8, మే 2020, శుక్రవారం

సమస్య - 3363

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్"
(లేదా...)
"ఇంటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ"

7, మే 2020, గురువారం

సమస్య - 3362

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గాడిద నెక్కి శశిధరుఁడు గాశికి నేఁగెన్"
(లేదా...)
"గాడిద నెక్కి శంకరుఁడు గాశికి నేఁగె నుమాసమేతుఁడై"

6, మే 2020, బుధవారం

సమస్య - 3361

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ముదము వలదటంచుఁ బోఱఁ డేడ్చె"
(లేదా...)
"ముదమును రోసి వద్దనుచుఁ బోఱఁడు బిట్టుగ నేడ్చె నత్తఱిన్"

5, మే 2020, మంగళవారం

సమస్య - 3360

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు"
(లేదా...)
"హలమును దాల్చినట్టి నిటలాక్షుఁడె దిక్కగు నెల్లవారికిన్"

4, మే 2020, సోమవారం

సమస్య - 3359

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నత్తను బెండ్లాడవచ్చునా యని రెల్లన్"
(లేదా...)
"నత్తను బెండ్లియాడఁ దగునా యని నవ్విరి బంధులెల్లరున్"

3, మే 2020, ఆదివారం

ఆహ్వానం


సమస్య - 3358

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్"
(లేదా...)
"పైకంబున్ గొని కర్షకుండు ఖలుఁడై భ్రష్టత్వముం బొందులే"

2, మే 2020, శనివారం

'ఉగాది కవిసమ్మేళనం' ప్రచురణ

కవిమిత్రులారా!
          శార్వరి ఉగాది సందర్భంగా కవుల పద్య సంకలనం 'శంకరాభరణం - శార్వరి ఉగాది కవిసమ్మేళనం' పేరుతో ముద్రించడానికి తుదిమెరుగులు దిద్దుకుంటున్నది. అందులో కవుల ఊరి పేరుతో పాటు ఫోన్ నెం. కూడా ఇవ్వాలని కోరారు. కావున ఆ సంకలనంలోని కవులు తమ ఫోన్ నెం.లు, చిరునామాలు ఈ పోస్టు క్రిందకాని నా మెయిల్ (shankarkandi@gmail.com)కు కాని పంపించమని మనవి.
          దాదాపు 120 పేజీల పుస్తకం ముద్రణకు అవసరమైన డబ్బు పూర్తిగా సమకూరలేదు. కనుక పంపని వారెవరైనా ఉంటే పంపవచ్చు. తప్పక పంపాలన్న నిర్బంధం లేదు. డబ్బు పంపవలసిన అకౌంటు వివరాలు.....

Kandi Shankaraiah
State Bank of India,
Warangal Main.
A/c No. 62056177880
IFC : SBIN0020148

గూగుల్ పే, ఫోన్ పే, పేటియం ద్వారా పంపడానికి ఫోన్ నెం. 7569822984

సమస్య - 3357

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాట్నము విడి గాంధి యిదె స్వరాజ్యముఁ దెచ్చెన్"
(లేదా...)
"రాట్నము వీడి తెచ్చెను స్వరాజ్యము గాంధి మహాత్ముఁ డొప్పుగన్"

1, మే 2020, శుక్రవారం

సమస్య - 3356

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మునిఁ గని భయపడిరి పుడమిదొరలు"
(లేదా...)
"మునిఁ గని రాజులెల్లఁ దలపోసిరి కాలుఁ డటంచు భీతితోన్"