18-7-2026 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తల్లిదండ్రులు మరణింపఁ దనయుఁ డలరె”
(లేదా...)
“తలిదండ్రుల్ గతియించినన్ సుతుఁడు మోదంబందె సంతుష్టుఁడై”
రాజకీయపు రంగాన రాటుదేలియెన్నికల పోరులోన తా నున్న వేళతల్లిదండ్రులు మరణింపఁ దనయుఁ డలరెసానుభూతితో గెలుపు సుసాధ్యమనుచు
కలికాలమ్మిది కాంచవచ్చునిచటన్ గాఠిన్యులౌ మూర్ఖులన్విలువేమున్నది తల్లిదండ్రుల పయిన్ వీలౌను గెల్పందురేకలితంబైనది గాదె యెన్నికలలో కాలూను వారింగనన్ దలిదండ్రుల్ గతియించినన్ సుతుఁడు మోదంబందె సంతుష్టుఁడై
ఏండ్లతరబడి మిక్కిలి యెరివు నిడినరోగములను తట్టుకొనక రోలు చుండుతల్లిదండ్రులు మరణింపఁ , దనయుఁ డలరెనోప లేని కుతిల యిక నుడిగె ననుచు
కలుగు నుండి యటకు జేర గనువినికలి గాంచి భీతిల్లి గావు కేకలను పెట్ట నాలకించి వచ్చి రటకునగము జంప తల్లిదండ్రులు, మరణింపఁ దనయుఁ డలరె.తల మందున్ జరియించుచున్ మృగములన్ దా చెండి భక్షించెడిన్ బులియే చేరె పురమ్మటంచు తెలియన్ బుత్రుండు భీతిల్లగా నెలిమిన్ బీలువ చేతబట్టి చనిరా హింసీరమున్ గూల్చ గా తలిదండ్రుల్, గతియించినన్ సుతుఁడు మోదంబందె సంతుష్టుఁడై.
రాజకీయపు రంగాన రాటుదేలి
రిప్లయితొలగించండియెన్నికల పోరులోన తా నున్న వేళ
తల్లిదండ్రులు మరణింపఁ దనయుఁ డలరె
సానుభూతితో గెలుపు సుసాధ్యమనుచు
కలికాలమ్మిది కాంచవచ్చునిచటన్ గాఠిన్యులౌ మూర్ఖులన్
తొలగించండివిలువేమున్నది తల్లిదండ్రుల పయిన్ వీలౌను గెల్పందురే
కలితంబైనది గాదె యెన్నికలలో కాలూను వారింగనన్
దలిదండ్రుల్ గతియించినన్ సుతుఁడు మోదంబందె సంతుష్టుఁడై
ఏండ్లతరబడి మిక్కిలి యెరివు నిడిన
రిప్లయితొలగించండిరోగములను తట్టుకొనక రోలు చుండు
తల్లిదండ్రులు మరణింపఁ , దనయుఁ డలరె
నోప లేని కుతిల యిక నుడిగె ననుచు
రిప్లయితొలగించండికలుగు నుండి యటకు జేర గనువినికలి
గాంచి భీతిల్లి గావు కేకలను పెట్ట
నాలకించి వచ్చి రటకునగము జంప
తల్లిదండ్రులు, మరణింపఁ దనయుఁ డలరె.
తల మందున్ జరియించుచున్ మృగములన్ దా చెండి భక్షించెడిన్
బులియే చేరె పురమ్మటంచు తెలియన్ బుత్రుండు భీతిల్లగా
నెలిమిన్ బీలువ చేతబట్టి చనిరా హింసీరమున్ గూల్చ గా
తలిదండ్రుల్, గతియించినన్ సుతుఁడు మోదంబందె సంతుష్టుఁడై.