29-10-2026 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్రాణగండమౌ గృహమునఁ బతికి సతము”
(లేదా...)
“ప్రాణాపాయ పరిస్థితుల్ పతికి సంప్రాప్తించు గేహంబునన్”
అందమునుజూసి మురియుచు నాపడతినికోరి కోరి పెండ్లాడుట కుదురె గాని ,సతి కతి తరచుగా పిచ్చి పట్టుచుండప్రాణగండమౌ గృహమునఁ బతికి సతము
తేటగీతి సంప్రదాయము కాదని సంపదలనుజంట రాబడులెంతని సాగుచుండ వధువు ప్రేమాయణము దాచి వరునిఁ బడయప్రాణగండమౌ గృహమునఁ బతికి సతము! శార్దూలవిక్రీడితముఏణాక్షిన్ గని రాబడిన్ దెలిసి లెక్కింపన్నదే ముఖ్యమన్ బాణీతోడ వధూవరుల్ మనువునే వాంఛింప స్వార్థమ్మునన్జాణల్ దాచిన ప్రేమికుండు చెలఁగన్ సాగించ గూఢమ్ముగన్బ్రాణాపాయ పరిస్థితుల్ పతికి సంప్రాప్తించు గేహంబునన్
వంట రానట్టి పడతియే భార్య యగుచు పలు విధమ్ముల పరిశోధనలను చేసి క్రొత్త వంటల వండెడి కొమ్మ యున్న ప్రాణగండమౌ గృహమునఁ బతికి సతము.ప్రాణేశా! వలదీ ప్రయత్నమనుచున్ బ్రార్థింతు, నిన్నే బహి ప్రాణమ్మంచు దలంచితిన్ గనగ నీవంటల్ తినన్ సేగియే ప్రాణంబున్ హరియించు నిక్కమిది నీ పాటిన్ బసాలున్న చో ప్రాణాపాయ పరిస్థితుల్ పతికి సంప్రాప్తించు గేహంబునన్.
అందమునుజూసి మురియుచు నాపడతిని
రిప్లయితొలగించండికోరి కోరి పెండ్లాడుట కుదురె గాని ,
సతి కతి తరచుగా పిచ్చి పట్టుచుండ
ప్రాణగండమౌ గృహమునఁ బతికి సతము
తేటగీతి
రిప్లయితొలగించండిసంప్రదాయము కాదని సంపదలను
జంట రాబడులెంతని సాగుచుండ
వధువు ప్రేమాయణము దాచి వరునిఁ బడయ
ప్రాణగండమౌ గృహమునఁ బతికి సతము!
శార్దూలవిక్రీడితము
ఏణాక్షిన్ గని రాబడిన్ దెలిసి లెక్కింపన్నదే ముఖ్యమన్
బాణీతోడ వధూవరుల్ మనువునే వాంఛింప స్వార్థమ్మునన్
జాణల్ దాచిన ప్రేమికుండు చెలఁగన్ సాగించ గూఢమ్ముగన్
బ్రాణాపాయ పరిస్థితుల్ పతికి సంప్రాప్తించు గేహంబునన్
రిప్లయితొలగించండివంట రానట్టి పడతియే భార్య యగుచు
పలు విధమ్ముల పరిశోధనలను చేసి
క్రొత్త వంటల వండెడి కొమ్మ యున్న
ప్రాణగండమౌ గృహమునఁ బతికి సతము.
ప్రాణేశా! వలదీ ప్రయత్నమనుచున్ బ్రార్థింతు, నిన్నే బహి
ప్రాణమ్మంచు దలంచితిన్ గనగ నీవంటల్ తినన్ సేగియే
ప్రాణంబున్ హరియించు నిక్కమిది నీ పాటిన్ బసాలున్న చో
ప్రాణాపాయ పరిస్థితుల్ పతికి సంప్రాప్తించు గేహంబునన్.