కం:గణముల, యతులన్,బ్రాసల గణనము సరి పోయినంత గవన మ్మగునే! గణపతి దలచిన నీ పూ రణమున రసగంధ మెసఁగె రమ్యతరముగా (ఒక పూరణకర్త సమస్యా పూరణం గణపతి ఇతివృత్తం తో రసవంతం గా చేసాడు.)
చం:తన పతి గాచు తోడగుచు దానును యుద్ధము జేతు నంచు భీ షణగతి బల్కు సత్య ,నది సాధ్యము కాదని పల్కి కూడ ర మ్మని తల నూపు గృష్ణుని మహాకవి పోతన తీర్చి దిద్దె నా రణమునఁ బద్యగంధరసరాగములొప్పెను రమ్యపద్ధతిన్” (పోతన గారు సత్యభామ యుద్ధాన్ని, దానికి ముందు శ్రీకృష్ణసత్యల సంభాషణని చక్కగా చిత్రించారు.ఉదా: లేమా దనుజుల గెలువగ లేమా.)
ప్రణవముతో మోచు సభన
రిప్లయితొలగించండిపణితమగు పలుకుల కతన ప్రమదించంగా
ధణి పండితులకొసగిన శ
రణమున రసగంధ మెసఁగె రమ్యతరముగా
గణయతులును బ్రాసలతో
రిప్లయితొలగించండిక్షణమైనను జాగులేక కవి పలుకగ వీ
క్షణమొప్పె సమస్యా పూ
రణమున రసగంధ మెసఁగె రమ్యతరముగా
క్షణమొక పద్యమై మిగుల కౌతుకమొప్పు వధానమందునన్
తొలగించండిగణగణ మ్రోగెఁ గోవిదుని కంఠము చక్కని రాగమందునన్
మణిమయ దీప్తమై తనరు మాన్యవదాన్యుని ప్రజ్ఞ పద్య పూ
రణమునఁ బద్యగంధరసరాగములొప్పెను రమ్యపద్ధతిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిప్రణతులటంచును తెలుపుచు
రిప్లయితొలగించండిచణమది కలిగిన వధాని సభలో తాన్ బూ
రణ పద్యములు చదివి ధా
రణమున రసగంధ మెసఁగె రమ్యతరముగా.
రణమన నొప్పు క్రీడ యది ప్రాజ్ఞలు ప్రాశ్నికు లైన వారికిన్
చణమది వాసిగాగల విశారదు డైన వధాని నమ్రతన్
ప్రణతులు తెల్పి యంతమున పద్యములన్ జవ మందు జెప్ప ధా
రణమునఁ బద్యగంధరసరాగములొప్పెను రమ్యపద్ధతిన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమణిమయ వేదికందు నసమానుడు మాన్యుడు నద్భుతంబుగన్
రిప్లయితొలగించండిగణయతి ప్రాస లన్ని క్షణకాలము నందునె కూర్చి చక్కగన్
తొణికిస లాడు పద్యముల తోరణమల్లెను ప్రజ్ఞజూపి తో
రణమున బద్య గంధరసరాగము లొప్పెను రమ్య పద్ధతిన్
గణ యతి ప్రాసలు గలిగియు
రిప్లయితొలగించండిగణు తించె డు రీతి పద్య కల్పన దోడ న్
ప్రణు తింప గ విభు దులు పూ
రణము న రస గంధ మెసగె రమ్య తర ము గా
అనయము రాయల సభలో
రిప్లయితొలగించండివినిపించును పద్దియములు వీనులలరగన్
ఘనముగ సాగిన సాహితి
రణమున రసగంధ మెసఁగె రమ్యతరముగా
అనయము కావ్యగోష్ఠులను హాయిగ సల్పు సభాంగణమ్మునన్
రిప్లయితొలగించండిఘనముగ పండితోత్తములు గానముఁ జేతురు వారి కావ్యముల్
విని ముదమొంద నెల్లరును వీనుల విందుగ నాటిపద్య పూ
రణమునఁ బద్యగంధరసరాగములొప్పెను రమ్యపద్ధతిన్
చం॥ ప్రణతుల నీడి ప్రాశ్నికులు పద్యములల్లఁగ వేయ ప్రశ్నలన్
రిప్లయితొలగించండిగణములు గూర్చి ఛందమటు కాంచి వధానియు పద్యధారలన్
గణగణ మ్రోగు గంటవలె గ్రక్కున పల్క మనోహరంపు ధా
రణమునఁ బద్యగంధరస రాగము లొప్పెను రమ్యపద్ధతిన్
(అవధానమనే రణమునందు ధారణమండి)
కం:గణముల, యతులన్,బ్రాసల
రిప్లయితొలగించండిగణనము సరి పోయినంత గవన మ్మగునే!
గణపతి దలచిన నీ పూ
రణమున రసగంధ మెసఁగె రమ్యతరముగా
(ఒక పూరణకర్త సమస్యా పూరణం గణపతి ఇతివృత్తం తో రసవంతం గా చేసాడు.)
చం:తన పతి గాచు తోడగుచు దానును యుద్ధము జేతు నంచు భీ
రిప్లయితొలగించండిషణగతి బల్కు సత్య ,నది సాధ్యము కాదని పల్కి కూడ ర
మ్మని తల నూపు గృష్ణుని మహాకవి పోతన తీర్చి దిద్దె నా
రణమునఁ బద్యగంధరసరాగములొప్పెను రమ్యపద్ధతిన్”
(పోతన గారు సత్యభామ యుద్ధాన్ని, దానికి ముందు శ్రీకృష్ణసత్యల సంభాషణని చక్కగా చిత్రించారు.ఉదా: లేమా దనుజుల గెలువగ లేమా.)
కందం
రిప్లయితొలగించండిప్రణుతిని రామాశ్వమునే
క్షణమున పట్టి లవకుశుల సంభాషించన్
గణుతిన్ దండ్రీ తనయుల
రణమున రసగంధ మెసఁగె రమ్యతరముగా
చంపకమాల
ప్రణుతిని నశ్వమేధమున రాముని గుర్రము పట్టివైచి స
ద్గుణముల మేటి రాఘవుని తోయజ నేత్రుని ధిక్కరించి యే
యణకువ లేకయే లవకుశాఖ్యులు చేసిన వాదపూర్వమౌ
రణమునఁ బద్యగంధరసరాగములొప్పెను రమ్యపద్ధతిన్