ధన్యవాదాలండీ శంకరయ్యగారూ! ముందుగా చెక్కిలిమీటి...అని టైపుచేశాను. ఎందుకో మీటి తొలగించి గింత చేర్చి ముందుకు పోయాను. చక్కిలి అని వుండాలనే విషయం గమనించకుండానే. తెలిపినందులకు కృతజ్ఞుడను.
(మందు షాపులు తెరవగానె ఆ దుకాణానికి వెళ్లి క్యూలో నిలబడ్డ తండ్రిని చూసిన తనయుడు "తనకు ఆకలి అవుతుందని ఇంట్లో అన్నము లేదని మందు అనే ముదమును వదలమని ఏడ్చాడు)
రిప్లయితొలగించునడిరేయి సరదా పూరణ:
పదుగురు చూచి నవ్వగను పాపలు పిల్లలు తమ్ముడక్కయున్
బెదరుచు చూచి తైలమును బింకము మీరగ పెద్దపెద్దగా
కుదిరెను నాదు రోగమని కుందుచు గంతుచు కేకలేసి యా
ముదమును రోసి వద్దనుచుఁ బోఱఁడు బిట్టుగ నేడ్చె నత్తఱిన్
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు
తొలగించు🙏
లాకు డౌను లోన పీకల నిండుగ
రిప్లయితొలగించుమేయ కడుపు పులిసె! మ్రింగ నొక్క
గుటక బాగు పడును గొనుమన బామ్మ యా
ముదము వలదటంచుఁ బోఱఁ డేడ్చె
ఆడుకొనగ నీయ నాటబొమ్మయగు కు
తొలగించుముదము, వలదటంచుఁ బోఱఁ డేడ్చె!
సెల్లు ఫోను లోన సినిమాను చూపించ
గుక్క పెట్ట సాగె తిక్కవెధవ!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించుఆముదంబుతోడనమ్మమ్మవైద్యంబు
రిప్లయితొలగించుకదలునమ్మకడుపుకదనమగుచు,
తరముమారినేడుతగదని వంటయా
ముదము వలదటంచుఁ బోఱఁ డేడ్చె
కొరుప్రోలు రాధాకృష్ణారావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఆ.వె//
రిప్లయితొలగించుహద్దుమీరి లలన ముద్దులడుగుచుండ
సద్దు సేయకుండ సంతసమున !
ముద్దులాడునట్టి ముదితముక్కుగొరుక
ముదము వలదటంచుఁ బోఱఁ డేడ్చె !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఆముదంబుతోడనమ్మమ్మవైద్యంబు
రిప్లయితొలగించుకదలునమ్మకడుపుకదనమగుచు
తాత వద్ద జేరి తనగోడు దెలియ నా
ముదము వలదటంచుఁ బోఱఁ డేడ్చె
కొరుప్రోలు రాధాకృష్ణారావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు
రిప్లయితొలగించుఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
తిరుమల యాత్ర వృత్తాంతము:
కదలక నెత్తి పట్టుకొని క్షౌరపు కర్మను కాట్లు గీట్లతో
ముదమున నాన్నగారచట ముచ్చట మీరగ పూర్తిచేయగా
వదలక చంక నెత్తుకొని బామ్మయె ముద్దిడ గుండుమీదనా
ముదమును రోసి వద్దనుచుఁ బోఱఁడు బిట్టుగ నేడ్చె నత్తఱిన్
గుండు కొట్టించిన వారికి ముదము, కొట్టించుకున్నవానికి ఖేదము!
తొలగించుమీ ఆటవిడుపు పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.
తొలగించు🙏😊
ఆ.వె//
రిప్లయితొలగించుఆటపాటలందు పోటిబడుచు తాము
సెల్లు ఫోను బట్టి గొల్లుమనెడి !
నేటి శిశువు లిపుడు మోటుతనముగ, నా
ముదము వలదటంచుఁ బోఱఁ డేడ్చె !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు(అమ్మకు కన్న అబ్బాయి మీద పిన్నమ్మకు
రిప్లయితొలగించుసంతోషం కలిగితే బుగ్గలు కొరికేటంత ప్రేమ )
అక్కకొడుకు "పండు" నమితమ్ము ముద్దాడు
పిన్ని చేరి కొరుకు చిన్నిబుగ్గ ;
పలుకరించు పిన్ని దిలకించినంతనే
ముదము వలదటంచు బోరడేడ్చు .
(ముదము-సంతోషము ;బోరడు-పాపడు )
టం
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు
రిప్లయితొలగించుశ్రీ మాత్రే నమః
మధుర సుధాధరంబులని మానస మందిరమందు వేడుకై
వదనములందు మేలి నిజభావనలుండగ వీచె ప్రేమ వా
రిదముల ధార లే కురిసి రివ్వున నవ్వులు పూచినంతనే
ముదమును రోసి వద్దనుచుఁ బోఱఁడు బిట్టుగ నేడ్చె నత్తఱిన్
కస్తూరి శివశంకర్, ముంబయి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుకడుపునొప్పి తగ్గు కాసింత తాగరా
రిప్లయితొలగించుయాముదమ్ము బిడ్డ యాష్టగొనక
యనుచు బుజ్జగించ హఠమును బట్టి యా
ముదము వలదటంచు బోరడేడ్చె
అదునిదె యాదివారమని నందరి పిల్లల జెంతజేర్చచున్
కుదురుగ ద్రాగగాబలుక గుక్కెడుమందును డొక్కశుద్ధికై
బెదరుచు ముక్కుమూసుకుని వెక్కసమయ్యెడు నాటువైద్య మా
ముదమును రోసి వద్దనుచు బోరడు బిట్టుగనేడ్చె నత్తరిన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఆ.వె//
రిప్లయితొలగించుపెండ్లి జేయనెంచి పెంకితనముగాను
సవతి తల్లి తనకు సఖినిజూప !
నిశ్చయింపగాను నీల్గుచు తనకు, సో
ముదము వలదటంచుఁ బోఱఁ డేడ్చె !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'సోముదము'?
ఆ.వె//
రిప్లయితొలగించుచంటి బాలుడొకడు మింటినిజూడగ
జలుబు ముక్కునుండి పలుచగాను !
గారుచుండి నపుడు పోరు సలుపుచు, ఛీ
ముదము వలదటంచుఁ బోఱఁ డేడ్చె !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు
రిప్లయితొలగించులెస్స! యని తినెను జిలేబీల విడువక
వచ్చె కడుపు నొప్పి బామ్మ తాగ
మనగ నొఱపు బోవ మనవడా యనుచు నా
ముదము, వలదటంచుఁ బోఱఁ డేడ్చె!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు
రిప్లయితొలగించుగుండు సున్న జిలేబి కత :)
ముదము! జిలేబి! జాంగ్రియు! ప్రమోదము! భోజనమిద్దియే యటం
చు దరువు తోడుగా కుడుచు చుండెను! వచ్చెను విడ్గ్రహమ్ము! బా
మ్మ దళముకొల్పు వాని నపమర్ధము తీరగ నివ్వబోవ నా
ముదమును, రోసి వద్దనుచుఁ బోఱఁడు బిట్టుగ నేడ్చె నత్తఱిన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు
రిప్లయితొలగించుపోఱనిపయి ముదము పొంగి పొరలు చుండ
నతని బుగ్గ గొరికి హత్తు కొనగ
శ్వాశ నిలిచి పోవు సంకటమోపక
ముదము వలదటంచుఁ బోఱఁ డేడ్చె"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు
రిప్లయితొలగించుఆటవెలది పాద మణగిన కందము :)
గుబగుబలాడు జిలేబీల్!
దబదబ తినె నొప్పి వచ్చె తన్నుకొనుచు! బా
డబ! నాముదము వలదటం
చుఁ బోఱఁ డేడ్చె నొఱపు నడుచుకొనుచు నపుడున్ !
జిలేబి
తొలగించుగుబగుబలాడు జిలేబీల్!
దబదబ తినె నొప్పి వచ్చె తన్నుకొని డబా
డబ! నాముదము వలదటం
చుఁ బోఱఁ డేడ్చె నొఱపు నడుచుకొనుచు నపుడున్ !
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుపదిలముగాను పాపనికి,పాలు యజీర్ణముజేయుచుండగా!
రిప్లయితొలగించుగుదిగొని వెజ్జుడిచ్చెనిక గుండుగనున్నటువంటిమాత్రలన్
అదియును సౌఖ్యమివ్వకను యారడిబెట్టుటజూడలేక యా
ముదమునురోసివద్దనుచు,బోఱడుబిట్టుగనేద్చెనత్తఱిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'పాలు + అజీర్ణము' అన్నపుడు యడాగమం రాదు. సంధి నిత్యం. "పాలె యజీర్ణము* అనండి.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించుఉదయము తల్లి కాళ్లపయినొద్దిక బాలు బరుండజేయగా
నదనున బిడ్డ యేడ్వ నుళలా యుళలా యని యూరడించుచున్
వదనము లాగి పట్టి బలవంతముగా తినిపించనెంచనా...
ముదమును రోసి వద్దనుచుఁ బోఱఁడు బిట్టుగ నేడ్చె నత్తఱిన్!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.
మైలవరపు వారి పూరణ బాగున్నది.
తొలగించుచిన్నతనమునందు చిట్టాముదమునిచ్చు
రిప్లయితొలగించుబామ్మగుర్తువచ్చిబాలకునకు
తల్లిపరగడుపున త్రాగింపబోవనా
ముదము వలదటంచుఁ బోఱఁ డేడ్చె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించువంట యింటి చిట్క పాటింప మనుచును
రిప్లయితొలగించుబామ్మ చెప్పెనంచు భామ యొకతె
తనయుని పిలిపించి త్రాగుమని యన యా
ముదము వలదటంచుఁ బోఱఁ డేడ్చె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"త్రాగుమని యన నా।ముదము..." అనండి.
పోకిరగుడనితనపుత్రరత్నంబును
రిప్లయితొలగించుముదము వలదటంచుఁ, బోఱఁ డేడ్చె
నేని హద్దు దాట నినడతతోతన
తండ్రిపెద్ద జేసిధన్యు డయ్యె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'పోకిరగుడని'?
ముద్దు పలుకులు విన మోదంబు కలుగగ!
రిప్లయితొలగించుమళ్ళి మళ్ళి యనుచు గిల్లి యడుగ
విసిగెను పసికూన వేధించ నెల్లరు
ముదము వలదటంచుఁ బోఱఁ డేడ్చె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'మళ్ళి మళ్ళి' అనడం వ్యావహారికం. "మరల మరల యనుచు తరచి యడుగ" అనండి.
పక్క యింటి పడతి బాలుని ముదమార
రిప్లయితొలగించుముద్దు పెట్ట గోర మోము తిప్పి
తల్లి ఒడిని చేరి తల దాచుకొనుచును
ముదము వలదటంచు బోర డేడ్చె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు*ఒక కల*
రిప్లయితొలగించుకదలిన నాటపాటలను గాయము, స్వాస్థ్యము గల్గునన్న నా
విదురుని మాటలందు గుఱి వెట్టెను, బంధుగులంత గూడి యా
సదనమునందు 'సెల్లులను' జప్పిడి యాటలనాడఁ జూచి యా
"ముదమును రోసి వద్దనుచుఁ బోఱఁడు బిట్టుగ నేడ్చె నత్తఱిన్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుబయటతిండ్లుతినియుబాధపడుచునుండె
రిప్లయితొలగించుతల్లి పక్క నుండితట్టి లేపి
తలను నిమిరిపోయదాచినవంటయా
ముదము వలదటంచుఁ బోఱఁ డేడ్చె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఉదరములోన నొప్పియని యుద్వహు డేడ్వగ తాళలేకతా
రిప్లయితొలగించువిధికడ కేగువేళనట వృద్ధుడుపాయము జెప్ప వెంటనే
ముదుసలి చెప్పెనంచు తన పుత్రుని త్రాగమటంచు గోర నా
ముదమును రోసి వద్దనుచుఁ బోఱఁడు బిట్టుగ నేడ్చె నత్తఱిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుప్రాత పద్ధతులను వదలని యమ్మమ్మ
రిప్లయితొలగించుశైశవమున జీర్ణ శక్తి బెంచ
వంట యింట కాచి వడబోసి యిడఁగ నా
ముదము, వలదటంచు బోర డేడ్చె!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుచదువులనూత్నవత్సరమునసాగెనుబాలుడునూత్నశోభతో
రిప్లయితొలగించుముదమనియెంచియచ్చటనుమూర్ఖులుజేరిరిజట్టుగట్టుచున్
పదునుగ,సూటిపోటిగనుబల్మినిజూపుచువెర్రిచేష్టలౌ
ముదమును రోసి వద్దనుచుఁ బోఱఁడు బిట్టుగ నేడ్చె నత్తఱిన్
కొరుప్రోలు రాధాకృష్ణారావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు*వత్సరము సాగెను* టైపాటు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించు[తల్లి తన కుమారున కుగ్గుఁబాలను త్రాగించు సందర్భము]
ముదముగఁ దల్లి, పిల్లలకుఁ బోసెడి యుగ్గును జేతఁ బూని, తా
సదమలరీతి జోలలిడి, చక్కఁగఁ జెక్కిలిగింతవెట్టుచున్,
వదనమునెత్తి, "యు"క్కనుచు, బాలున కుగ్గునుఁ బోయ, నప్పు డా
ముదమును రోసి, "వ"ద్దనుచుఁ బోఱఁడు బిట్టుగ నేడ్చె నత్తఱిన్!
మీ పూరణ స్వభావోక్తితో మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించు'చక్కిలిగింత' సాధువు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించుధన్యవాదాలండీ శంకరయ్యగారూ! ముందుగా చెక్కిలిమీటి...అని టైపుచేశాను. ఎందుకో మీటి తొలగించి గింత చేర్చి ముందుకు పోయాను. చక్కిలి అని వుండాలనే విషయం గమనించకుండానే. తెలిపినందులకు కృతజ్ఞుడను.
తొలగించు
తొలగించుచెక్కిలిగింత - ఈ పదం కూడా బాగుందండి :)
Tickling of the cheeks :)
కొత్త పదానికి వేసుకోండి వీరతాళ్ళు :)
జిలేబి
వంటి నిండ జిలలు పసివాని కయ్యయో!
రిప్లయితొలగించునూనె,వేప,పూసి నొచ్చి యున్న
తల్లి కోరుకొనును తనయుని కగునని
ముదము; వలదటంచు బోఱడేడ్చె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుThank you
తొలగించుసుతుని బాగుకోరి శుధ్ధ మనస్కయై
రిప్లయితొలగించుతల్లి పాటు పడె డి తరుణమందు
సంప్రదాయ ముగను చనువు గా వేయు నా
ముదము వలదటంచు బోర డే డ్చె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుపద వదన శిరాగ్ర పర్యంత మాముదం
రిప్లయితొలగించుపులిమి మనుమనునకు ముదముతోడ
కమ్మగ స్నయమీయ నమ్మమ్మఁ జేరఁ యా
ముదము వలదటంచుఁ బోఱఁ డేడ్చె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'ఆముదం' అనడం వ్యావహారికం. 'స్నయమీయ'?
కృతజ్ఞతలు.
తొలగించుస్నయము(=స్నానము)+ఈయ
మీరన్నది "ఆముదం" విషయమై నిజమే. ప్రత్యామ్నాయం ఆలోచిస్తాను.
పద వదన శిరాగ్ర పర్యంత మాముద
తొలగించుము పులిమి మనుమడికి ముదముతోడ
కమ్మగ స్నయమీయ నమ్మమ్మఁ జేరఁ యా
ముదము వలదటంచుఁ బోఱఁ డేడ్చె.
'బిడ్డ!నులిపురుగును వెడల గొట్టు,కడుపు
రిప్లయితొలగించువాతమును హరించి బాధ తొలగ
జేయు,పుచ్చుకొనుము'చెప్పగ, జిగట యా
ముదము వలదటంచు బోరడేడ్చె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఅరుగ లేదు తిన్న యాహార మనియెంచి
రిప్లయితొలగించుయూరి వైద్యుని కడ చేరి చెప్ప
పట్ట మనుచు చెప్ప పొట్టను చూచి యా
ముదము వలదటంచుఁ బోఱఁ డేడ్చె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుజూదమాడ ధర్మజుని తోడ రారాజు
రిప్లయితొలగించుదెప్పిబిల్వగ సహదేవుడంత
కీడు గూర్చునయ్య పాడువిద్య యిది కు
ముదము వలదటంచు బోరడేడ్చె
కుముదము-వ్యసనము(రవ్వాశ్రీహరి-2004)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుమీ ఫోన్ నెం. తెలియజేయండి.
నమస్సులు.
తొలగించుయజ్ఞభగవాన్ గంగాపురం
9440863535
నావలన తప్పేమియు జరుగలేదు గదా!
వదలని నొప్పి దోడ బసివాడటులేడ్చుచునుండ నీవయో
రిప్లయితొలగించుకదలక కూరుచుంటివి వికారము వానికి దగ్గగా నికన్
పద పద దెమ్ము వేగముగ బట్టుము వానికి నంచు జెప్ప నా
ముదమును రోసి వద్దనుచుఁ బోఱఁడు బిట్టుగ నేడ్చె నత్తఱిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుచం॥
రిప్లయితొలగించువదలక మందు గ్రోలు నలవాటును పోయియు మందు కొట్టుకే
యుదయము నుండియున్ వరుస నోపిక నిల్చిన తండ్రిఁ జూచి "నా
యుదరము క్షుత్తు తీర్చుటకు నోదన మింటను లేద"టంచు నా
ముదమును రోసి వద్దనుచుఁ బోఱఁడు బిట్టుగ నేడ్చె నత్తఱిన్.
(మందు షాపులు తెరవగానె ఆ దుకాణానికి వెళ్లి క్యూలో నిలబడ్డ తండ్రిని చూసిన తనయుడు
"తనకు ఆకలి అవుతుందని ఇంట్లో అన్నము లేదని మందు అనే ముదమును వదలమని ఏడ్చాడు)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఅందరికీ నమస్సులు 🙏🙏
రిప్లయితొలగించునా పూరణ ప్రయత్నం ..
*ఆ వె*
ఆకలి కలుగదు తనకు యన్నము వలదు
తిండి యరుగదనుచు దీనుడయెను
ప్రేమగ తనయునికి వేయ దలఁచిన యా
*"ముదము, వలదటంచుఁ బోఱఁ డేడ్చె"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🙇♂️🙏🙇♂️🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుమొదటి పాదంలో గణభంగం. "ఆకలి కలుగదు తన కన్నమ్ము వలదంచు... దీనుడయ్యె/దీనుడాయె" అనండి.
ధన్యోస్మి ఆర్యా 🙏🙏🙇🙇
తొలగించుకడుపునొప్పియనుచుగావుకేకలిడుచు
రిప్లయితొలగించుదనదుచిన్నబిడ్డ తలనుపట్ట
కడుపుబాగుపడునుగాచితిననగనా
ముదమువలదటంచుబోఱడేడ్చె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఆ||వె|| చెల్లిచెవులుకుట్టఁజెమ్మగిల్లెకనులు
రిప్లయితొలగించుముద్దునేడ్చుపాపముఖముఁజూచి
సంతసించుచుండచాలికబంధుల
"ముదము వలదటంచుఁ బోఱఁ డేడ్చె"
"ముదమును రోసి వద్దనుచుఁ బోఱఁడు బిట్టుగ నేడ్చె నత్తఱిన్"
చం|| వదలకమాసమంతయునివాసమునందుపవాస దీక్షస
ల్పొదవున,నుల్లికారములునొద్దికముక్కనువండలేదటం
చు దమమువీడిపూజగదిఁజొచ్చియుయమ్మవినంగ దేవ! కౌ
"ముదమును రోసి వద్దనుచుఁ బోఱఁడు బిట్టుగ నేడ్చె నత్తఱిన్"
కౌముదము=కార్తీకమాసం
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించుధన్యవాదాలు🙏
తొలగించుఅల్ల రేల త్రాగు మన్నఁ దల్లి కినిసి
రిప్లయితొలగించుపళ్ల రసము కలిపి చల్లఁగాను
బాలు త్రాగ నొల్లఁ, బన్నుగఁ దెమ్ము స
ముదము, వలదటంచుఁ బోఱఁ డేడ్చె
[సమ్+ ఉదము = సముదము: మంచి నీళ్లు]
ముదమున నాడఁ డాటలను ముక్కుచు మూల్గుచు నుండు నొంటిమై
కదలక కూరుచుండి కడు కాఱియ నొందుచు నుంటఁ గాంచగం
బదపడి నిత్యమైన మల బద్ధము నారసి వాని కీయ నా
ముదమును రోసి వద్దనుచుఁ బోఱఁడు బిట్టుగ నేడ్చె నత్తఱిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించుపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించువదలకయేడ్చుచుండెనిటపట్టుమువానికిచిక్కనైననా
రిప్లయితొలగించుముదమును,రోసివద్దనుచుబోఱడుబిట్టుగనేడ్చెనత్తఱిన్
బదునుగగాచినాముదముబట్టగబిడ్డనుజేరగావెసన్
ముదమునద్రాగరెవ్వరునుమోదపుబల్కులుసెప్పియీయుటే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"..సెప్పి యిచ్చుటే' అనండి.
పట్టుబట్టితాను పరుగెత్తె వానలో
రిప్లయితొలగించుకాలుజారిపడె కాల్వలోన
చుట్టుప్రక్కలున్న చుట్టాలు నవ్వగా
ముదము వలదటంచుఁబోఱఁడేడ్చె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఆటవెలది
రిప్లయితొలగించుఎదురు చూడమన్న నిన్నాళ్లు వేచితి
మాఘమైన మేలు మనువుకనిన
పదినెలలపిదపని బ్రాహ్మణుఁడెంచఁ గౌ
ముదము వలదటంచుఁ బోఱఁ డేడ్చె
చంపకమాల
వెదవది యీ కరోన దిగి పెండిలి నాపఁగఁ గంటగింపుగన్
బదినెలలావలన్ గనుచు బ్రాహ్మణుఁడెంచుచుఁ జాపినంతఁ గౌ
ముదమును రోసి వద్దనుచుఁ బోఱఁడు బిట్టుగ నేడ్చె నత్తఱిన్
సుదతిని వీడ జాలనని చూడము ముందె ముహూర్తమంచనెన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించుచం:
రిప్లయితొలగించుముదితలు గూడి గుప్తముగ ముచ్చటలాడుచు చిత్రమేగుటన్
తుదియగు రాత్రివేళ తన తొందర పాటుకు నల్కుడవ్వగన్
వదలక వెంబడించు పసివాడికి తాయము నందజేయగన్
ముదమును రోసి వద్దనుచు బోఱడు బిట్టున నేడ్చె నత్తరిన్
అల్కుడు= అలికిడి=చప్పుడు
తాయము=ఊరించెడు తినుబండారము
వై. చంద్రశేఖర్
అవుట ను అవ్వగన్ అని రాశాను. ఇది వ్యవహారీకము అయితే ఆల్కుడొందగన్ అని మారుస్తాను.
తొలగించుఅందరికీ నమస్సులు🙏
రిప్లయితొలగించుఆ.వె
ముద్దు లొలుకు బిడ్డ మురిపెము నంచూడ
కింద దించ నడుగు కందిపోవు
ననుచు చెక్కి లరగ హద్దె రుగని ముద్దు,
ముదము వలడటంచు బోర డేడ్చె!
వాణిశ్రీ నైనాల, హైదరాబాద్
6th May,2020
సదయుడు పద్మనాభుకృప చక్కని బిడ్డడు పుట్టెభార్యకున్
రిప్లయితొలగించుహృదయము పొంగె బిడ్డఁ గని యింపుగ నాడుచు నుండ నింటిలో
కదలక నేడ్చ నొప్పియని కడ్పును పట్టుకు, పట్ట నెంచ నా
ముదమును రోసి వద్దనుచుఁ బోఱఁడు బిట్టుగ నేడ్చె నత్తఱిన్
కడుపు నొప్పి యనుచు కడు వేదనొందుచు
రిప్లయితొలగించుబాధపడగ తల్లి బాలునికట
త్రాగుమయ్య వేగ తగ్గిపోవు నన నా
ముదము వలదటంచు బోఱ డేడ్చె