28, అక్టోబర్ 2026, బుధవారం

సమస్య - 5634

29-10-2026 (బుధవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ప్రాణగండమౌ గృహమునఁ బతికి సతము”

(లేదా...)

“ప్రాణాపాయ పరిస్థితుల్ పతికి సంప్రాప్తించు గేహంబునన్”

4 కామెంట్‌లు:

  1. అందమునుజూసి మురియుచు నాపడతిని
    కోరి కోరి పెండ్లాడుట కుదురె గాని ,
    సతి కతి తరచుగా పిచ్చి పట్టుచుండ
    ప్రాణగండమౌ గృహమునఁ బతికి సతము

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    సంప్రదాయము కాదని సంపదలను
    జంట రాబడులెంతని సాగుచుండ
    వధువు ప్రేమాయణము దాచి వరునిఁ బడయ
    ప్రాణగండమౌ గృహమునఁ బతికి సతము!

    శార్దూలవిక్రీడితము
    ఏణాక్షిన్ గని రాబడిన్ దెలిసి లెక్కింపన్నదే ముఖ్యమన్
    బాణీతోడ వధూవరుల్ మనువునే వాంఛింప స్వార్థమ్మునన్
    జాణల్ దాచిన ప్రేమికుండు చెలఁగన్ సాగించ గూఢమ్ముగన్
    బ్రాణాపాయ పరిస్థితుల్ పతికి సంప్రాప్తించు గేహంబునన్

    రిప్లయితొలగించండి

  3. వంట రానట్టి పడతియే భార్య యగుచు
    పలు విధమ్ముల పరిశోధనలను చేసి
    క్రొత్త వంటల వండెడి కొమ్మ యున్న
    ప్రాణగండమౌ గృహమునఁ బతికి సతము.


    ప్రాణేశా! వలదీ ప్రయత్నమనుచున్ బ్రార్థింతు, నిన్నే బహి
    ప్రాణమ్మంచు దలంచితిన్ గనగ నీవంటల్ తినన్ సేగియే
    ప్రాణంబున్ హరియించు నిక్కమిది నీ పాటిన్ బసాలున్న చో
    ప్రాణాపాయ పరిస్థితుల్ పతికి సంప్రాప్తించు గేహంబునన్.

    రిప్లయితొలగించండి
  4. వీణ తీగెను పలికించు విధము నెంచి
    ప్రాణసమను లాలింపడా వల్లభుండు
    రాణి యలుకబూని దరికి రాకయున్న
    ప్రాణగండమౌ గృహమునఁ బతికి సతము

    వీణాతంత్రినిఁ మీటు రీతి వధువున్ బ్రేయాంసుడే చూడగా
    ప్రాణాధారము నీవటంచు సతితాఁ వాక్రుచ్చులే రూఢిగా
    వేణీవేథనిఁ బోలుచున్ గృహిణి తాఁ వేధింపగా నేర్వగా
    బ్రాణాపాయ పరిస్థితుల్ పతికి సంప్రాప్తించు గేహంబునన్

    రిప్లయితొలగించండి