల్చి యుండగా శివుని ముఖమ్ముఁ జూడదఁట శీతనగాత్మజ మంచిదే కదా
తలపయి సురనదిని ధరించ దప్పుగ
రిప్లయితొలగించండిశివునిఁ జూడదంట శీతనగజ ;
విపులపయి దిగుటకు వీలు కలుగు నట్లు
తలను ప్రాపు జేయ దలచెనుగద
ఆటవెలది
రిప్లయితొలగించండిఎన్నిజన్మలైన నీశ్వరునెంచుచున్
బతిగ పొందజూచు పరవశమున
జగములేలు జనని,నగుమోములేకుండ
శివునిఁ జూడదంట శీతనగజ!
చంపకమాల
అవగుణుఁడంచునెందరును నాదిశివున్ దెగనాడుచుండినవ్
భవునినె జన్మజన్మలకు భర్తగనెంచెడు భక్తిభావనన్
శివము నొసంగు వాడనెడు చింతనతో నగుమోములేకయే
శివుని ముఖమ్ముఁ జూడదఁట శీతనగాత్మజ మంచిదే కదా!
రిప్లయితొలగించండితాను కోరు కొనిన దక్షాధ్వరధ్వంసి
తనను పెండ్లి యాడు తరుణ మందు
సహజ సిద్ధ మైన శాలీనతయె క్రమ్మ
శివునిఁ జూడదంట శీతనగజ.
కవికుల శ్రేష్టుడైన కవి కావ్యము నందు రచించె నివ్విధిన్
సవుని ధరించి నట్టి నగ చాపుని భర్తగ బొంద గోరి భై
రవి తప మాచరించిన, కరగ్రహణమ్ము తరిన్ హ్రిణీయ తోన్
శివుని ముఖమ్ముఁ జూడదఁట శీతనగాత్మజ, మంచిదే కదా.
పరమశివునిజూచి పరవశించి కడకు
రిప్లయితొలగించండిశూలిపత్నియయ్యె శైలపుత్రి
స్వామి దేహమందు సగమయ్యెఁ గావునన్
శివునిఁ జూడదంట శీతనగజ
భవహరుడే మనోహరుడు భార్గవి చేతన మందు నెన్నడున్
శివునికి భార్యయై పరవ శించెడు భామిని కండ్లు మూసినన్
శివుని విలాసమే తనదు చిత్తమునందున నిల్చి యుండగా
శివుని ముఖమ్ముఁ జూడదఁట శీతనగాత్మజ మంచిదే కదా