30, ఆగస్టు 2026, ఆదివారం

సమస్య - 5575

31-8-2026 (సోమవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“చీమనుఁ జూచి భీతిలెను సింహము గ్రూరమృగాభిశంకతో”

(లేదా...)

“చీమం జూచి భయపడెను సింహమ్ము గడున్”

(పట్వర్ధన్ గారి శతావధానంలో పోటు హైమవతి గారి సమస్య)

19 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కందం
      పాములు శార్దూలమ్ములుఁ
      దాముగ ప్రహ్లాదుముందు తగ్గి నిలువఁగా
      నేమిదియని వడకె భటుడు
      చీమం జూచి భయపడెను సింహమ్ము గడున్!


      ఉత్పలమాల
      సేమము గాదు శ్రీహరిని చిత్తమునింపి భజించుటన్నఁదా
      నీమము దప్పకే కొలువ, నిల్పిన కానల బాలభక్తుఁ దా
      మేమన కున్నఁ బెబ్బులులు మీదట సైనికుడెంతొ జంకెనే
      చీమనుఁ జూచి భీతిలెను సింహము గ్రూరమృగాభిశంకతో!

      తొలగించండి
  2. ఏమాత్రము నమ్మదగని
    దౌ మాటను గూర్చి మాకు దబ్బుమనగనే
    యా మాటకాడనె నిటుల
    చీమం జూచి భయపడెను సింహమ్ము గడున్”

    రిప్లయితొలగించండి
  3. ఏమీ చిత్రము బాలుడు
    నీమముతో ధైర్యముగను నిర్భయ రీతిన్
    ఆ మహమంత్రి నడుగ నీ
    చీమం జూచి భయపడెను సింహమ్ము గడున్!

    రిప్లయితొలగించండి

  4. భామిని సీత జాడకయి పర్పము దాటిన యాంజనేయుడే
    క్షేమము గూర్చు వాడనని చింతిల బోకు మటంచు నచ్చటన్
    కోమలి తో వచించు తరి కొందల మందిన జానకిన్ గనన్
    జీమనుఁ జూచి భీతిలెను సింహము గ్రూరమృగాభిశంకతో


    కామను డా రావణుడే
    సామీరిగ వచ్చె నంచు సంకోచము తో
    కోమలి సీతయె భీతిల
    చీమం జూచి భయపడెను సింహమ్ము గడున్.

    రిప్లయితొలగించండి
  5. ఆముని శాపమ్మున పెను
    చీమగ యక్షుండు మారి జీవించునెడన్
    క్షేమము కాదని దలచుచు
    చీమం జూచి భయపడెను సింహమ్ము గడున్

    ఆముని శాపమూలమున యక్షుని రూపము మారె మేటియౌ
    చీమగఁ వానిరూపుగని చిన్నవి పెద్దవి సర్వజంతువుల్
    ధీమసమే తొలంగ వెను దెంచెను గ్రక్కున ప్రాణభీతితో
    చీమనుఁ జూచి భీతిలెను సింహము గ్రూరమృగాభిశంకతో

    రిప్లయితొలగించండి
  6. ఏమని జెప్పమందువిట నీదినమందున నాగృహంబునన్
    కామిని వంయింట దిరుగాడెడి జిల్లపు రుంగునా రయన్
    ధీమసమంత వీడి పతిదేవుని బిల్చుట గాంచ దోచెగా
    చీమనుఁ జూచి భీతిలెను సింహము గ్రూరమృగాభిశంకతో

    రిప్లయితొలగించండి
  7. రాముని భార్య జానకిని రావణు డెత్తుక పోయి నుంచె నా
    రామము నందు కల్గగ విరాళము లాతుగ నామె యందు నే
    నేమని చెప్పుదింక విధినేమని యందును చిత్రమౌనుగా
    చీమను జూచి భీతిలెను సింహము గ్రూరమృగాభిశంకతో

    రిప్లయితొలగించండి
  8. కం: "ఏమది మన నరసింహ
    మ్మేమి తెలుప కేడ్చు?" ననగ నిల్లాలు పరం
    ధామయ యిట్లనె "గుట్టిన
    చీమం జూచి భయపడెను సింహమ్ము గడున్”
    (పిల్లాడి పేరు నరసింహం.ముద్దుగా సింహం అనీ పిలుస్తారు. వాడెందు కేడుస్తున్నా? డని భార్య అడిగితే చీమ కుడితే భయ పడ్డాడని తండ్రి పరంథామయ్య అన్నాడు. )

    రిప్లయితొలగించండి
  9. ఉ:"ఏ మిది? కూన యెందులకు నేడ్చెనొ ? యిచ్చట భీతి గొల్పగా
    నే మనుజుండు వచ్చె? మరి యే మృగ ముండె?" నటంచు జూడ గా
    చీమనుఁ జూచి భీతిలెను, సింహము గ్రూరమృగాభిశంకతో
    నేమియొ యెంచి పిమ్మట శమించుచు బిడ్డకు నేర్పె ధైర్యమున్.
    (అది సింహమే ఐనా చిన్న పిల్ల కనుక భయ పడింది. పెద్ద సింహం ధైర్యం చెప్పింది. )

    రిప్లయితొలగించండి
  10. భీమ శరీరధారులగు పెక్కురు రక్కసులున్న లంకలో
    రాముని దూతగా హనుమ రావణు గొల్వున నుగ్రరూపుడై
    దీమసమొప్పగా బలుకు తీరును జూచి తలంచిరా సభన్
    చీమనుఁ జూచి భీతిలెను సింహము గ్రూరమృగాభిశంకతో

    రిప్లయితొలగించండి
  11. ఉ॥ ప్రేమగ స్పర్ధఁ బెట్టఁగను బిల్లల నెన్నుచుఁ బాఠశాలలో
    ధీమతులై యసత్యమును దీటుగఁ జెప్పఁగ హాస్యమొప్పఁగన్
    గోముగ నవ్వుఁ గాంచు విధి గొప్పగ నొక్కఁడు పల్కె నిట్టులన్
    జీమనుఁ జూచి భీతిలెను సింహము గ్రూరమృగాభిశంకతో

    గోముగ ముద్దుగ

    రిప్లయితొలగించండి
  12. (3)కం: ఆ మన్మోహన సింహుం
    డేమి తినడు కాని , చీమలే తెగ మ్రింగన్
    నా మానము చెడు నని పెను
    చీమం జూచి భయపడెను సింహమ్ము గడున్”
    (మాజీ ప్రథాని మన్ మోహన్ సింగ్ నిజాయతీపరుడే కానీ చీమలు తినటం మొదలెట్టాయి. అందులో ఒక పెద్ద చీమ అనగా టు జి స్పెక్ట్రం లో తిన్న చీమని చూసి తన పరువు పోతుం దని భయపడ్డాడు.ఆయన పేరు సింగ్ కాబట్టి సింహం.)


    రిప్లయితొలగించండి
  13. వేమరు గొప్పల బలుకుచు
    ధీమతు డని విఱ్ఱ వీగు ధీరుని కెదురై
    పామరు డొకరుడు నిలువ న్
    జీమo జూచి భయ పడెను సింహ మ్ము గడు న్

    రిప్లయితొలగించండి
  14. భీమ యుతమ్ము సైంధవుని భీరు జయింపఁగ లేక యో పరం
    ధామ! నరాత్మసంభవుని ధర్మ విహీనము పంపి యుంటిమే
    నా మగ ధీరు లాత్మల ఘనమ్ముగ భీతి వహించి నిల్చిరే
    చీమనుఁ జూచి భీతిలెను సింహము క్రూర మృగాభిశంకతో


    ఏమన వచ్చును వింతను
    భీమేతర సింహముఁ గని వెలవెల నగుచున్,
    దోమ యొకండు భయంపడఁ
    జీమం జూచి, భయపడెను సింహమ్ము గడున్

    రిప్లయితొలగించండి
  15. -

    వామనుని కత వినెను యే
    మో! మాయను బన్ని వచ్చె నో చీమవలెన్?
    ధీమతి నగుదును నేనిదె
    చీమం జూచి భయపడెను సింహమ్ము గడున్

    జిలేబీయము

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    చీమలు కుట్టగ బాలుడు
    చీమం జూచి భయపడెను;సింహమ్ము గడున్
    సామర్థ్యమ్మును జూపుచు
    సామీప్యమునందు వేట జరుపగ నేగెన్.

    రిప్లయితొలగించండి