31, ఆగస్టు 2026, సోమవారం

సమస్య - 5576

1-9-2026 (మంగళవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“బలదర్పాది వికార సంహతులతో బ్రహ్మంబు ప్రాప్తించెడిన్”

(లేదా...)

“ప్రాప్తించును బ్రహ్మపదము బలదర్పములన్”

(పట్వర్ధన్ గారి శతావధానంలో అక్కెర కరుణాసాగర్ గారి సమస్య)

9 కామెంట్‌లు:

  1. మత్తేభవిక్రీడితము
    కలుగన్ శాపము ద్వారపాలకులకున్ గారుణ్య మేపారఁగన్
    గలహమ్మొందుచు వైరభక్తి మిగులన్ గల్గంగ వైళమ్మునన్
    గలువన్ వచ్చును నన్నటంచు హరి వక్కాణింపఁగన్ వారికిన్
    బలదర్పాది వికార సంహతులతో బ్రహ్మంబు ప్రాప్తించెడిన్

    కందం
    ఆప్తుండై జయవిజయులు
    తృప్తిన్ గొన శాపభీతి తేలిక పడఁగన్
    గుప్తమ్ముగ హరి పలికెన్
    ప్రాప్తించును బ్రహ్మపదము బలదర్పములన్

    రిప్లయితొలగించండి
  2. ఆప్తమునే యలవరచుచు
    తృప్తిని బొందుచు శుభమగు తెరగు నరయుచున్
    గుప్తముగ బ్రతుకు నీడ్చగ
    బ్రాప్తించును బ్రహ్మపదము బలదర్పములన్”

    రిప్లయితొలగించండి
  3. తృప్తిగ సల్పె డు తపమున
    ప్రాప్తి o చును బ్రహ్మ పదము :: బల దర్పము లన్
    ప్రాప్తించు ను లేశ మయిన
    సప్త ద్వీ పము ల యఁదు సాధ్యంబ గు చున్

    రిప్లయితొలగించండి
  4. -

    తపమాచరింపగా ప్రతి
    భ పరిమళింప మనుజులకు ప్రాప్తించును బ్ర
    హ్మపదము; బలదర్పములన్
    కపటత్వముపెరుగు వినవె కంద జిలేబీ


    రిప్లయితొలగించండి

  5. ఇల ధర్మమ్మును బ్రోచు దీక్షగల యా హేమాంగు కల్లోలు రై
    యిల లో బుట్టిన వారు సత్పురుషులన్ హింసించి సాధించి రే
    బలదర్పమ్ముల జూపి, యక్షరుని చే పాకాలి సంసిద్ధి నే
    బలదర్పాది వికార సంహతులతో బ్రహ్మంబు ప్రాప్తించెడిన్.


    దీప్తీ! యసత్యము లిటుల
    వ్యాప్తింజేయ దగదంటి నవివేకిగ ని
    న్నాప్తులు తలవరె, యెవ్విధి
    ప్రాప్తించును బ్రహ్మపదము బలదర్పములన్.

    రిప్లయితొలగించండి
  6. అలుకన్ బూని మునీశ్వరుండొసగె తానక్కస్సు శాపమ్ము వా
    రలు ప్రార్థింప విమోచనమ్మునకు మార్గంబిట్లు వాచించెనే
    ఖలురై పుట్టుచు భూరిచేత హతులై కైవల్యమున్ బొందుడీ
    బలదర్పాది వికార సంహతులతో బ్రహ్మంబు ప్రాప్తించెడిన్.

    రిప్లయితొలగించండి
  7. అలుకన్ బూని మునీశ్వరుండొసగె తానక్కస్సు శాపమ్ము వా
    రలు ప్రార్థింప విమోచనమ్మునకు మార్గంబిట్లు వాచించెనే
    ఖలురై పుట్టుచు భూరిచేత హతులై కైవల్యమున్ బొందుడీ
    బలదర్పాది వికార సంహతులతో బ్రహ్మంబు ప్రాప్తించెడిన్.

    రిప్లయితొలగించండి
  8. తృప్తికర సాధనముతో
    ప్రాప్తించును బ్రహ్మపదము; బలదర్పములన్
    లుప్తమొనరింపగా ని
    క్షిప్తంబౌ భక్తిభావ చిత్తము వలనన్

    బలదర్పంబుల తోడ సౌఖ్యమనుచున్ భావించులే మూఢుడే
    తొలగింపన్ దగుఁ దుచ్చమౌ తలపులన్ దూరంబగున్ వ్యక్తికిన్
    బలదర్పాది వికార సంహతులతో బ్రహ్మంబు; ప్రాప్తించెడిన్
    వలలో చిక్కిన మీనరాశి పగిదిన్ బ్రహ్మంబు మోక్షంబుతో

    రిప్లయితొలగించండి