5, మే 2020, మంగళవారం

సమస్య - 3360

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు"
(లేదా...)
"హలమును దాల్చినట్టి నిటలాక్షుఁడె దిక్కగు నెల్లవారికిన్"

106 కామెంట్‌లు:

  1. ఎల్లలను లెక్క సేయక నీ కొరోన
    పెనువిపత్తు జగతిపయి విరుచుకు పడెఁ
    గావగ లయకరుండు కృకమున హాల
    హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీకృష్ణుడు అర్జునునితో:

      పల్గుణా! మసలవలెఁ గపట యతివని
      నీ రహస్యమెవ్వరు గమనించకుండ!
      బయలు పడి నిన్నుదండించ భద్రబలుడు
      హలముఁ దాల్చిన, శివుఁడె దిక్కగును మనకు!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

  2. నడిరేయి సరదా పూరణ:

    పలుకుచు మంచి మాటలను బంగరు రాష్ట్రపు రాజధానిన్
    వలపులు మీర సేద్యమును వాసిగ జేయుచు నెర్రవల్లినిన్
    పొలమును సాగుచేయుటకు ప్రొద్దున రాతిరి ఫార్ముహౌసునన్
    హలమును దాల్చినట్టి నిటలాక్షుఁడె దిక్కగు నెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
  3. (కరాళకాలకూటవిషధరుడైన హరుడు )
    చలమున దేవదానవులు
    చయ్యన సంద్రము ద్రచ్చుచుండగన్;
    మలమలమాడ్చు వేడిమిని
    మారణధూపపుచిచ్చు రేగగా;
    విలవిలలాడ నందరును
    వేగమె యుద్భవమందు నా హలా
    హలమును దాల్చినట్టి నిట
    లాక్షుడె దిక్కగు నెల్లవారికిన్ .

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    త్రిశూలమును ప్రక్కను పెట్టి:

    నిలుపగ బాలు డత్తఱిని నెత్తిని కోయగ కోపమందునన్
    కలవర మొంద భామినియె కష్టము నెంచక చిత్రరీతినిన్
    తలలను మార్చుటందునను ధన్యుడు కాగను; నీయుగమ్మునన్
    హలమును దాల్చినట్టి నిటలాక్షుఁడె దిక్కగు నెల్లవారికిన్

    రిప్లయితొలగించండి


  5. ఇదె కరోనా సమయమున నిదె జిలేబి
    ప్రార్థనల చేయవలయు నరయ కపాలి
    గరళ కంఠుడు ఖట్వాంగి ఖరువగు హల
    హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు



    శివోహం
    జిలేబి

    రిప్లయితొలగించండి

  6. చెలగుచు నీ కరోన క్రిమి శీఘ్రముగా భువి నాక్రమించి మ

    ర్థ్యులను నమానుషమ్ముగను ద్రుంచుచు మారణకాండ సల్పగన్

    గొలుచుచు పాహి పాహి యని కొల్లగ వేడిరి శంభునిన్ ; హలా

    హలమును దాల్చినట్టి నిటలాక్షుఁడె దిక్కగు నెల్లవారికిన్"



    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'మర్త్యులను' టైపాటు.

      తొలగించండి
  7. తే.గీ//
    పాలసంద్రము జిలుకగా ప్రాబృతముగ
    అంకురించె నమృతభాండ అంశలోన !
    బుట్టి నప్పుడే బుట్టగా నట్టి హాల
    హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రాబృతము' అన్న పదం లేనట్టున్నది. "ప్రాకటముగ నంకురించెను నమృతభాండాంశలోన" అనండి.

      తొలగించండి
  8. తే.గీ//
    సేద్యమందున రైతుకి సేవజేయ
    పరమశివుడేగె తనయొక్క పథముదాటి
    జీవనాడుల దూరెను భావగమ్య
    హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు !!

    రిప్లయితొలగించండి

  9. ఇచ్చిన పాదమెక్కడ :)


    భగభగ కర్తరి! మండె
    న్సెగ! "హలమును దాల్చినట్టి నిటలా క్షుఁడె ది
    క్కగు నెల్లవారికిన్" సరి
    యగు వేళయిదే జిలేబియా వేడుకొనన్



    హల - నీళ్ళు - గంగను దాల్చినట్టి


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. తేగీ//
    కర్షకుని గర్భదారిద్ర్య వర్షమందు
    వరుణదేవుడు దిగిరాక పయనమవగ !
    గంగ , గౌరి, దేవేరుల భంగపరచె
    హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అవగ' అనడం సాధువు కాదు. "పయనమైన" అనండి.

      తొలగించండి
  11. చిలుకు చుండగ నగమును‌ జలధి లోన

    పుట్డె విషము భీకరముగ,పట్టి హాల

    హలమును దాల్చిన శివుడె దిక్కగును మనకు

    త్రిపుర సంహారమునకని‌ దివిజులనెను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "హలము దాల్చిన... దివిజు లనిరి" అనండి.

      తొలగించండి
  12. లోకమంతటను కరోన రోగకృమిని
    పూర్తిరీతి నిర్మూలనము సలుపంగ
    లోక రక్షణకయి గొంతులోపల హల
    హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ ఫోన్ నెం. తెలియజేయండి.

      తొలగించండి
  13. మైలవరపు వారి పూరణ

    ఇల జనియించెనొక్క క్రిమి యెట్టులొ! చుట్టెను విశ్వమెల్ల! మం..
    దులకిది లొంగకుండె! కడు తొందర విస్తృతినందుచుండె!మా
    వలననశక్యమయ్యెను శివా! యని ప్రార్థనజేయుడా హలా..
    హలమును దాల్చినట్టి నిటలాక్షుఁడె దిక్కగు నెల్లవారికిన్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి

  14. వింత కీటక మొక్కటి విశ్వమందు
    వ్యాప్తి చెంద దాని నణచు వారెవరనా
    సురల బాధలు దీర్చిన శూలి హాల
    హలము దాల్చిన శివుడె దిక్కగును మనకు.

    రిప్లయితొలగించండి


  15. ఇలను సహాయమై జనుల కెంతయొ లాభము కూడగానికన్
    తొలకరి జల్లు రావలె ప్రదోషము లెల్ల జిలేబి‌పోవలెన్
    కొలువగ రమ్మ కర్తరి ప్రకోపము చల్లగ తగ్గి బోవ హా
    హలమును దా ల్చినట్టి నిటలాక్షుఁడె దిక్కగు నెల్లవారి కిన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. బలములుగల్గునాయకులు, భారతమందున దొడ్డనేతలై
    కులములనెగ్గదోయుచును ,కూలగదోసిరిశాంతిసౌఖ్యముల్
    సులభముగానెగాదునిక ,శూన్యముజేయగనంతనాహలా
    హలమునుదాల్చినట్టి ,నిటలాక్షుడెదిక్కగునెల్లవారికిన్
    ***************££+++++€€€€
    రావెలపురుషోత్తమరావు







    రిప్లయితొలగించండి
  17. దేవదానవులు సలుప దివ్య రీతి
    క్షీర సాగర మథనాన క్ష్వేళ ముద్భ
    వింప, నీవెదిక్కంచును వేడ, వెన్న
    ముద్ద వోలె మ్రింగి జగము బ్రోవ హాల
    హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు

    రిప్లయితొలగించండి
  18. విశ్వమునకరోనవరలిపెరుగుచుండ
    మందులేనిమహమ్మారిమరణమయ్యె
    శోకమునుదీర్పగనిలను,శూలమనెడి
    "హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విశ్వమునకరోనవరలిపెరుగుచుండ
      మందులేనిమహమ్మారిమరణమయ్యె
      శుభముమోసులెత్తగమరిశూలమనెడి
      "హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు

      తొలగించండి
  19. కడలిని మధించ బుట్టిన గరళము గని
    వెఱచి సురతతి రక్షింప వేడిన తరి
    లోకముల గాచుట కొఱకు భీకర హాల
    హలమును దాల్చిన శివుడె దిక్కగును మనకు

    రిప్లయితొలగించండి
  20. సంద్ర మథనము నాడు విషము కలుగగ
    గాచె శివుడు లోకముల గ్రహించి దాని
    విరుచుపడు కరోనా మన్ని వీడ, హాల
    హలము దాల్చిన శివుడె దిక్కగును మనకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో యతి తప్పింది. 'విరుచుపడు, మన్ని' అన్నవి సాధుప్రయోగాలు కావు.

      తొలగించండి
  21. పొలమున శ్రామికుడె శివుడు 
    గళమున ముద్ద పడవలయు కరమున ననగా 
    వలయును తప్పదు వేడక 
    హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు

    రిప్లయితొలగించండి
  22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  23. సరిజేసితిని గురూజీ 🙏
    తే.గీ//
    పాలసంద్రము జిలుకగా ప్రాకటముగ
    నంకురించెను నమృతభాండాంశలోన !
    బుట్టి నప్పుడే బుట్టగా నట్టి హాల
    హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు !!

    రిప్లయితొలగించండి
  24. సరిజేసితిని గురూజీ 🙏
    తే.గీ//
    సేద్యమందున రైతుకు సేవజేయ
    పరమశివుడేగె తనయొక్క పథముదాటి
    జీవనాడుల దూరెను భావగమ్య
    హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు !!

    రిప్లయితొలగించండి
  25. సరిజేసితిని గురూజీ 🙏
    తే.గీ//
    కర్షకుని గర్భదారిద్ర్య వర్షమందు
    వరుణదేవుడు దిగిరాక పయనమైన !
    గంగ , గౌరి, దేవేరుల భంగపరచె
    హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు !!

    రిప్లయితొలగించండి
  26. సలిలముద్రచ్చ బుట్టిన విషంబును మ్రింగగ లోకరక్షకై
    మలినములన్ విదుర్చు సురమాలిని మౌళినిదాల్చ ధీరుడై
    కలియుగ జీవకోటికి త్రికాలము నాకలిదీర్చు రైతుగన్
    హలమును బట్టినట్టి నిటలాక్షుడు దిక్కగు నెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
  27. గళమున క్ష్వేళమున్ తలను గంగయు నర్థ శరీరమందు మా
    చలిమలపట్టి ఫాలమున జ్వాలలు చిందెడు జ్ఞాననేత్రమున్
    నిలువున భస్మధారియయి నిచ్చలు భక్తుల గాచునట్టి *దో*
    *హలమును దాల్చినట్టి నిటలాక్షుడు దిక్కగు నెల్లవారికిన్*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  28. జలధిని సురాసురులు త్రచ్చు సమయమందు
    కాలకూటము జనియించి కలత పెట్ట
    లోకముల బాధ కనుగొని వీకతో హ
    హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హహలము' అంటే విషమే. కాని ఇక్కడ "వీకను హల।హలము.." అంటే బాగుంటుంది.

      తొలగించండి
  29. ఎందఱున్ననుదేవతలిపుడుహాల
    హలముదాల్చినశివుడెదిక్కగునుమనకు
    సర్వులకుశుభములనీయుశక్తియుతుడు
    శంకరుడొకడెపుడమినిభక్తిగొలువ

    రిప్లయితొలగించండి
  30. కలఁతలఁ బెట్టుచుండెఁ బ్రజఁ గర్కశమైన కరోన భూతమై
    హలమునుబట్టు రైతులు సహాయము కోరుచు నుండ్రి దీనులై
    మలయుట కష్టమయ్యె కట! మానవ జాతికి, నేడికన్ హలా
    హలమును దాల్చినట్టి నిటలాక్షుఁడె దిక్కగు నెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
  31. తేటగీతి
    నిలిచి మద్యంపువానలుఁ దొలకరించ
    జనుల నాత్రమ్ము మరణాలఁ గనఁగఁ జేసె
    నిన్ని సంక్షోభములదాటుటెట్లు? హాల
    హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు!

    చంపకమాల
    నిలుపఁగ మద్యపానము ననేకుల మానసికంపు రుగ్మతల్
    చెలఁగుచు, బొక్కసమ్మునకుఁ జేతనఁ గూర్తుమటంచు వేడినన్
    దొలకరి జేసినంతఁ బ్రజ దూకుడు మృత్యువుఁ జూడఁగన్ హలా
    హలమును దాల్చినట్టి నిటలాక్షుఁడె దిక్కగు నెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
  32. విలువలు లేని నాయకులు వేనకు వేలుగ పుట్టుకొచ్చిరే,
    పలుకుచు జాతి క్షేమమని పంచగ మద్యము దండిగానిటన్
    శలభములౌచు గూలెడి ప్రజాళిని గాచునదెవ్వరో, హలా
    హలమును దాల్చినట్టి నిటలాక్షుఁడె దిక్కగు నెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
  33. అకట! కడగండ్లఁ బాలయ్యె సకలజనులు
    నిలిచెజనజీవనమునేడు విలయమగుచు
    యన్నదాతయెశివునిగాహలముదాల్చ
    హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...పాలైరి సకలజనులు... మగుచు నన్నదాతయె" అనండి.

      తొలగించండి
    2. అకట! కడగండ్లపాలైరి సకలజనులు
      నిలిచెజనజీవనమునేడు విలయమగుచు
      నన్నదాతయెశివునిగాహలముదాల్చ
      హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు
      కొరుప్రోలు రాధాకృష్ణారావు

      తొలగించండి
  34. విశ్వమంతయు వ్యాపించి విస్తృతముగ
    గరళమునుమించివిలయముగలుగజేయు
    విషకరోనానునిర్జించువేల్పు హాల
    హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు

    రిప్లయితొలగించండి
  35. రిప్లయిలు
    1. సకల రోగముల నెదుర శక్తి పెరిగి
      బాధ గొనక గొంతుక నందె వ్యాధి క్రిముల
      నడ్డి గెలుపొందగ గళ మందు హాల
      హలము దాల్చిన శివుడె దిక్కగును మనకు!

      తొలగించండి
  36. కలియుగమందుజూడగనుగామితకోర్కెలుదీర్చకంఠమున్
    హలమునుదాల్చినట్టినిటలాక్షుడెదిక్కగునెల్లవారికిన్
    నలికులవేణియిట్లనియెహాలహలంబుగ్రోలగాలుడే
    కలతనుజెందకుండగనుగంఠమునందునిల్పదక్షుడౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కామితమంటే కోరిక. కామిత కోర్కెలు పునరుక్తి, దుష్టసమాసం. వారికిన్ + అలికుల= వారికి నలికుల' అవుతుంది.

      తొలగించండి
  37. పలు విధమ్ముల సకల జీవులను దుఃఖ
    సాగరమ్మున ముంచి భృశమ్ము సెలఁగు
    త్రిపురములఁ గూల్చఁ దన మదిఁ దీవ్ర భీమ
    హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు

    [హలము = కలహము]


    కలవర మింత లేక మది గౌరి యొడంబడ లోకరక్ష నెం
    చి లలనఁ గూడి భద్రగతి శీఘ్రమ యచ్చట కేఁగుదెంచి వే
    జలధి జనించి ప్రాణులను జంపఁ గడంగిన క్ష్వేళ మా హలా
    హలమును దాల్చినట్టి నిటలాక్షుఁడె దిక్కగు నెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
  38. రైతు పేరు నిటలాక్షుడు అని భావిస్తూ....

    ఉ:

    పొలమును దున్ను రైతునకు పుట్టి న బిడ్డడు ముద్దు లొల్కుచున్
    కలలను పండు జేయ మమకారము తోడుత సాగుజేయుచున్
    ఫలమును బొంద మిక్కిలిని బల్కిరి లోకులు మెచ్చుకోలుగన్
    హలమును దాల్చినట్టి నిటలాక్షుడె దిక్కగు నెల్లవారికిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇది చంపక మాల, పొరపాటున ఉ-- ఉత్పల మాల అని వర్గీకరించాను. సరిచేశానని గ్రహింపగలరు.

      తొలగించండి
  39. కలవరపాటుపెట్టుచునుకాలునివోలె జనాళినెల్లరన్
    విలవిలలాడజేయుచును వేసటబెట్టుకరోనపేరుతో
    చలమొనరించురక్కసినిచయ్యననంతముచేయగా హలా
    హలమును దాల్చినట్టి నిటలాక్షుఁడె దిక్కగు నెల్లవారికిన్"

    రిప్లయితొలగించండి
  40. నమస్సులు 🙏🙏
    నా పూరణ ప్రయత్నం..

    *తే గీ*

    వచ్చి జేరెనుగ నొకటి పట్టెమనను
    బ్రతుకు భారము జేసెను వదుల కుండ
    దీన బ్రతుకాయెను నిపుడు దివిన, హాల
    *"హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏💐🙏💐🙏

    రిప్లయితొలగించండి
  41. కలతలురేపిలోకమున, కాలుని వోలెదహించు వైరసే
    కలిసినచాలుమూకలుగ,కాటునువేయును వేగమందుచున్
    పిలిచినబల్కబోరెవరు,పిండము బెట్టగజూచు దానితో
    హలమునుదాల్చునట్టి,నిటలాక్షుడెదిక్కగునెల్లవారికిన్
    +++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు


    రిప్లయితొలగించండి
  42. కడుపు నింపబోవు కవుల కవితకథలు
    గాలి మాటలాడెడినేత కాపురాడు
    హలముదాల్చిన శివుఁడు దిక్కగునుమనకు
    పొలము పండించి మనకింత పొసగుతిండి.

    రిప్లయితొలగించండి
  43. కనులకందని సూక్ష్మపు కరొన క్రిములు
    మానవాళికి సోకి సమరమొనర్చ
    కొరవడె నొకడు మన నాదుకొనగ? హాల
    హలము దాల్చిన శివుడె దిక్కగును మనకు.

    రిప్లయితొలగించండి
  44. మిత్రులందఱకు నమస్సులు!

    చలిమలపట్టికిన్మగఁడు; శర్వుఁడు; సార్ధసతీశ్వరుండు; గు
    బ్బలివిలుకాఁడు; ధూర్జటి; కపర్ది; పురారి; ఋతంభరుండు; బూ
    చులదొర; నర్తనప్రియుఁడు; శూలి; కపాలి; పినాకమున్, హలా

    హలమును దాల్చినట్టి నిటలాక్షుఁడె దిక్కగు నెల్లవారికిన్!

    రిప్లయితొలగించండి
  45. తలువగ మెచ్చు నా శివుడు తాండవ మందున రౌద్ర రూపుడౌ
    పలుకులదల్లి సోదరిని భార్యగ పొందెను గంగ తోడుగన్
    తలచును రామ నామమది తారక మంత్రము నెల్ల వేళసన్
    హలమును దాల్చినట్టి నిటలాక్షుఁడె దిక్కగు నెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తలచిన మెచ్చు' అనండి. సన్ హలము...?

      తొలగించండి
  46. ప్రళయ మల్లె వచ్చిపడెను పాడు వ్యాధి
    ఆగ కుండ ప్రాణాలకు హానిజేయ
    వింత రోగమె టులవీడొ? విభుడు హాల
    "హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వలెను అల్లె అనరాదు. వీడొ.. విడు అనండి.

      తొలగించండి
  47. సృష్టికార్యము నెరవేర్చ దృష్టి నెరపి
    సర్వశుభములొసగెడియాసాంబమూర్తి
    కష్టకాలహరుడయిప్రకృష్టసేద్య
    హలముఁదాల్చినశివుడెదిక్కగునుమనకు

    రిప్లయితొలగించండి
  48. హరిని జూడగా ప్రియమున సిరినిగూడె
    సృష్టికర్త వాణినిజేరి సేదతీరె
    శిష్టజనుల మనసనెడి సేద్యమందు
    హలముఁదాల్చినశివుడె దిక్కగునుమనకు

    రిప్లయితొలగించండి