4, మే 2020, సోమవారం

సమస్య - 3359

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నత్తను బెండ్లాడవచ్చునా యని రెల్లన్"
(లేదా...)
"నత్తను బెండ్లియాడఁ దగునా యని నవ్విరి బంధులెల్లరున్"

103 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  చిత్తుగ నుండ కన్నియలు చేరువ నుండెడి ముత్తుకూరునన్
  క్రొత్తది పద్ధతిన్ గనుచు కూరిమి మీరగ నాత్మకూరునన్
  బొత్తిగ సిగ్గు వీడుచును పొంకము నందున ముద్దులయ్య మే
  నత్తను బెండ్లియాడఁ దగునా యని నవ్విరి బంధులెల్లరున్

  రిప్లయితొలగించండి
 2. అందరికీ నమస్సులు 🙏

  నా ప్రయత్నం ..

  *కం||*

  కొత్తగ వచ్చిన మరదలు
  మెత్తటి మనసును కనుగొన మెరుగౌ రీతిన్
  చెత్తగ యడిగెను గద మే
  *నత్తను, బెండ్లాడవచ్చునా? యని, రెల్లన్"*!!

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏😊🙏😊🙏

  రిప్లయితొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  Animal Farm Gossip:

  నెత్తిని కన్నులున్నవని నేరుపు మీరగ చూచుటందునన్
  బొత్తిగ కర్చు పెట్టకయె పుట్టుక తోడను కొంప వచ్చెనన్
  నెత్తురు త్రాగు రక్తపయె నీమము వీడుచు గ్రుడ్డి ప్రేమలో
  నత్తను బెండ్లియాడఁ దగునా యని నవ్విరి బంధులెల్లరున్

  రిప్లయితొలగించండి
 4. కం//
  నత్తకు సరిజోడగు బల్
  నత్తను బెండ్లాడ వచ్చు, నాయని రెల్లన్ !
  కత్తుల రంగని తీర్పును
  ఉత్తమ మైనద నిబొగిడె నుర్విడి రెల్లన్ !!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నా యనిరి' అన్నదానికి అన్వయం? 'నుర్విడి రెల్లన్'?

   తొలగించండి
 5. కం//
  పొత్తము జూచుచు పంతులు
  పొత్తులు బెండ్లికి సరియగు పొందిక దెలుపన్ !
  ఒత్తగు మామకు తన మే
  నత్తను బెండ్లాడ వచ్చునా యనిరెల్లన్ !!

  రిప్లయితొలగించండి
 6. కం//
  చిత్తము సరికాదని మే
  నత్తను బెండ్లాడ వచ్చునా ? యనిరెల్లన్ !
  ఉత్తమమగు నీతిదెలుప
  మత్తును నొదలుచు తనదగు మమతను వీడెన్ !!

  రిప్లయితొలగించండి
 7. మొత్తుకొనంగపెద్దలలమొద్దగుమోహనుఁబెండ్లిజాగుకై
  యత్తరిబాధతోవెడలినంతయుజోసికిచెప్పెమూఢతన్
  విత్తముకైవచించెగతిఁబెండ్లికి,యవ్విధిముందు వింతయై(గా)
  "నత్తను బెండ్లియాడఁ ,దగునా యని నవ్విరి బంధులెల్లరున్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉత్తమురాలగు చెల్లికి
   బొత్తిగవ్యసనాలతిరుగుపుత్రుడు నీడౌ
   నత్తలపుఁజెప్ప విని మే
   "నత్తను బెండ్లాడవచ్చునా యని రెల్లన్

   తొలగించండి
  2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. కం//
  ఉత్తమ ప్రేయసి దొరకక
  బొత్తిగ కూడే దినకను బోరున నేడ్వన్ !
  తత్తర పాటునుగని మే
  నత్తను బెండ్లాడ వచ్చునా యనిరెల్లన్ !!

  రిప్లయితొలగించండి
 9. ఉత్తముడగు నా పంతులు
  కొత్తగ శ్రీకృష్ణుని కథ గూర్చిన వేళన్
  తత్తరపడి బాలురు మే
  నత్తను బెండ్లాడవచ్చునా యని రెల్లన్

  రిప్లయితొలగించండి
 10. ఉత్తమురాలగు చెల్లికి
  బొత్తిగవ్యసనాలతిరుగుపుత్రుడు నీడౌ
  నత్తలపుఁజెప్ప విని మే
  "నత్తను బెండ్లాడవచ్చునా యని రెల్లన్

  రిప్లయితొలగించండి


 11. ఎత్తెంతయెదిగనను మే
  నత్తను బెండ్లాడవచ్చునా యని రెల్లన్
  విత్తుల వారి కుమారుం
  డత్తరి బెండ్లాడ గా బడాయి పిలుపులన్


  జిలేబి

  రిప్లయితొలగించండి


 12. కొత్తగ సంబంధమమర
  బత్తుల వారి కొమరునకు, ప్రశ్నయు రాగా
  నత్తరి పిలిచిరిగా మే
  నత్తను, బెండ్లాడవచ్చునా యని రెల్లన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 13. కొత్తగ వచ్చె బంధమని కూచపు వారికొమార్తె చేరగా
  బత్తుల వారి బంధములు ప్రశ్నయె లేపును! భార్యభర్తలం
  దత్తరి ఘాడమైన పరిదానములాయె కుటుంబ మందు! మే
  నత్తను బెండ్లియాడఁ దగునా యని నవ్విరి బంధులెల్లరున్!



  జిలేబి

  రిప్లయితొలగించండి
 14. జిత్తులమారి పాతకుడు స్నేహితులన్ దన బాంధవాళినిన్
  మొత్తము లోకమంతటిని మోసము చేయగ బూనునట్టి వా
  డుత్త యసత్యవాది ఖలు డొక్కడు చూడ నఘంబె వాని మే
  నత్తను బెండ్లియాడఁ దగునా యని నవ్విరి బంధులెల్లరున్"

  (మేను+ఆ+తను)

  చిత్తయిపోయె మానసము చేవయణంగెను కాళ్ళు చేతులం
  దిత్తరి శక్తి చచ్చినది యించుక యైనను మాటలే దికన్
  మొత్తము రుగ్మతాస్థితిని మున్గెను చూడగ రండు వాని మే
  నత్తను బెండ్లియాడఁ దగునా యని నవ్విరి బంధులెల్లరున్"

  (మేను+ఆ+తను)

  రిప్లయితొలగించండి
 15. యేకాలమ్మును నొక్కరీతి నగునా?, యిక్కట్లు బోవో?, తగన్
  నీ కామ్యార్థము నొందవో?, తగునె యీ నిర్వేదముల్, ముందునన్
  సాకల్యమ్ముగ పంట పండదొ?, ధృతిస్రస్తాధివైకల్యతా
  పైకంబున్ గొని కర్షకుండు ఖలుఁడై భ్రష్టత్వముం బొందులే.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి


 16. ఇత్తరి సనాతనము విడి
  నత్తరి వేరు మతములె మనకు మేలనుచున్
  చిత్తపుటనుచరితముగ న
  నత్తను బెండ్లాడవచ్చునా యని రెల్లన్!

  అనత్త - అనాత్మ ఆంధ్రభారతి ఉవాచ



  జిలేబి

  రిప్లయితొలగించండి
 17. మైలవరపు వారి పూరణ

  చిత్తము పెండ్లి మాటను రుచించుటలేదని చెప్పి చెప్పి., యు...
  వ్వెత్తున పొంగు యౌవనమునిట్టుల బూడిదపాలొనర్చుచో
  నత్తరి పెండ్లికూతురిక అందునె ? ఆనక చూచి చూచి మే...
  నత్తను బెండ్లియాడఁ దగునా యని నవ్విరి బంధులెల్లరున్"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 18. అత్తమ్మచిన్నకూతురు
  ముత్తెములామెరిసిపోవుముద్దులగుమ్మే
  బొత్తిగ పనిపాటులలో
  నత్తను బెండ్లాడవచ్చునా యని రెల్లన్

  రిప్లయితొలగించండి
 19. ఉత్తమ వంశమందుజని యోగ్యుని భార్యయి సేవలందు యా
  క్రొత్తని జంటనీడ్చెవిధి గోర్కెలు దీర్చెడు వేశ్యగానయెన్
  ఉత్తమ పూరుషుండొకడు నూర్మిళ బెండ్లికి సిధ్ధమౌగ యా
  నత్తను బెండ్లియాడఁ దగునా యని నవ్విరి బంధులెల్లరున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'భార్య+అయి' అన్నపుడు సంధి లేదు. "సేవలందు నా.. క్రొత్తది...సిద్ధమైన నా..." అనండి.

   తొలగించండి
 20. బొత్తిగ సంపద లేకయు
  ఉత్తమ రాలగుతనకునుసోదరిదోస్తిన్
  విత్తముచేకురునని భా
  నత్తను బెండ్లాడవచ్చునా యని రెల్లన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో యతి తప్పింది. 'దోస్తిన్' అన్యదేశ్యం.

   తొలగించండి
 21. చిత్తమునందుహత్తుకొనె చిత్తరువట్టుల మేనిసొంపు మే
  నత్తకుమార్తె రూపమున నాయమ రంభకుసాటి కాని తా
  బొత్తిగ చేయుకార్యముల పోలికచేయుచు వెక్కిరింతగా
  నత్తను, బెండ్లియాడఁ దగునా యని నవ్విరి బంధులెల్లరున్

  రిప్లయితొలగించండి
 22. అత్తయని తెలిసి రాధను
  మొత్తముగా స్వీకరించి మోదము నందన్
  చిత్తము శంకింపద మే
  నత్తను బెండ్లాడవచ్చునా యని రెల్లన్

  రిప్లయితొలగించండి
 23. మత్తున తూగెడి నిట్టి జ
  గత్తున స్త్రీ పురుష మంచు గానుచు రాధా!
  సత్తమె శ్రీకృష్ణుడు మే
  నత్తను బెండ్లాడవచ్చునా యని రెల్లన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మీ ఫోన్ నెం. తెలియజేయండి.

   తొలగించండి
 24. నత్తిగ మాటల నాడును
  పెత్తనమును చేయనెంచు పెడసరి మదితో
  మత్తుగ తినునా పనిలో
  నత్తను, బెండ్లాడ వచ్చునా యని రెల్లన్

  రిప్లయితొలగించండి
 25. నత్తిగ మాటలాడు నయనమ్ములు మెల్లలు ముక్కునడ్డి సం
  పత్తియె మెండు కోతివలె వాహ్ యికిలుంచును గూనియుండు నా
  ముత్తని మేనయత్తకట! పొందుచు కట్నము సత్తి *వాని మే*
  *నత్తను బెండ్లియాడ!దగునా యని నవ్విరి బంధులెల్లరున్*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 26. రత్తిని పెండ్లాడె నతను
  యత్త వరుసని దెలియంగ యామె విడిగ,యా
  క్రొత్తటి జంటను గని మే
  నత్తను పెండ్లాడవచ్చునా యని రెల్లన్.

  రిప్లయితొలగించండి
 27. అందరికీ నమస్సులు🙏

  కొత్తగ కలసిన చుట్టము

  పత్తి కుసుమ మంటి పిల్ల వరుసకి యత్తౌ,

  కొత్తగ వరుసలు మార్చగ

  *నత్తను పెండ్లాడ వచ్చునా?యని రెల్లన్*

  వాణిశ్రీ నైనాల, హైదరాబాద్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "పత్తి పువును బోలు పిల్ల వరుసకు నత్తౌ" అనండి. నిజనికి 'అత్త+ఔ' అన్నపుడు సంధి లేదు.

   తొలగించండి
 28. చిత్తము మెచ్చగ యువకుడు
  బొత్తిగ చిన్నది వయసున పొందగ నెంచెన్
  కొత్తగ తోచగ నడిగిరి
  నత్తను, బెండ్లాడవచ్చునా యని రెల్లన్

  రిప్లయితొలగించండి
 29. * శంకరాభరణం వేదిక *
  04/05/2020 సోమవారం

  సమస్య
  ********

  నత్తను బెండ్లియాడఁ దగునా యని నవ్విరి బంధులెల్లరున్

  నా పూరణ.
  **** **** **

  ఉత్తమ భావ మెంచడొక డోరిమిచే పని జేయడున్ ; సదా

  మత్తుగ దూగు ద్రాగుచును;మంచి నొనర్చడు;మూర్ఖ చిత్తుడున్;

  మొత్తము భార్య లిర్వురును;మూడవ పెండ్లి గ్రహించ నెంచగా...

  నత్తను బెండ్లియాడ దగునా యని నవ్విరి బంధులెల్లరున్

  ( గ్రహించనెంచగాన్ + ఆ + తను )

  -- ఆకుల శాంతి భూషణ్
  వనపర్తి

  రిప్లయితొలగించండి
 30. అత్తరుసాయిబు నూఢికి
  యత్తిలిలోనుండునతనియత్తనునడుగన్
  నత్తఱిబంధువులనెమే
  నత్తనుబెండ్లాడవచ్చునాయనిరెల్లన్

  రిప్లయితొలగించండి
 31. విత్తము కొరకున పెండిలి!
  యుత్తమ కన్యని దలవకు,యుతుకు గడుసునన్
  బెత్తముతో ప్రతిరోజు త
  నత్తను,పెండ్లాడవచ్చునా యనిరెల్లన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "కొరకై పెండిలి ... కన్యను దలపకు ముతుకు గడుసుగా" అనండి.

   తొలగించండి
 32. పుత్తడి బొమ్మవోలె కడు మోహన రూపముఁ గల్గినట్టి యో
  షిత్తును గాంచుచున్ బరవశించితి వంచును చెప్పిరే, మదో
  న్మత్తుడవైన దోషమగునా సతి నాకును చెల్లెలౌను మే
  నత్తను బెండ్లియాడఁ దగునా యని నవ్విరి బంధులెల్లరున్.

  రిప్లయితొలగించండి
 33. మత్తు తలకెక్కెనా? గ
  మ్మత్తుగ మాటాడితివిట మామా! నీవా
  పుత్తడి బొమ్మను నీ మే
  నత్తను బెండ్లాడ వచ్చునా యని రెల్లన్.

  రిప్లయితొలగించండి
 34. అత్తిలిరామదాసుతనయత్తనుబెండిలియాడబోవమే
  నత్తనుబెండ్లియాడదగునాయనినవ్విరిబంధురెల్లరున్
  విత్తముగూడబెట్టుటకుపెద్దలుసైతమునిచ్చగించగా
  నత్తఱిచింతజేయవలెనట్లుగబెండ్లినిజేయవచ్చునా?

  రిప్లయితొలగించండి
 35. చిత్తములు రెండు కలియగ
  రత్తయ్యకు భాను మనువు రయమున కుదరన్
  అత్తెరి! వయసుడిగిన భా
  నత్తను బెండ్లాడ వచ్చునా యనిరెల్లన్!

  రిప్లయితొలగించండి
 36. విత్త మిది మేనమామకు
  దత్తఱ లేక సతియైన దర్మం బనఁగా
  నిత్తోయజాక్షినిన్ మే
  నత్తను బెండ్లాడవచ్చునా యని రెల్లన్


  యెత్తిన చేయి దించకయు నెప్పుడు మ్రింగుచు నుండు స్థూల కా
  యాత్త రుజా ధనుండు నకటా తలపం గుసు మాభ తన్వియే
  యిత్తరుణీ మతల్లి తరలేక్షణ యిత్తరి క్షుత్పిపాసిఁ దా
  నత్తను బెండ్లియాడఁ దగునా యని నవ్విరి బంధులెల్లరున్

  [అత్త = తినువాఁడు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
   వృత్తాన్ని యడాగమంతో ప్రారంభించారు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
   అవునండి. గమనించలేదు. రెండవ పాదమును మొదటికి మార్చఁగ నిలిచిన దోష మండి యది.

   తొలగించండి
 37. రాధను కృషునికి అత్తగా చెపుతారు. శాపము కారణాన వారు పెండ్లి చేసు కోలేక ప్రేమికులు గానే వుంటారు. ఇదీ సందర్భము

  ఉ:
  సత్తెము వింటివా యనుచు సన్నగ నొక్కిరి రాధ మాధవున్
  వృత్తము కూడి యుండుటను పెండిలి లేకయె శాపగ్రస్తమై
  చిత్తము చిక్కబట్టి విను చెప్పిన మాటలు వాదులేలకో
  నత్తను బెండ్లియాడ దగునా యని నవ్విరి బంధు లెల్లరున్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉ:
   తత్తరపాటు లేక తన తార్కిక మాటల వల్లెవేయుచున్
   సత్తెము గాదె కోడలిని చక్కగ చేగొన మేనమామలున్
   బిత్తరమేల నత్తగొన ప్రేమను దెల్పగ నుత్తరోత్తరా
   నత్తను బెండ్లియాడ దగునా యని నవ్విరి బంధు లెల్లరున్

   బిత్తరము=వణుకు

   వై. చంద్రశేఖర్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 38. ఉత్తమమామయు మామే
  నత్తను బెండ్లాడ, వచ్చునాయని రెల్లన్
  కొత్తగు జంటనుచూడగ
  కొత్తగ వచ్చిన కరోనకోర్కెను తీర్చున్?

  రిప్లయితొలగించండి
 39. మిత్రులందఱకు నమస్సులు!

  [తనను పెంచిన తండ్రియగు నందుని చెల్లెలు, వరుసకు తనకు మేనత్తయైన రాధను "పెండ్లియాడెద" నను శ్రీకృష్ణునితో బంధువులు ముచ్చటించు సందర్భము]

  "ముత్తెపుఁజిప్పలోని స్మిత ముత్యము రాధయ! యిట్టి యీమె నీ
  విత్తఱిఁ, గృష్ణ! ప్రేమఁ గనుపింపఁగఁ బిల్తువె పెండ్లియాడఁగాఁ!
  జిత్తము నాక్రమించెనని, శీఘ్రమె రాధను, నౌర! నీదు మే
  నత్తను, బెండ్లియాడఁ దగునా?" యని నవ్విరి బంధులెల్లరున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   'సిత ముత్యము' దుష్టసమాసం. "తెలి ముత్తెము రాధయ" అందామా?

   తొలగించండి
  2. ధన్యవాదాలండీ శంకరయ్యగారూ! ముందుగా తెలిముత్యము అనే టైపుచేశాను. తరువాత స్మితమౌక్తిక మందామని స్మిత టైపుచేసి, మౌ యతిభంగమవునని ముత్యమే ఉంచినాను. స్మిత తొలగించకుండానే పంపినాను మళ్ళీ పరిశీలించకుండానే. తెలిపినందులకు ధన్యవాదాలండీ!

   సవరించిన పూరణము:

   "ముత్తెపుఁజిప్పలోని తెలి ముత్తెము రాధయ! యిట్టి యీమె నీ
   విత్తఱిఁ, గృష్ణ! ప్రేమఁ గనుపింపఁగఁ బిల్తువె పెండ్లియాడఁగాఁ!
   జిత్తము నాక్రమించెనని, శీఘ్రమె రాధను, నౌర! నీదు మే
   నత్తను, బెండ్లియాడఁ దగునా?" యని నవ్విరి బంధులెల్లరున్!

   తొలగించండి
 40. క్రింద పేర్కొన్న వారు తమ ఫోన్ నెం.లు తెలియజేయగలరు
  కరణం రాజేశ్వర రావు
  కె. ఈశ్వరప్ప
  గుమ్మా నాగమంజరి
  యజ్ఞేశ్
  సొలస సీతారామయ్య

  రిప్లయితొలగించండి
 41. చిత్తము వఛ్చిన రీతిగ
  చెత్తగ కథ చెప్పగ విని చెల్లని దయ్యు న్
  కొత్తగ నున్నది గా యే
  నత్తను బెండ్లాడ వచ్ఛు నా యని రెల్ల న్

  రిప్లయితొలగించండి
 42. కందం
  మెత్తనిది మేనకోడలు
  నుత్తమురాలన్న సుతునకొప్పవె? నేడీ
  కొత్తది మఠమంపెనె ని
  న్నత్తను, బెండ్లాడవచ్చునా యని రెల్లన్!

  ఉత్పలమాల
  ఉత్తమురాలుఁ బెద్దలన నోర్పున జూచెడు మేనకోడలిన్
  పెత్తనముండి కూడ కనవే సుతు నాలిగ, నేకు మేకునై
  జిత్తులమారిఁ గోడలిగఁ జిక్కితె యాశ్రమవాసమంపె ని
  న్నత్తను, బెండ్లియాడఁ దగునా యని నవ్విరి బంధులెల్లరున్!

  రిప్లయితొలగించండి
 43. ధన్యవాదములు. నమస్కారములు. సరిజేసుకుంటాను.

  రిప్లయితొలగించండి
 44. గిత్తను బోలుదేహమును గిచ్చుచు నుండును క్రోధనమ్ముతో
  నత్తిగ మాటలాడుచును నాట్యము చేయును కోతి పోలికన్
  మత్తుగ గ్రోలు భోజనము మారు టసాధ్యము, తృప్తి నుంచమే
  నత్తను, బెండ్లియాడఁ దగునా యని నవ్విరి బంధులెల్లరున్

  రిప్లయితొలగించండి
 45. అత్తకొడుకు తగుబెండ్లికి
  నుత్తముడగు మేనమామ నొప్పుగగూర్చన్
  చిత్తమునకు నచ్చగ మే
  నత్తను బెండ్లాడ వచ్చునా యనిరెల్లన్

  అత్తకుమారుడే దగును హక్కుగ బెండ్లికి మేనబావగా
  నుత్తమమైనదౌ వరుస యోచన జేయగ మేనమామతో
  చిత్తము గోరెనంచును విచింతనలేకయె ప్రేమపేరుతో
  నత్తను బెండ్లియాడ దగునాయని నవ్విరి బందులెల్లరున్

  రిప్లయితొలగించండి
 46. (విదేశము నుండి వచ్చిన కుర్రవాడికి వరుస దెలియక...)
  విత్తము నాశ లేక మన వేదవిధానములందు గూరిమిన్
  పెత్తనమున్ విదేశమును వీడిటు వచ్చితి వైన నిట్టులన్
  చిత్తరువందు జూచి మనసిచ్చితి నీమెకు నందువేమి మే
  నత్తను బెండ్లియాడఁ దగునా యని నవ్విరి బంధులెల్లరున్

  రిప్లయితొలగించండి
 47. సరిజేసితిని గురూజీ 🙏
  కం//
  చిత్తము సరికాదని మే
  నత్తను బెండ్లాడ వచ్చునా ? యనిరెల్లన్ !
  ఉత్తమమగు నీతిదెలుప
  మత్తును వదలుచు తనదగు మమతను వీడెన్ !

  రిప్లయితొలగించండి
 48. గురువు గారికి నమస్సులు.
  ఉత్తమముకాదుసరి,మే
  నత్తనుబెండ్లాడవచ్చునాయనిరెల్లరున్.
  చిత్తమునసదాశివుడే
  మెత్తని పలుకులుపలుకగబేర్మియుపెరగన్.

  రిప్లయితొలగించండి
 49. నమస్సులతో ఈనాటి పూరణాయత్నం ఎత్తరి చూసిన మెల్లగ
  ఎత్తెత్తి నడుచు వనితను ఎదమెచ్చుచు దా
  నిత్తరె పెండ్లాడుతనన
  నత్తను బెండ్లాడ వచ్చునా యని రెల్లరున్.
  వొజ్జల శరత్ బాబు

  రిప్లయితొలగించండి
 50. వత్తిడి జేయగ కలలో
  సత్తువలేకున్న నొకడు సంబరములతో
  కత్తికి తాళినిగట్టగ
  నత్తను బెండ్లాడవచ్చునాయనిరెల్లరున్!
  శ్రీ. కెఈశ్వరప్ప. ఆలూరు కర్నూలు జిల్లా
  విశ్రాంత ఆరోగ్యవిస్తరణాధికారి. 9885336485

  రిప్లయితొలగించండి