1, మే 2020, శుక్రవారం

సమస్య - 3356

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మునిఁ గని భయపడిరి పుడమిదొరలు"
(లేదా...)
"మునిఁ గని రాజులెల్లఁ దలపోసిరి కాలుఁ డటంచు భీతితోన్"

76 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  తునుముచు వైరులెల్లరిని దుంపలు త్రెంచుచు కాంగ్రెసాదులన్
  తినుచును భాజపాల కడు తీపిగ, త్రోలుచు కమ్యునిస్టులన్
  ఘనమగు బస్సు స్ట్రైకునట గండర గండుడు వోలె చీల్చు సో
  మునిఁ గని రాజులెల్లఁ దలపోసిరి కాలుఁ డటంచు భీతితోన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
   'గండరగండుని+పోలె' అన్నపుడు గసడదవాదేశం రాదు. సరళాదేశం వచ్చి "గండరగండుని బోలె" అవుతుంది.

   తొలగించండి
 2. భువిని క్షత్రియకులమును సమూలవినాశ
  న మొనరింపఁగ ద్రుఘణమును బూని
  కాల యముని వోలె కనవచ్చు పరశురా
  మునిఁ గని భయపడిరి పుడమిదొరలు

  రిప్లయితొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  పనియును పాట నొల్లకయె భాజప బంధము త్రుంపివేయగా
  తినుచును నోటమిన్ మిగుల తియ్యని ఘాసము, శత్రుపక్షమౌ
  వనముల జేరి కుట్రలను పన్నుచు, జాలము లల్లుచుండు సో
  మునిఁ గని రాజులెల్లఁ దలపోసిరి కాలుఁ డటంచు భీతితోన్

  రిప్లయితొలగించండి
 4. (ధర్మరాజు రాజసూయంకోసం జైత్రయాత్రకు వెళ్లుతున్న
  రౌద్రభీమసేనుని దర్శించిన రాజుల పరిస్థితి )
  చనిచని యన్నగారి ఘన
  శాసనదీప్తిని దిక్తతంబునం
  దనయము ప్రాకజేయుటకు
  నద్భుతభీకరదండధారియై
  గొనకొను కీర్తిసంయుతుడు
  గొబ్బున వచ్చెడి ధీరుడైన భీ
  ముని గని రాజులెల్ల దల
  పోసిరి కాలుడటంచు భీతితోన్ .
  (అనయము -నిరంతరము ;గొనకొను-అతిశయించు )

  రిప్లయితొలగించండి
 5. రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అహంబు నెంచి'? "జనపాలు రటంచు నెంచి" అని ఉండాలనుకుంటాను.

   తొలగించండి
  2. కంద వెలది అనవచ్చా ఈ పద్యాన్ని! బాలమురళి గారి ప్రతిమధ్యమావతి రాగంలా!

   తొలగించండి
 6. పనితనమేమిలేని పరిపాలన , జేసెడు రాష్ట్రమందునన్
  గునియుచు గుడ్లుబెట్టుటకు,గుట్టుగమార్చెగరాజధానినే
  వినయముగల్గు శేఖరుని ,వింతగు పుత్రుడుదొంగయైన రా
  మునిగనిరాజులెల్ల,దలపోసిరి,కాలుడటంచుభీతితోన్
  ++*+++++++++++++++++++++++++
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి


 7. రాజులనిక నడచ రాచబిడ్డలనదె
  చంపి వేయ గాను శపథము ! సుడి
  గాలి వలె తిరిగె పగ రగుల! పరశురా
  మునిఁ గని భయ పడిరి పుడమి దొరలు!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 8. అనిలపు వేగమాతడి ప్రయాణము! రాజుల చంపి వేయ బూ
  నెను శపథమ్ము! బ్రాహ్మణుడు నెమ్మిని వీడెను! తండ్రి చావుకై
  తనయుని స్తీర్వితర్పణము దావము గా రగిలెన్! పరశ్వథా
  మునిఁ గని రాజులెల్లఁ దలపోసిరి కాలుఁ డటంచు భీతితోన్!  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. ఆలు మగల మధ్య న కలహములు పెట్టు

  వాడు,దివిజ దైత్యులు గొడవ పడు చుండ

  ముదము నెప్పుడు నొందు నారద మునిగని

  భయపడిరి పుడమి దొరలు వసుధ పైన

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆటవెలది సమస్యకు తేటగీతి పూరణ... ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 10. జనకుడు పరిణయముచక్కబెట్ట,కుజ స్వ
  యంవరముకునిర్ణయించి పిలువ
  వచ్చియున్న రాజ్యబలియులందరును రా
  మునిఁ గని భయపడిరి పుడమిదొరలు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో యతి తప్పింది. 'రాజ్య బలియులు'?

   తొలగించండి
 11. దుక్ష శిక్షచేసిదురితము తొలగించు
  విష్ణునామమన్నవినుటముదము
  ఎటుల నుండి ముడులు వేయునో నారద
  మునిఁ గని భయపడిరి పుడమిదొరలు

  రిప్లయితొలగించండి
 12. మైలవరపు వారి పూరణ

  తన జనకున్ వధించిరను దారుణవార్త వినంగ క్రుద్ధుడై
  జనపతివంశనాశకరచండతరేప్సితమానసుండునై
  చన విలయాగ్నియై., ధృతనిశాతకుఠారమహోగ్రరూపు రా...
  మునిఁ గని రాజులెల్లఁ దలపోసిరి కాలుఁ డటంచు భీతితోన్!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి


  2. జనపతివంశనాశకరచండతరేప్సితమానసుండు!

   ధృతనిశాతకుఠారమహోగ్రరూపు!


   వాహ్!

   తొలగించండి
 13. కయ్య మన్నఅతనికానందమెంతయో
  చెప్పనలమి కాదు చెప్పు కొనిన
  భాష తోటి చంపువాడు ఈ నారద
  మునిఁ గని భయపడిరి పుడమిదొరలు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "చెప్పనలవి కాదు" టైపాటు. 'వాడు+ఈ' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "వాడగు నారద..." అనండి.

   తొలగించండి
 14. భరత దేశ జనుల పరదాస్య ముక్తికై
  శాంతి మార్గమొకటి సంఘటించి
  పోరు సలుపుచున్న ధీర గాంధీ మహా
  త్మునిఁ గని భయపడిరి పుడమిదొరలు

  రిప్లయితొలగించండి
 15. ఘనపరశున్ కరంబునను గాంక్షను దీర్చగ బట్టి భూమిపై
  జనపతులన్ వధించెదను, క్షత్రియనాశము చేయువాడ నా
  మనమున దుష్టిగల్గ నదె మాన్యత నాకను భార్గవాఖ్య రా
  మునిఁ గని రాజులెల్లఁ దలపోసిరి కాలుఁ డటంచు భీతితోన్

  రిప్లయితొలగించండి
 16. బనకుడు బనుప జననిని జంపినట్టి
  మనిషి , కినుక తోడన పలుమార్లు నృపుల
  పైన దండెత్తి వచ్చిన పరశురామ
  మోముని గని భయపడిరి పుడమిదొరలు

  రిప్లయితొలగించండి

 17. చం॥
  పనివడి భ్రాతకున్ తగిన భార్యల కోరుచు తా స్వయంవరం

  బునకు రాగ తత్సభన పుత్రిక జన్యుడె తెల్లబోవ భీ

  ష్మునిఁ గని రాజులెల్లఁ దలపోసిరి కాలుఁ డటంచు భీతితోన్

  అనినెది రెేగ రాజులను నందరి నోటమి జేసెనత్తఱిన్.
  రిప్లయితొలగించండి
 18. మానసమున బితరు మరణము దలచుచు
  క్రోధ మంది, చేత గొడ్డలి గొని
  క్షత్రియుల దునుమగ కదలిన పరశురా
  ముని గని భయపడిరి పుడమి దొరలు!

  రిప్లయితొలగించండి
 19. జనకుడు జమదగ్ని చావుకు కారణం
  బైన బాహుజనుల నడుచ నెంచి
  గండ్ర గొడ్డలి గొని కదలిన పరశురా
  మునిఁ గని భయపడిరి పుడమిదొరలు

  రిప్లయితొలగించండి
 20. ప్రజల దోచు కొనుచు బాధించు చుండగా
  విన్న వించు కొనిరి భీము నకును
  పీచ మడచ వచ్ఛు భీకర రూపు భీ
  ముని గని భయ పడిరి పుడమి దొరలు

  రిప్లయితొలగించండి
 21. కయ్య మన్నఅతనికానందమెంతయో
  చెప్పనలవికాదు చెప్పు కొనిన
  భాష తోటి చంపువాడగు నారద
  మునిఁ గని భయపడిరి పుడమిదొరలు

  రిప్లయితొలగించండి
 22. క్రొవ్విడి వెంకట రాజారావు:

  యుద్ధ మందు వైరి యుర్వీసులను బట్టి
  గదను మోదు చుండి కర్కశముగ
  వీక తోడ నడచు భీకరాకారు భీ
  ముని గని భయపడిరి పుడమిదొరలు

  రిప్లయితొలగించండి
 23. ఆ||వె|| జనకుడుజమదగ్నిఁజంపిరిజనపతి
  సంతతియనిపూర్వశపథమునిలఁ
  దీర్పమరలనరుగుదెంచెడిపరశురా
  "మునిఁ గని భయపడిరి పుడమిదొరలు"

  రిప్లయితొలగించండి

 24. జనకుడు కూతు పెండిలికి జక్కగ బన్నె స్వయంవరమ్మునే

  ఘనమగు రాజులందరును గార్ముక మెత్తక సిగ్గుజెంద నా

  యినకుల రాఘవుండు విలు నెత్తుచు మ్రుక్కలు జేయ నట్టి భీ

  ముని గని రాజులెల్ల దలపోసిరి కాలు డటంచు భీతితోన్

  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 25. గురువు గారికి నమస్సులు.
  వాన లెన్ని వున్న వలసల జీవిత
  మాయె,జనుల కంత ,మాట మార్చు
  పాలకలును నేటి భారత శౌర్యాది
  మునిగని భయపడిరి పుడమి దొరలు.

  రిప్లయితొలగించండి


 26. ఆ.వె
  ముచ్చటలనుచెప్పి ముడులువేయునతడు
  తీపిమాటలాడి తిప్పలెట్టు
  విష్ణుమాయచేయు విదుడైన నారద
  మునిఁ గని భయపడిరి పుడమిదొరలు.

  రిప్లయితొలగించండి
 27. జనకుడు పనుపంగ జననిని జంపిన
  మనిషి , కినుకన బలుమార్లు నృపుల
  పైన దాడిజేయవచ్చిన పరశు రా
  మునిఁ గని భయపడిరి పుడమిదొరలు

  రిప్లయితొలగించండి
 28. ఇచటి మాటలచట నచటి మాటలునిట
  కలహభోజనుడను ఖ్యాతి తోడ
  సతము తిరుగు చున్న సంచారి నారద
  ముని గని భయపడిరి పుడమి దొరలు


  తాను లేని యట్టి తరుణము నందున
  తండ్రిని వధియించి దారుణముగ
  చనిన వారినెల్ల చంపిన పరశురా
  మునిగని భయపడిరి పుడమి దొరలు

  రిప్లయితొలగించండి
 29. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఘనముగ సాగు యుద్ధమున కడ్మిని జూపుచునుండి కందుచున్
  తనకెదురొచ్చు రాజుల హతమ్మొనరించి గదాయుధమ్మునన్
  ననువుగ నూపుచున్ కసిని నాగ్రహమొంది నిపత్యమునన్ చలించు భీ
  ముని గని రాజులెల్ల దలపోసిరి కాలుడటంచు భీతితోన్.

  రిప్లయితొలగించండి
 30. శివధనస్సును విరిచె దశరధ సుతుడు
  జనకు సుతను గెలువ జంకక శివు
  కించ పరప యని వచించెడి పరశురా
  ముని గని భయపడిరి పుడమి దొరలు.


  బాపట్ల సత్యనారాయణ సాయి

  రిప్లయితొలగించండి
 31. రాజవంశమునిలరహితమగునటుల
  దీక్షపూనినట్టియాక్షితిపుడు,
  గండ్రగొడ్డలిదరిగలిగెడుపరశురా
  మునిగనిభయపడిరిపుడమిదొరలు

  రిప్లయితొలగించండి
 32. కోటి సూర్య ప్రభల కొదమ సింగము బోలి
  చూచు వార లెల్ల చోద్య పడగ
  విరువ హరుని విల్లు వేడ్కమీరగను, రా
  "మునిఁ గని భయపడిరి పుడమిదొరలు"

  రిప్లయితొలగించండి
 33. ఆ.వె//
  వింత క్రిములు బుట్టి చెంతనున్నజనుల
  కాటువేయగాను గాంచలేక !
  పాశవికము గాను ప్రాణములు గొను,య
  మునిఁ గని భయపడిరి పుడమిదొరలు !!

  రిప్లయితొలగించండి
 34. గొడ్డలిని ధరించి కోపమునకదలి
  నరపతులతలలను నరకుచుకడు
  భీకరముగ నున్న నాకారు పరశు రా
  ముని గని, భయపడిరి పుడమిదొరలు

  రిప్లయితొలగించండి
 35. అనడుహిఁ గోరినట్టి ఖలు హైహయ రాజుసుపుత్రులెల్లరుల్
  జనకుని చంపిరంచు విని క్షత్రియ జాతిని మట్టుపెట్టగన్
  కినుకను బూని పర్శువును కేలుధరించిన రేణుకాత్మజున్
  మునిఁ గని రాజులెల్లఁ దలపోసిరి కాలుఁ డటంచు భీతితోన్.

  రిప్లయితొలగించండి
 36. లంక నందురామరావణసంగ్రామ
  మునిఁ గని భయపడిరి, పుడమిదొరలు
  పారిపోయెచంపువాడగురాముని
  పట్టు దలను చూచివసుధ నుండి

  రిప్లయితొలగించండి
 37. జనపతులెల్లరందఱునుజంపగవచ్చెడుభార్గవాఖ్యురా
  మునిగనిరాజులెల్లదలపోసిరికాలుడటంచుభీతితోన్
  వినుమురరాజలోకమునువీడకచంపెనుగండ్రగొడ్డటిన్
  గనుకనెరాజులెల్లరునుగాంచిరియాతనిగాలుగాధరన్

  రిప్లయితొలగించండి
 38. ముని యని గానకన్ వరతపోధనునా జమదగ్ని జంపగా
  జనె వడి రాజ వంశముల సంక్షయమే గృత నిశ్చయంబుగా
  గనలున గన్నులారుణిమ గాంచగ రుద్రుని బోలు పర్శురా
  మునిఁ గని రాజులెల్లఁ దలపోసిరి కాలుఁ డటంచు భీతితోన్

  రిప్లయితొలగించండి
 39. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 40. ఘనమగు వాడు రేవతికి గర్భమునన్జనియించె రాముడున్
  అనిశము పర్శువున్గలిగి అమ్మను జంపెను పిత్రు వాక్యమున్
  పనిగొని గూల్చె రాజులను బాపడు దండ్రిని ద్రుంచివేయగన్
  మునిఁ గని రాజులెల్లఁ దలపోసిరి కాలుఁ డటంచు భీతితోన్

  రిప్లయితొలగించండి
 41. శరమువెన్కశరము సంధానమొనరించి
  శత్రుసైన్యములనుచిత్రగతుల
  విక్రమించిదునుమువిజయునినపర య
  మునిఁ గని భయపడిరి పుడమిదొరలు

  రిప్లయితొలగించండి
 42. ఘనమగు దోర్బలమ్మునను గాంగుడు భీకర రూపుదాల్చిభం
  డనమును చేయు చుండగ కలంకుచు పాండవ సేన పారగా
  కనుగొన పాండవుల్ వెరవుఁ గాంచక నచ్చట, మొగ్గరంపు భీ
  మునిఁ గని రాజులెల్లఁ దలపోసిరి కాలుఁ డటంచు భీతితోన్

  రిప్లయితొలగించండి
 43. భారత రణభూమిఁ బాండురాజ సుతుండు
  శత్రు భీకరుండు శమన సముఁడు
  భద్ర కుంజ రాభ రౌద్రాననుండు భీ
  మునిఁ గని భయపడిరి పుడమిదొరలు


  మనముల శాప శంకితులు మాన్య తపో నిరతుండు శంభు వ
  జ్జిన వరుఁ డత్రినందనుఁడు శిష్య సమేతము శశ్వ దాగ్ర హా
  వనిసురుఁ డంబరీషు సభఁ బాద సరోజ మిడంగ నత్తరిన్
  మునిఁ గని రాజులెల్లఁ దలపోసిరి కాలుఁ డటంచు భీతితోన్

  రిప్లయితొలగించండి
 44. శ్రీ మాత్రేనమః 

  మునిజన మానితంబగుచు భూతల నాథుడ నిన్ను కొల్వగా  
  మనసున భక్తి భావములు మమ్ముల కావుమయా శరణ్యమే  
  నిను నిరతమ్ము కొల్చెదము నీమముగా దయ జూపుమా శివా    
  ననుగని పల్కులన్ వినుము ! నవ్య యుగమ్మున బ్రోవమంచు  భీ     
  మునిగని రాజులెల్ల దలపోసిరి కాలుడటంచు భీతితోన్


  కస్తూరి శివశంకర్, ముంబయి 
  01/05/2020

  రిప్లయితొలగించండి
 45. కనుగొనికయ్యమందుననుకౌరవసేనలు పిచ్చలించుచున్
  తనపరివారమెల్లనతిదైన్యమునొందగ జేయు చుండుటన్
  తనగదచేతబూనిదురితాత్ముల ద్రుంచెదనంచు వచ్చు భీ
  మునిఁగని రాజులెల్లఁ దలపోసిరి కాలుఁ డటంచు భీతితోన్

  రిప్లయితొలగించండి
 46. ఘనతర ధైర్యశౌర్యముల కార్తవరాయని కక్షబూని దా
  ఘనమగు గండ్రగొడ్డలి ప్రఘాతములన్ దునుమాడి యావలన్
  పనిగొని క్షత్రియాన్యయము భండనసేయగ దీక్షబూను రా
  మునిగని రాజులెల్ల దలపోసిరి కాలుడటంచు భీతితో!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సాయమంది గెల్వంగ మగధను
   రాజసూయమందు తేజమలర
   కుంతి మధ్యముండు దంతి సముండు భీ
   మునిగని భయపడిరి పుడమిదొరలు!

   తొలగించండి
 47. శంకరాభరణం గ్రూప్ వారు ఇచ్చిన సమస్యకు నా పూరణలు

  *మునిగని భయపడిరి పుడమి దొరలు*

  పుడమిని సంద్రమునన్ దను
  జుడు స్వర్ణాక్షుండు దాచ జోడసురుండున్
  వడి రాన్ తమ్ముని గని భయ
  పడిరి పుడమి దొరలు బ్రతుకు భావి తలచుచున్!

  రిప్లయితొలగించండి
 48. ఆటవెలది
  కరముల తెగటార్చఁ గార్తవీర్యార్జునున్
  దాడిఁ జేసి సుతులు తండ్రిఁ ద్రుంచ
  క్షత్రియాలిఁ దునుమ సాగెడు పరశురా
  మునిఁ గని భయపడిరి పుడమిదొరలు

  చంపకమాల
  కొనెనని కామధేనువునుఁ గూల్చగ వ్రేటునఁ గార్తవీర్యునిన్
  దన పిత శీర్షమున్ గొనుచు దారుణ మెంచఁగ వారిపుత్రులున్
  దునిమెద క్షత్రియాలినన దోర్బలుడంచును పర్శుపాణి రా
  మునిఁ గని రాజులెల్లఁ దలపోసిరి కాలుఁ డటంచు భీతితోన్

  రిప్లయితొలగించండి
 49. గురువు గారూ..మొదటి పదకొండు పద్యాలను ప్రశంసించారు....నియమమా.... ప్రమాణాలేమిటి....

  రిప్లయితొలగించండి
 50. శంకరాభరణం గ్రూప్ వారు ఇచ్చిన సమస్యకు నా పూరణలు

  *మునిగని భయపడిరి పుడమి దొరలు*

  పుడమిని సంద్రమునన్ దను
  జుడు స్వర్ణాక్షుండు దాచ జోడసురుండున్
  వడి రాన్ తమ్ముని గని భయ
  పడిరి పుడమి దొరలు బ్రతుకు భావి తలచుచున్!

  గురువు గారూ...మొదటి పదకొండు పద్యాలకు ప్రశంస లిచ్చారు...నియమామా.... ఉచ్ఛ ప్రమాణాలా..,

  రిప్లయితొలగించండి
 51. చంపకమాల
  ముని గొనిరాన్ విదేహపురి మోదము నంద స్వయంవరమ్మునన్
  త్రినయను మేటి వింటిఁ గొని త్రెంౘఁగ దిక్కులు పిక్కటిల్లఁగన్
  గునియగ సీతమానసము, గుండెలు ఝల్లన శౌర్యమెంచి రా
  మునిఁ గని రాజులెల్లఁ దలపోసిరి కాలుఁ డటంచు భీతితోన్

  (కాలుఁడు = ఈశ్వరుడు)


  రిప్లయితొలగించండి
 52. దనుజుల కైవడిన్ మెలఁగు దారుణ రాజవతంసులెల్లరన్
  పని గొని యాహవంబున విపన్నులజేసి శిరంబులెల్ల తు
  త్తునియలుగా హరించునెడ దోర్బల వీరుని భార్వాఖ్య రా
  మునిఁ గని రాజులెల్లఁ దలపోసిరి కాలుఁ డటంచు భీతితోన్

  రిప్లయితొలగించండి
 53. ఆ.వె.

  భూ తగాద ద్రుంచ భూతి లక్ష్యమనుచు
  వ్యాప్తి చెందె తీవ్ర వాద మెల్ల
  నక్స లైటు పేర కక్ష సాధనాధ
  ముని గని భయపడిరి పుడమి దొరలు

  సాధన+అధముని= సాధనాధ ముని అని రాశాను.

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి