మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణలో 'విదేశఠావులు' దుష్టసమాసం. 'జన+ఓఘ=జనౌఘ' అవుతుంది. 'జనౌఘ+ఛాయ=జనౌఘచ్ఛాయ' అవుతుంది. రెండవ పూరణ మొదటి పాదంలో గణభంగం. 'పుట్టినిలు'ను 'పుట్నిలు' అన్నారు. 'అభ్యుదయాతిమై'?
'ఉగాది కవి సమ్మేళనం' పుస్తకం ముద్రణ కోసం తుదిరూపు దిద్దుకుంటున్నది. అందులో కవుల ఫోన్ నెం. వేస్తున్నాము. ముద్రణ అయ్యాక పుస్తకాలను కొరియర్ లో పంపడానికి చిరునామాలు కావాలి. మీరెలాగూ ఫోన్ నెం. ఇవ్వరని తెలుసు. కేరాఫ్ అడ్రస్ ఏదైనా ఇస్తే అక్కడికి పుస్తకాలు పంపిస్తాను. నా మెయిల్ కు పంపండి. shankarkandi@gmail.com
పట్నము కాదు కాదు మన పల్లెలు దేశపు పట్టుకొమ్మలౌ! కొట్నము జేయనేల? మనకున్ మనమే వడకంగలేమొకో రాట్నము బట్టి బట్టలనె.! గ్రంథము నేర్వుము! పల్కరాదిటుల్ రాట్నము వీడి తెచ్చెను స్వరాజ్యము గాంధి మహాత్ముఁ డొప్పుగన్!!
పూజ్యులు పోచిరాజు వారికి నమస్సులు!ఆర్యా,రాట్నమును చక్రమని మీరు ప్రయోగించుట తప్పని నా ఉద్దేశ్యముకాదు! నేను వ్రాసిన హింసయన్ రాట్నము ప్రయోగం గురించి మాత్రమే సందేహము వ్యక్తపరచాను!మార్గదర్శనమునకు ధన్యవాదములు!
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
రాట్నము త్రిప్పుచున్ ప్రజను రమ్యపు రీతిని నుత్సహించుచున్
పట్నము పల్లెలన్ తిరిగి పల్కుచు మాటలు సొంపు సొంపుగన్
రాట్నపు సార్థకమ్ము గొని లాభము పొందుచు యుద్ధమందునన్
రాట్నము వీడి తెచ్చెను స్వరాజ్యము గాంధి మహాత్ముఁ డొప్పుగన్
మీ (సరదా) పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
కట్నము కానుకల్ కొనుచు కారపు పూసలు మెండు మెక్కుచున్
చట్నిని దోసె లిడ్డెనుల చక్కగ మేయుచు హోటలందునన్
పుట్నల పప్పులన్ తినుచు బొజ్జను పైత్యము జేయ పల్కితో:
"రాట్నము వీడి తెచ్చెను స్వరాజ్యము గాంధి మహాత్ముఁ డొప్పుగన్"
మీ అధిక్షేపాత్మకమైన ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిపట్నపువాసివైచదివెబాగుగదేశవిదేశఠావులన్
రిప్లయితొలగించండిరాట్నముఁబట్టెతానిలస్వరాష్ట్రముఁగోరుచు,నుద్యమోన్నతిన్
కట్నమునీయగాఁదలచికాలిడెదేశజనోఘఛాయకున్
"రాట్నము వీడి ,తెచ్చెను స్వరాజ్యము గాంధి మహాత్ముఁ డొప్పుగన్
పట్నపువాసియైచదివెబాగుగదేశవిదేశఠావులన్
తొలగించండిరాట్నముఁబట్టెతానిలస్వరాష్ట్రముఁగోరుచు,నుద్యమోన్నతిన్
కట్నమునీయగాఁదలచికాలిడెదేశజనోఘఛాయకున్
"రాట్నము వీడి ,తెచ్చెను స్వరాజ్యము గాంధి మహాత్ముఁ డొప్పుగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపట్నపువియ్యమందగవివాహముచేసెస్వరాజ్యగాంధిలకున్
తొలగించండికట్నమునీయలేదనుచుఁగాదనియత్తయుపంపెకోడలిన్
పుట్నిలకున్ మగండుమదిపుట్టినదుఃఖము నెక్కువై వడిన్
(పుట్నిలకున్ మగండుమదిపుట్టినయభ్యుదయాతిమైవడిన్)
"రాట్నము వీడి తెచ్చెను స్వరాజ్యము గాంధి మహాత్ముఁ డొప్పుగన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమొదటి పూరణలో 'విదేశఠావులు' దుష్టసమాసం. 'జన+ఓఘ=జనౌఘ' అవుతుంది. 'జనౌఘ+ఛాయ=జనౌఘచ్ఛాయ' అవుతుంది.
రెండవ పూరణ మొదటి పాదంలో గణభంగం. 'పుట్టినిలు'ను 'పుట్నిలు' అన్నారు. 'అభ్యుదయాతిమై'?
జనౌఘ అనేది తప్పగా టైపు అయ్యింది. విదేశ ఠావులన్ మారుస్తాను. గణం చూసుకుంటాను. ధన్యవాదాలు🙏
తొలగించండి(రాట్నము వీడిన మన ఆడంబరదుర్బలత్వం-
రిప్లయితొలగించండిరాట్నము వీడని మహాత్ముని నిరాడంబరసబలత్వం )
కట్నపుమోజు హెచ్చి కను
గానని మోహమునందు నుంటిమే
పట్నపువాసమన్న నెద
వాంఛల నింపుచు పొంగుచుంటిమే
రాట్నము వీడి ;తెచ్చెను స్వ
రాజ్యము గాంధి మహాత్ము డొప్పుగన్
రాట్నము ద్రిప్పి దేశమున
రంజిలజేయుచు నైకమత్యమున్ .
విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరాట్నమొడికి పోర ప్రజ
రిప్లయితొలగించండికట్నముగ స్వరాజ్యమొచ్చె,కలిగెను గొడవల్
పట్నము పల్లెల మతమని
రాట్నము విడి,గాంధి యిదె స్వరాజ్యము దెచ్చెన్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వడికి, వచ్చె'లను 'ఒడికి, ఒచ్చె' అనరాదు.
పట్నమున తయారగు మర
రిప్లయితొలగించండిరాట్నము విడి , గాంధి యిదె స్వరాజ్యముఁ దెచ్చెన్
పుట్నింటనున్న సాదా
రాట్నము తోడనె వడకుచు లబ్ధిని బొందెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పుట్నింట'?
రిప్లయితొలగించండిసమస్యా పాదమెక్కడే జిలేబి ? :)
నిమిషము కూడ వృధా చే
య మనసు రాదాయె! లేడయా యెపుడున్ రా
ట్నము విడి; గాంధి యిదె స్వరా
జ్యముఁ దెచ్చెన్ మనకు సూవె చల్లగ బతుకన్!
జిలేబి
సమస్యాపాదాన్ని స్థానభ్రంశం చేసి ప్రాసక్లేశాన్ని తప్పించుకున్న మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఇవ్వాళ పూసపాటి వారు పూనినారు :)
ఇచ్చిన పాదము చంపకమాల పూరణ కందములో :)
నిమిషము కూడ వృధాచే
యమనసు రాదాయె! లేడయాయెపుడున్ "రా
ట్నము వీడి; తెచ్చెను స్వరా
జ్యము గాంధి మహా త్ముఁ డొప్పుగన్" మనకు సుమా
జిలేబి
అదురహో జిలేబి!!!
తొలగించండి👌
నాల్గవ పాదపు యతి సందేహమే!
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి
తొలగించండిజ్య - య గన్ - అన్ ?
సరియేనాండి ? సరి కాకుంటే సరి చేయవలె కంది వారు :)
నాల్గవపాదంలోని యతి సరి కాదు. సరిచేసే అవకాశం లేదు.
తొలగించండి'ఉగాది కవి సమ్మేళనం' పుస్తకం ముద్రణ కోసం తుదిరూపు దిద్దుకుంటున్నది. అందులో కవుల ఫోన్ నెం. వేస్తున్నాము. ముద్రణ అయ్యాక పుస్తకాలను కొరియర్ లో పంపడానికి చిరునామాలు కావాలి. మీరెలాగూ ఫోన్ నెం. ఇవ్వరని తెలుసు. కేరాఫ్ అడ్రస్ ఏదైనా ఇస్తే అక్కడికి పుస్తకాలు పంపిస్తాను. నా మెయిల్ కు పంపండి.
తొలగించండిshankarkandi@gmail.com
తొలగించండిధన్యవాదములు. ఇంతకు మునుపిచ్చిన చిరునామాకే పంపగలరు
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిరాట్నము వీడి తెచ్చెను స్వరాజ్యము గాంధి మహాత్ముఁ డొప్పుగన్"
పట్నము కాదు కాదు మన పల్లెలు దేశపు పట్టుకొమ్మలౌ!
కొట్నము జేయనేల? మనకున్ మనమే వడకంగలేమొకో
రాట్నము బట్టి బట్టలనె.! గ్రంథము నేర్వుము! పల్కరాదిటుల్
రాట్నము వీడి తెచ్చెను స్వరాజ్యము గాంధి మహాత్ముఁ డొప్పుగన్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిజై ఖాదీ గ్రామోద్యోగ్ :) కరోనా కీ బార్ ఖాదీ భాండార్
కొట్నంబదేల జనులకు
రాట్నము విడి? గాంధి యిదె స్వరాజ్యముఁ దెచ్చెన్
రాట్నమ్ము వడికి! ఖాదీ
పట్నములందమ్ముటకిక వడకండర్రా!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపట్నముపల్లెలయందున
రిప్లయితొలగించండిరాట్నమువడకుటగరపెను ప్రజలకుగాంధీ
రాట్నమెసర్వము, లేకనె
రాట్నము విడి గాంధి యిదె స్వరాజ్యముఁ దెచ్చెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'లేకయె' అనండి.
మీ చిరునామా, ఫోన్ నెం. తెలియజేయండి. (కవిసమ్మేళనం పుస్తకం కొరకు)
పట్నమురంగులరాట్నము
రిప్లయితొలగించండికట్నముగాపల్లెయల్లుకాయముననగన్,
కొట్నముసేయకరంగుల
రాట్నము విడి గాంధి యిదె స్వరాజ్యముఁ దెచ్చెన్
కొరుప్రోలు రాధాకృష్ణారావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి[5/2, 06:20] shankargdabbikar999: పట్నము వీడె పల్లెలకు పట్టము గట్ట స్వదేశి యద్య మం
రిప్లయితొలగించండిబిట్నె ప్రవర్ధమానమగు నింగ్లిషు వాడికి శృంగ భంగమై
చట్న సరించటంచు మనసా వచసా శిరసా దలంచె దా
నిట్నె స్వదేశి యుద్యమము నింపెస లారగ జేయ నెంచె నే
చట్నిని మెక్కి బల్కితివి !చాలిక మట్ను మెసంగితో యెటుల్
రాట్నము వీడి తెచ్చెను స్వరాజ్యము గాంధి మహాత్ముఁ డొప్పుగన్?
[5/2, 06:32] shankargdabbikar999: పుట్నిల్లుగరిమనెరుగవు
మట్నూచట్నీలమెక్కిమైమరచితివో
పట్నాయకయెప్డెవ్విధి
రాట్నము విడి గాంధియిదె స్వరాజ్యముఁదెచ్చెన్?
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండివ్యాకరణ విరుద్ధమైన, వ్యావహారిక పదాలున్నవి. ప్రాస అటువంటిది కనుక త(ప్ప)ప్పు లేదు.
కట్నము లేనివి రోజులు
రిప్లయితొలగించండిరాట్నమువసనము తొడిగియు లాపట్టాతో
పట్నముపల్లెలుతిరుగుచు
రాట్నము విడి గాంధి యిదె స్వరాజ్యముఁ దెచ్చెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపట్నము పల్లెలజనులకు
రిప్లయితొలగించండికట్నమునిచ్చెను అహింసకనకపుకాన్కన్
రాట్నముబట్టలుతొడిగెడు
రాట్నము విడి గాంధి యిదె స్వరాజ్యముఁ దెచ్చెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికట్నము మందున కేలర?
రిప్లయితొలగించండిపట్నపు వరుడట్టమనుచు వ్రాయమనగ తా
రాట్నమనుచు వ్రాసెనిటుల
రాట్నము విడి గాంధి యిదె స్వరాజ్యముఁ దెచ్చెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఒట్నే యెటికొట్నంబని
రిప్లయితొలగించండికొట్నము జనమునకుఁ జేయ కుదరదటంచున్
ఛట్నన్ దలచి మహాత్ముడు
రాట్నము విడి గాంధి యిదె స్వరాజ్యముఁ దెచ్చెన్
ఒట్నే-ఊరికనే; ఎటికొట్నము-వెట్టపని
కొట్నము-సేవ; ఛట్న-తటాలున
ఛట్న దలంచి మహాత్ముడు
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికూట్నీళ్ళకు కటకట పడి
రిప్లయితొలగించండిరాట్నము తిప్పుకొని బ్రతుక రాజీ పడెడున్
రాట్నపు ప్రజకై రంగుల
రాట్నము విడి గాంధియిదె స్వరాజ్యము తెచ్చెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం//
రిప్లయితొలగించండిపట్నాయక్ మ్యూజిక్కున
పట్నములో "గాంధి సినిమ" పలువురు జూడన్ !
కట్నము చాలా నొసగగ
రాట్నము విడి గాంధి యిదె స్వరాజ్యముఁ దెచ్చెన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపట్నము లో వసి యించుచు
రిప్లయితొలగించండిరాట్నము గురి యించి తెలియ రాని విషయ మై
పాట్నాలో యిటు లని యె
P
రాట్నము విడి గాంధి యిదె స్వరాజ్యము దె చ్చె న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణభంగం. "...యిటు లనియెను" అనండి.
అందరికీ నమస్సులు 🙏🙏
రిప్లయితొలగించండిసరదా ప్రయత్నం 😊😄
*కం||*
చట్నీ విడి టిఫిను తినుట
కట్నము విడి పెండ్లి యగుట కష్టము గాదే
అట్నే, గిది జెప్పుట గద
*"రాట్నము విడి గాంధి యిదె స్వరాజ్యముఁ దెచ్చెన్"*!!
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏😊🙏😊🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపట్నము, వాడవాడలు సవాలుని చేయుచు పాదయాత్రలం
దట్నపు ధైర్యమున్ పగటి, దాస్యము దైన్యము శ్వేతరాజ్ఞికై
కొట్నము వద్దటంచు, భళి కూకటి వేళ్ళను లాగి, త్రిప్పి యా
రాట్నము, వీడి తెచ్చెను, స్వరాజ్యము గాంధి మహాత్ముఁ డొప్పుగన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిరాట్నము వడకుట నేర్పుచు
రాట్నము తా వడకుచుండి రాట్నమె ప్రజకున్
కట్నముగా నిడి రంగుల
రాట్నము విడి గాంధి యిదె స్వరాజ్యము దెచ్చెన్.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిరాట్నము తోడ నేకులను రమ్యముగా వడకేటి తీరునిన్
పట్నము గ్రామ వాసులకు బాగుగ నేర్పుచు నెల్లవారికిన్
కట్నముగా ప్రశస్త చరఖానిడి తానుగ రంగు రేగెడిన్
రాట్నము వీడి తెచ్చెను స్వరాజ్యము గాంధి మహాత్ముఁ డొప్పుగన్!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిరాట్నము పైన వస్త్రములు రాశులు రాశులు నేయు వాడె తా
రిప్లయితొలగించండికట్నముఁ బెట్టె నల్లునకు ఖద్దరు కాదని మిల్లు వస్త్రముల్
రాట్నము వీడి, తెచ్చెను స్వరాజ్యము గాంధి మహాత్ముఁడొప్పగన్
పట్నము పల్లెలందిరిగి స్వార్థము వీడి యహింస మార్గమున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరాట్నమువిడెననసబబే
రిప్లయితొలగించండిరాట్నమువిడిగాంధియిదెస్వరాజ్యముదెచ్చెన్
రాట్నమువణుకుచుగాంధీ
కట్నముగాదెచ్చెమనకుకలలఫలితమున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసరిజేసితిని గురూజీ 🙏
రిప్లయితొలగించండికం//
పట్నాయక్ మ్యూజిక్కున
పట్నములో "గాంధి సినిమ" పలువురు జూడన్ !
కట్నము చాల నొసంగగ
రాట్నము విడి గాంధి యిదె స్వరాజ్యముఁ దెచ్చెన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిపాట్నాజనులంతయువర
కట్నమువీడిరి పరిమళ కాంతన్ వలచన్
ముట్నూరి పత్రిక దెలిపె
రాట్నమువిడి గాంధి యిదె స్వరాజ్యము దెచ్చెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరాట్నమువీడిదెచ్చెనుస్వరాజ్యముగాంధిమహాత్ముడొప్పుగన్
రిప్లయితొలగించండిరాట్నమువీడకుండగస్వరాజ్యముదెచ్చుటజూచిరేగదా
పట్నపువాసులున్మఱియుపల్లెలవాసులునేకమౌటచే
కట్నముగాలభించెనుగగామితరాజ్యముశోభగూర్చుచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరాట్నమున వడుక బట్టలు
రిప్లయితొలగించండిరాట్నముల మయమ్ము సేయు రతి దేశంపుం
బట్నపు టింటింట నిలిపె
రాట్నము విడిగాంధి యిదె స్వరాజ్యముఁ దెచ్చెన్
[విడి = ప్రత్యేకమైన / ఒంటరి]
కొట్నపు జీవ మేల యని కుందుచు నిత్యము భారతమ్మునం
బట్నము పల్లె వాసులు నపార ధృతిం గని నేత కిచ్చెడిం
గట్నము సత్య శాంతి పరఁగంగఁ గరమ్మున నాగ్రహాఖ్యమౌ
రాట్నము వీడి తెచ్చెను స్వరాజ్యము గాంధి మహాత్ముఁ డొప్పుగన్
[కొట్నము = ఊడిగము; రాట్నము =చక్రము; ఆగ్రహ మనెడు చక్రాయుధము]
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిరాట్నముపట్టినాడుజనరంజకమైన విధానగాంధిజీ
రిప్లయితొలగించండిపట్నముపల్లెలన్ తిరిగి భారతి దాస్యవిముక్తికోరియున్
కొట్నమువెట్టిచాకిరులకుందు జనావళి రక్షణార్థమై
రాట్నము వీడి తెచ్చెను స్వరాజ్యము గాంధి మహాత్ముఁ డొప్పుగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశకారుని పూరణ
రిప్లయితొలగించండిపట్నాలకు కాళ్ళుండును
కట్నమ్మడుగని వరుండు కానలకేగున్
చట్నీదిన చేదగునని
రాట్నమువిడి గాంధియిదె స్వరాజ్యము దెచ్చెన్
పట్నము పల్లెలనన్ దిరిగి భారతమాతకు బట్టకట్టుచున్
కట్నము గోరుచున్ ప్రజల ఖద్దరుగట్టగ దేశరక్షకై
రాట్నము పార్టిగుర్తుగను రాజిల చేతనుదాల్చి హింసయన్
రాట్నమువీడి తెచ్చెను స్వరాజ్యము గాంధిమహాత్ము డొప్పుగన్
రాట్నము = చక్రము (పెద్దలు పోచిరాజుగారిని అనుసరణ) సరియేనా?
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
తొలగించండిడా. సీతా దేవి గారు రాట్నము ముందు చక్రమే కదా.
తొలగించండినూలు వడుకుట కుపయోగించిన రాట్నము.
దుష్టాసురులను వధించుట కుపయోగించిన సుదర్శన చక్రము.
గుండ్రముగా నుండి తిరుగుట వలన ధరణీ చక్రము.
వాహనములను నడిపించిన బండిచక్రము.
యంత్రము లందు సరాసరి శక్తి కొఱ కుపయోగించిన నుఱికెడు చక్రము (Fly wheel).
వస్తువులు కోయుట కుపయోగించినఁ బళ్ల చక్రము (slitting saw)
వినోదమున కుపయోగించిన ఱంకుల రాట్నము.
పని యేమైన రూపము చక్రమే!
పూజ్యులు పోచిరాజు వారికి నమస్సులు!ఆర్యా,రాట్నమును చక్రమని మీరు ప్రయోగించుట తప్పని నా ఉద్దేశ్యముకాదు! నేను వ్రాసిన హింసయన్ రాట్నము ప్రయోగం గురించి మాత్రమే సందేహము వ్యక్తపరచాను!మార్గదర్శనమునకు ధన్యవాదములు!
తొలగించండిఉ:
రిప్లయితొలగించండిరాట్నమె మూలమయ్యె పలు రంగుల ఖాది స్వదేశి బట్టలన్
రాట్నమె సూత్రమయ్యె గద రాష్ట్రము నందున దేశ భక్తికిన్
పట్నపు జీవితమ్ము పరివర్తనమందగ నిష్టసిద్ధికై
రాట్నము వీడి తెచ్చెను స్వరాజ్యము గాంధి మహాత్ముడొప్పగన్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు
తొలగించండిపట్నపు మోజులోన బడి పల్లెల వీడి విదేశ సంస్థలన్
రిప్లయితొలగించండికొట్నము జేయుటే మిగుల గొప్పనుకొందురు చేతి వృత్తులన్
రాట్నము వీడి; తెచ్చెను స్వరాజ్యము గాంధి మహాత్ముఁ డొప్పుగన్
పట్నము కన్న మిన్న యనె పల్లెలె జాతికి బట్టు గొమ్మలౌ
కందం
రిప్లయితొలగించండిరాట్నపు బట్టలె గట్టుచు
పట్నాలాదిగ విదేశి వస్తులకు సిరుల్
కట్నము జేయకుమనె నే
రాట్నము విడి గాంధి యిదె స్వరాజ్యముఁ దెచ్చెన్?
ఉత్పలమాల
అట్నమనంగ భారతము నందరి బానిసలట్లు జూచుచున్
వట్నములందు నింపి మన భాగ్యము దోచి విదేశ వస్తువుల్
పట్నము పల్లెలన్ గొనఁగ బంచఁగఁ గొంచు స్వదేశ సంపదల్
కట్నము జేయుటెందుకని ఖద్దరు దాల్చమటంచుఁ బూన్చ నే
రాట్నము వీడి తెచ్చెను స్వరాజ్యము గాంధి మహాత్ముఁ డొప్పుగన్?