29, అక్టోబర్ 2026, గురువారం

సమస్య - 5635

30-10-2026 (శుక్రవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కాముని నేత్రానలమ్ము గంతునిఁ గాల్చెన్”

(లేదా...)

“కాముని కంటిమంటలకుఁ గంతుఁడు మారెను భస్మరాశిగన్”

5 కామెంట్‌లు:

  1. కందం
    నీమంబుగ తపమెంచిన
    సోముఁడపర్ణన్ గన నిడ సుమబాణములన్
    వేమరని, త్ర్యంబకుని ని
    ష్కాముని నేత్రానలమ్ము గంతునిఁ గాల్చెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      నీమము తప్పకే తపము నిర్మలరీతినొనర్చుచుండగన్
      సోముఁడపర్ణనే కనఁ బ్రసూనపు బాణములేసినంతటన్
      వేమరకుండగన్ రగిలి విప్పియుఁ జూడగ తీక్ష్ణమొప్ప ని
      ష్కాముని కంటిమంటలకుఁ గంతుఁడు మారెను భస్మరాశిగన్

      తొలగించండి
  2. సోముడు శివనొలయునటుల
    కాముడు యత్నించినట్టి కారణమందున్
    తామసులను శిక్షించ
    కాముని నేత్రానలమ్ము గంతునిఁ గాల్చెన్

    రిప్లయితొలగించండి

  3. తామర సాదుల వేసిన
    కాముని పై నాగ్రహించి ఖట్వాంగధరుం
    డా ముక్కన్ను తెరువ ని
    ష్కాముని నేత్రానలమ్ము గంతునిఁ గాల్చెన్.


    ప్రేముని యానతిన్ గొని రవీషువు భర్గుని మానసమ్మునన్
    ప్రేమ జనింప జేయగను వేసెను తామర సాదు లంతటన్
    తామాస మందినట్టి నెలదారియె విప్పగ వెట్టకన్ను, ని
    ష్కాముని కంటిమంటలకుఁ గంతుఁడు మారెను భస్మరాశిగన్.

    రిప్లయితొలగించండి
  4. సోమునిఁ విరిశరములతో
    కాముడు బాధింప మనసు కందినవాడై
    గాములదొర చూడగ ని
    ష్కాముని నేత్రానలమ్ము గంతునిఁ గాల్చెన్

    సోముని యంతరంగమున చొక్కిల జేయగ ప్రేమభావనల్
    కాముడు వాడిబాణముల కల్మషకంఠుని కొట్టినంతటన్
    దామసుడై విషాంతకుడు తత్క్షణమాతనిఁ జూచినంత ని
    ష్కాముని కంటిమంటలకుఁ గంతుఁడు మారెను భస్మరాశిగన్

    రిప్లయితొలగించండి