3, మే 2020, ఆదివారం

సమస్య - 3358

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్"
(లేదా...)
"పైకంబున్ గొని కర్షకుండు ఖలుఁడై భ్రష్టత్వముం బొందులే"

85 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    నాకమ్మందున చేర్చెదమ్మనుచు భల్ నందమ్ముగా పల్కుచున్
    బాకాలూదుచు వడ్డి కిచ్చు ఘనులౌ పాపాత్ములన్ నమ్ముచున్
    రాకెట్టున్ వలె పైకి పోవు ఋణమున్ రమ్యంబుగా జేసి యా
    పైకంబున్ గొని కర్షకుండు ఖలుఁడై భ్రష్టత్వముం బొందులే

    రిప్లయితొలగించండి
  2. ఎకసక్కెమాడు సతితో
    ఎకరా వరి పండలేని ఎలమి పొలముతో
    బాకీల దళారిచ్చెడు
    పైకముతో కర్షకుండు పాడై పోవున్!

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    బాపన సేద్యం:

    మేకల్ పోవగ మేతకున్ వనమునన్ మెక్కంగ శార్దూలమే
    నూకల్ పండని బీడు దున్నగనహో నున్నంగ గుండయ్యెడిన్
    శోకమ్మందున కూలిపోవు తఱినిన్ సొంపారు నత్తయ్యదౌ
    పైకంబున్ గొని కర్షకుండు ఖలుఁడై భ్రష్టత్వముం బొందులే

    రిప్లయితొలగించండి
  4. కం//
    వేకువ జామున నింద్రుడు
    నాకములోనుండి బంపె నాలుగు రూకల్ !
    నాకల నిజమని నమ్మిన
    పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్ !!

    రిప్లయితొలగించండి
  5. పాకలలో బ్రతుకీడ్చుచు
    చీకటిలోపొలము కేగి చెమటలు గ్రక్కన్
    రూకలు సమయముకందని
    పైకముతో కర్షకుండు పాడై పోవున్
    +++++++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సమయముకు' అనడం సాధువు కాదు. 'సమయమునకు' అనాలి.

      తొలగించండి
  6. శ్రీ మాత్రేయనమః 🙏

    అందరికీ నమస్సులు 🙏

    నా పూరణ ప్రయత్నం ..

    *కం||*

    ఆకలితో రోధించుచు
    కేకలు వలదని నిరతము గెలుపును కోరన్
    శోకములో నిల్లుండగ
    *"పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్"*!!

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏💐🙏💐🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరో ప్రయత్నం 🙏🙏

      *కం||*

      నా కొరకై యోటేసిన
      నీ కల నెరవేర్చుననుచు నీతో జెప్పన్
      యా కలకై చేతిన బడు
      *"పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్"*!!

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏💐🙏💐🙏

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'చెప్పన్+ఆ' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  7. కం//
    చాకిరి జేసిన గడవక
    నాకలి,బాధలు బెరుగగ నాగలిబట్టన్ !
    శ్రీకారము నందొసగిన
    పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్ !!

    రిప్లయితొలగించండి
  8. (అనుకోకుండా అవసరాన్ని మించిన ధనం చేతికి వస్తే
    కష్టించి పంటపండించే కర్షకుడు కర్మభ్రష్టుడు కావటమెంతసేపు!)
    లోకంబందున బాధ్యతన్ మరచి యా
    లోలాత్ముడై వర్తిలున్ ;
    మైకంబెంతయు గ్రమ్మ మద్యపు మహా
    మారిన్ సదా గొల్చులే ;
    యేకైకంబుగ బెద్దమొత్తముగ నె
    ట్టెట్లో సమాక్రాంతమౌ
    పైకంబున్ గొని కర్షకుండు ఖలుడై
    భ్రష్టత్వముం బొందులే .
    (ఆలోలాత్ముడు -నిలకడ లేనివాడు ;ఏకైకంబుగ-ఒక్కమాటుగా ;
    సమాక్రాంతంబు-బాగుగా లభించినది )

    రిప్లయితొలగించండి
  9. శ్రీ మాత్రేనమః 🙏 

    కం :
    శ్రీకరమైన తలపులన్  
    ప్రాకరణీక పలుకులును ప్రౌఢపు రీతిన్     
    శోకము మిగిలే ఋణమున 
    పైకముతో కర్షకుండు పాడై పోవున్  


    కం :
    వేకువ ఘామున రైతులు
    ప్రాకట మగుసేద్యములను బంగరు భూమిన్       
    సైకతమనుచూ మరచిన   
    పైకముతో కర్షకుండు పాడై పోవున్  


    కం :
    శోకపు సంగతి యిదియే 
    బాకీ జేయగ నిరతము వడ్డీ నొసఁగెన్      
    ఖాకీ యాతన, ఋణమగు   
    పైకముతో కర్షకుండు పాడై పోవున్


    ✍️కస్తూరి శివశంకర్, ముంబయి 🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'మిగిలెడు ఋణమున.., సైకత మనుచును' అనండి.

      తొలగించండి


  10. ఆ కరివెదను పెనుపుగొను
    పైకముతోఁ గర్షకుండు, పాడైపోవున్
    రాకున్న సరి సమయమం
    దాకసమున వర్షమా వెదను జల్లకయున్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. సమస్య :-
    "పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్"

    *కందం**

    ఆకలిమంటలు దీరును
    పైకముతో, కర్షకుండు పాడైపోవున్
    చాకిరి జేసిన వర్షము
    లేక దళారుల కపటములింకయు తోడై
    ....................✍చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమస్య :-
      "పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్"

      *కందం**

      ఆకలి కేకలు వేయగ
      రూకల కొరకప్పు జేయు రోగము తోడౌ
      శోకము మిగిల్చెడు ఋణపు
      పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్
      ................✍చక్రి

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. లోకంబందు ధనంబె యెంచగను గల్లోలంబు సృష్టించు బ
    హ్వాకారంబులతోడ మానవునిలో నావేశమున్ గూర్చుచున్
    మైకంబున్ గలిగించు దాసులనుగా మార్చున్ గదా సత్య మా
    పైకంబున్ గొని కర్షకుండు ఖలుఁడై భ్రష్టత్వముం బొందులే

    రిప్లయితొలగించండి
  13. శాకఫలశాలిధాన్యము
    లాకలితీర్చెడుకృషీవలత్వము సతమున్
    పైకమెబ్రతుకను యా పా
    "పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్"

    పాప+ఏక=పాపైక

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాకఫలసస్యములచే
      నాకలితీర్చెడికృషీవలాతతవాంఛన్
      పైకమెబ్రతుకను యా పా
      "పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్"

      తొలగించండి
    2. మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'బ్రతుకను నా...' అనండి.

      తొలగించండి
  14. మైలవరపు వారి పూరణ

    ప్రభుత్వాలు ఓట్లకై నేరుగా ప్రజలకు రొక్కమిచ్చి శ్రమశక్తిని హరిస్తున్నారనే ఆవేదనతో....

    సాకల్యంబుగ విత్తనాలెరువులన్ సామగ్రి నందింప., నెం...
    తో కష్టించుచు భూమిదున్ని, వ్యవసాయోత్సాహియై, పంట రా..
    నా కష్టమ్మును విస్మరించి కొను తా నానందమున్ రైతు! మీ..
    రా కార్యంబును మాని వానికుచితంబౌ రీతి రొక్కంబిడన్
    పైకంబున్ గొని కర్షకుండు ఖలుఁడై భ్రష్టత్వముం బొందులే !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

    రిప్లయితొలగించండి


  15. రాకున్నన్ సరియైన వేళ చినుకుల్ రాత్రంతయున్ చింతయే
    పైకంబున్ గొని, కర్షకుండు ఖలుఁడై భ్రష్టత్వముం బొందులే
    మైకమ్మందున కాపిశాయనముతో మంచమ్ము చేరంగ నీ
    లాకాశమ్మదె సీరవాహకుని కైలాసంబునెద్దానికిన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. శ్రీకరమనివ్యవసాయము
    పైకమువడ్డీకిదెచ్చిపంటనుదీయన్,
    వ్యాకులపఱచెడుమార్కెటు
    పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  17. ఆకలిదప్పులనతడే
    చీకటినే పారులాగు చేయగగలుగున్
    బాకీరూకలుదెచ్చిన
    పైకముతో కర్షకుండుపాడై పోవున్
    +++++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  18. నాగలి పట్టెడురైతుకు
    రూకలుఎక్కువయిచెడు తిరుగులుతిరిగెనే
    మైకమునయిచ్చిమగువకు
    పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రూకలు+ఎక్కువయి, మైకమున+ఇచ్చి' అన్నపుడు యడాగమం రాదు. "రూకలె యెక్కువయి, మైకమున నిచ్చి' అనండి.

      తొలగించండి
  19. రూకలువెదజల్లవలె న
    నేకములుగసేద్యమునకునిరతమురైతుల్
    బాకీల్దీర్చగమిగలని
    పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్

    రిప్లయితొలగించండి


  20. టీవీ చర్చలో పార్టీ ఛోటా నాయకుడువాచ


    వైకాపా అధినేత రాజ్యమిదియే! వర్ధిల్లు తానెంతయో
    పైకంబున్ గొని కర్షకుండు; ఖలుఁడై భ్రష్టత్వముం బొందులే
    శోకాల్వెట్టెడు చంద్రబాబు కెడ పస్తుల్బోయి తధ్యమ్ము! పా
    ర్టీకైవారపు నేత బల్కె వడిగా టీవీని చర్చించుచున్!



    జిలేబి





    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దేశ రాజకీయాలు జి.పి. శాస్త్రి గారివైతే, రాష్ట్ర రాజకీయాలు జిలేబి వంతు!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. రూకల కొరకై వలసలు 
    పోకలు ప్రారంభమయ్యె పొలమున కూలీ
    ల్లేక పని సాగక మదుపు 
    పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్  

    రిప్లయితొలగించండి
  22. ఆకలి తీరును పేదకు
    పైకము తో :గర్షకుండు పాడై పోవున్
    శోకము మిగులును పంటల
    భీకర మైన తుఫాను ముంచి వేదన గూర్పన్

    రిప్లయితొలగించండి
  23. నాగలి పట్టెడురైతుకు
    రూకలెయెక్కువయిచెడు తిరుగులుతిరిగెనే
    మైకముననిచ్చిమగువకు
    పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్
    (సరిచేసినాను గురువుగారు)

    రిప్లయితొలగించండి
  24. శ్రీకరముగ పండ సిరులు
    సోకులకై సొమ్ము వాడె సోమరి యకటా !
    బాకీ మాట మరచి నా
    "పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్"

    రిప్లయితొలగించండి

  25. శా॥
    సంకీర్తిన్ గలుగన్ ప్రభుత్వమిపు డే సంపత్తి హద్దేదియున్

    లేకుండయ్యుచితంబుగాను సరిగా రిష్టమ్ము భావించియే

    శంకల్ లేకనె యిచ్చె గాని కడు హెచ్చైనట్టి నేలున్న నా

    పైకంబున్ గొని కర్షకుండు ఖలుడై భ్రష్టత్వముం బొందులే

    రిప్లయితొలగించండి
  26. రూకలు విలువలు తెలియని
    శోకముపడు కూలి జనులచోద్యముచూచున్
    మైకముతో షోకులతో
    పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్

    రిప్లయితొలగించండి
  27. ఆకలి తీర్చెడు రైతులె
    యాకలితో నలమటింప నది కానకనే
    యీ కువలయేశు లనిరట
    పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్

    రిప్లయితొలగించండి

  28. * శంకరాభరణం వేదిక *
    03/05/2020 ఆదివారం

    సమస్య
    ********

    పైకంబున్ గొని కర్షకుండు ఖలుడై భ్రష్టత్వముం బొందులే

    నా పూరణ.
    **** **** **

    బాకీలన్ గొని‌ షావుకారు కడ దా బ్రాజ్యంపు వడ్డీలకున్

    లోకంబందున పంట వేసి రయితే రోజంత గష్టించినన్

    శోకించెన్ గడు పైరు రాక;బ్రతుకున్ శూన్యంబు గావించె డా

    పైకంబున్ గొని కర్షకుండు ఖలుడై భ్రష్టత్వముం బొందులే"

    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  29. చేకురును ధనమనుచు ప్రే
    మైకమునను రైతు పంట మరిమరి వేయన్
    రాక ధర;దిగులు,చాలని
    పైకముతో గర్షకుండు పాడైపోవున్.

    రిప్లయితొలగించండి
  30. ఆకలి కేకలతోడను
    రూకలు కొరకై వెదికెడి రోజున వడిగా
    గైకొనుమని లంచమొసగ
    పైకముతో కర్షకుండు పాడైపోవున్



    రిప్లయితొలగించండి
  31. మిత్రులందఱకు నమస్సులు!

    [ఆ యేఁడు సకాలమున వర్షము పడి, చక్కని పంటలు పండి, ధనము చేతికి రాఁగా, మందుఁడైన కర్షకుఁడు సౌఖ్యమునకు దాసుఁడై చెడిపోవుననుట]

    సాకారంబయి స్వప్నరాశి, ధనసాక్షాత్కారముం బొందుచో,
    శోకాళిం గొను! మందకర్షకుఁడు దాసుండౌను సౌఖ్యాళికిన్!
    నాకంబున్ నరకంబుఁ జేయు! మదిరా న్యస్తాశయుండై, వెసన్

    పైకంబున్ గొని, కర్షకుండు ఖలుఁడై, భ్రష్టత్వముం బొందులే!

    రిప్లయితొలగించండి
  32. మీకివె వరములు గొనుడని
    పైకము జేతులను బెట్టి ప్రక్కనె సారా
    మైకపుటంగళ్ళు దెరువ
    పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్

    రిప్లయితొలగించండి
  33. సౌకర్యాలను పెంచుచున్ మిగుల వర్షాభావమందైన తా
    లోకంబాకటి తీర్చనెంచుటకునాలోచించునెల్లప్పుడున్
    బైకంబున్ గొని కర్షకుండు, ఖలుడై భ్రష్టుత్వముంబొందులే
    పైకంబించుక దొర్క నక్షకుడు తాఁ బందెమ్ములో నొడ్డుచున్.

    రిప్లయితొలగించండి
  34. బాకీలం గొని సాగుఁ జేయఁ బొలమున్ వర్షంబు లేదాయె, నే
    దోకొంతైనను పంట వచ్చు ననగం ద్రుంచెం దుఫానుల్ కృశిన్,
    తూకంబందున మోసమంచుఁ బొలమున్ దుఃఖమ్ముతో నమ్మ నా
    పైకంబున్ గొని కర్షకుండు ఖలుఁడై భ్రష్టత్వముం బొందులే

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  35. క్రొవ్విడి వెంకట రాజారావు:

    దూకొని పండిన పంటయె
    శ్రీకరునిగ మార్చినంత చేష్టలెడలై
    పోకున సడలిత చూడన్
    పైకముతో గర్షకుండు పాడై పోవున్.

    రిప్లయితొలగించండి
  36. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  37. శ్రీకరమగు సమయమ్మున
    చేకూరక తగిన వాన, చేయగ కృషి, వ
    ర్షాకాలముడుగ నప్పుల
    పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్

    రిప్లయితొలగించండి
  38. చొక్కారావిట్లుడివెను
    బైకముతోగర్షకుండుపాడైపోవున్
    పైకంబునకునుబదులుగ
    శ్రీకరమగువిత్తులీయసిరులనునిచ్చున్

    రిప్లయితొలగించండి
  39. ఏకాలమ్మయినన్కృషీవలుడుఁదానింతైననన్నమ్ముచే
    లోకార్తిన్మడచున్ ప్రభుత్వమిదియాలోచించి కష్టేచ్ఛతన్ (కార్యేచ్ఛతన్)
    శోకమ్మైతరలేటివారిఋణదాసోన్మూలమేలేక , శా
    "పైకంబున్ గొని కర్షకుండు ఖలుఁడై భ్రష్టత్వముం బొందులే"

    శాప+ఏక

    రిప్లయితొలగించండి
  40. శా:

    ప్యాకేజంచన కేంద్ర రాష్ట్ర ప్రభుతల్ బారింప రొక్కంబులన్
    బాకాలూదుచు బాంకు వారలును డబ్బాగొట్ట నప్పిచ్చుటై
    యాకా మేమన షావుకారు నిలువన్ యచ్చంపు పేరాస తో
    పైకంబున్ గొని కర్షకుండు ఖలుడై భ్రష్టత్వమున్ బొందు లే

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అప్పిచ్చుటై... ఆకా= సామీ అని సంభోదనగా రాశాను. 3 వ పాదము మొదటి అక్షరం అచ్చు వేయచ్చునో రాదో అనే అనుమానం తో యా (ఆ) కా అని రాశాను. ఈ విషయంలో అనుమానము తీర్చగలరు. 🙏🙏🙏🙏

      తొలగించండి
  41. పైకంబున్గొనికర్షకుండుఖలుడైభ్రష్టత్వముంబొందులే
    పైకంబెక్కువయున్నజేయునుగదాభ్రష్టుంగలోకంబునన్
    బైకంబీయకవిత్తులిచ్చినదగన్బండించిసస్యంబులన్
    సౌఖ్యంబొందుచునుండునెప్పుడునుదాజుట్టాలతోబాటుగా

    రిప్లయితొలగించండి
  42. అందరికీ నమస్సులు🙏
    కం"

    పీకలు నిండుగ తాగగ
    లోకం బుమరచి మధువును, రోగము రాగన్
    శోకము నిండెను బ్రతుకున
    *పైకముతో గర్షకుండు పాడైపోవున్*

    వాణిశ్రీ నైనాల, హైద్రాబాద్

    రిప్లయితొలగించండి
  43. చేకూర్చున్ తగినట్టి పంట యనుచున్ చేయంగ చేద్యమ్ము వ
    ర్షాకాలమ్మున వానలేక మొలకేరాకున్న, వెచ్చమ్ములే
    తాకన్ శూలములై సురన్ గొనుచు బాధన్, హెచ్చు వడ్డీకి తా
    పైకంబున్ గొని కర్షకుండు ఖలుఁడై భ్రష్టత్వముం బొందులే

    రిప్లయితొలగించండి
  44. వీఁక నిడ ఫల వనమ్ములు
    ప్రాకటముగఁ బండ్ల మీద బ్రతికెడు ఖగముల్
    కేకి గణ శారికా శుక
    పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్

    [పైకము = పికముల సమూహము]


    చీకాకుల్ నిజ దార పుత్రులకు దుశ్శీలుండు కల్పించి తా
    నేకాంతమ్మున నిత్య ముండి తలచున్ హేయంపు టాలోచనల్
    పైకమ్ముల్ కృశియించ దుర్వ్యసన తప్త ద్రోహి మద్యంపుఁ బై
    పై కంబున్ గొని కర్షకుండు ఖలుఁడై భ్రష్టత్వముం బొందులే

    [కంబు = సుఖము]

    రిప్లయితొలగించండి
  45. ఆకలి దీర్చెడి భూమిని
    రూకలకైయమ్మినాడురుణములుదీర్చన్
    బాకీలకుపైవచ్చిన
    పైకముతోకర్షకుండుపాడైపోవున్.


    *యస్ హన్మంతు*

    రిప్లయితొలగించండి
  46. ఏకముగా నెలల కొలది
    మూకుమ్మడియై కుటుంబ మొదిగి శ్రమించన్;
    తూకమున చేతులందర
    పైకముతో గర్షకుండు పాడై పోవున్.

    అరపైకము=సగము ధర.

    రిప్లయితొలగించండి
  47. గురువు గారికి నమస్సులు.
    ధీకారతవుండదుసదా
    పీకలదాకా మధువును పీల్చిన నిరతము
    మైకము గ్రమ్మును జల్సా
    పైకముతో కర్షకుండు పాడై పోవున్.

    రిప్లయితొలగించండి
  48. ఆకలి దీర్చెడు రైతున
    కేకాలంబైన జీవ మెదురీతౌనే
    రూకలలేమిని ఋణగత
    పైకముతో కర్షకుండు పాడైపోవున్

    చీకాకుల్ కడు నిష్ఠురంబు కృషినిన్ జీవించుటే భారమౌ
    శోకంబున్ గలిగించుచున్ వరద దా చుట్టేయగా పంటలన్
    జేకూరున్ బహులాభమంచు ఋణమున్ జేయంగ ముక్కారు నా
    పైకంబున్ గొని కర్షకుండు ఖలుడై భ్రష్టత్వముం బొందులే!

    ఆకాశంబున నుండి నూడిపడ నూహాతీతమైనట్టిదౌ
    పైకంబే పొలమమ్మగా దొరలకే ప్రత్యేకమండళ్ళనున్
    మైకమ్ముంబడి ఖర్చుజేయ నదిగో మద్యంబు పేకాట కా
    పైకంబున్ గొని కర్షకుండు ఖలుడై భ్రష్టత్వముం బొందులే!

    రిప్లయితొలగించండి
  49. కందం
    ఆకలి దీర్చని రాబడి
    సాకారముగాని బిడ్డ చదువుల గిలితో
    శోకించి ఋణము దెచ్చిన
    పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్

    శార్దూలవిక్రీడితము
    రూకల్రెండుగలుంగ నాల్గిటిని ఖర్చున్ జేయ సాధ్యమ్మొకో
    లోకంబందున వచ్చురాబడికె మేలుంగాదె జీవించుటల్
    నాకెంతో పొలముందటంచు దిగి పందాటన్ విజృంభించనై
    పైకంబున్ గొని కర్షకుండు ఖలుఁడై భ్రష్టత్వముం బొందులే!

    రిప్లయితొలగించండి
  50. రూకల్ సుంత, సకాల పంటలును నిర్దుష్టంబుగా లేవు య
    స్తోకంబైన ఋణప్రమాదమొకచో దోబూచులాడంగ నేకాకై
    లోకము వీడిపోదునని తాఁ గర్హించి శోకించుచున్
    పై కంబున్,గొని కర్షకుండు ఖలుఁడై భ్రష్టత్వముం బొందులే

    పై కంబున్ = ఇంటి పైకప్పుకు వున్న కంబీ ( కొక్కి ) = ఆత్మహత్య అనే భావము
    ఎంత ప్రమాదము సంభవించిననూ ఆత్మహత్య మహాపాపమని, అది భ్రష్టత్వమని .......

    రిప్లయితొలగించండి
  51. నీ కీయం గలవార మో కృషిక సూ నెమ్మిన్ దగన్ రూకలన్
    మాకే కావలె నోటు నీది యిదిగో మర్యాదగా గొమ్మనన్
    లేకే శంకలు మంచి లాభ మనుచున్ బ్రీతిన్ గొనన్ నీచమౌ
    పైకంబున్ గొని, కర్షకుండు ఖలుఁడై, భ్రష్టత్వముం బొందులే!

    రిప్లయితొలగించండి
  52. ఆకలిబాధలుదీర్చగ
    వేకువనేవెడలుగాద వేదనతోడన్
    చీకటికష్టముదెలుపని
    పైకముతోకర్షకుండు పాడై పోవున్
    +++++++++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  53. పైకముతోఁ గర్షకుండు పాడైపోవున


    ప్రాకగరియలెస్టేటుల
    పోకడతోనాశపెరిగి పొలమదిధరకై
    మైకముకమ్మగనమ్మిన
    పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్


    రిప్లయితొలగించండి
  54. లోకంబున కన్నం బిడి
    చేకొనియెడివారు లేక చింతల బ్రతుకున్
    వేకువ లేకను ఋణముల
    పైకముతో గర్షకుండు పాడైపోవున్!

    చేకొను=ఆదరించు

    రిప్లయితొలగించండి