7, మే 2020, గురువారం

సమస్య - 3362

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గాడిద నెక్కి శశిధరుఁడు గాశికి నేఁగెన్"
(లేదా...)
"గాడిద నెక్కి శంకరుఁడు గాశికి నేఁగె నుమాసమేతుఁడై"

95 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    వేడిని తాళజాలకయె వెచ్చపు భత్యము పెంచకోరగా
    మాడిన మోము పెట్టుచును మంగళ వారము నేడురాయనన్
    పోడిమి మీర వాహనము పోవగ స్ట్రైకున; కోపమెచ్చగా
    గాడిద నెక్కి శంకరుఁడు గాశికి నేఁగె నుమాసమేతుఁడై....

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    "PM Modi on day-long visit to Varanasi...Feb 16, 2020"

    వేడుక నిచ్చు మాటలను పేర్చుచు కైపదమీయ పాడియా?
    మోడియె వచ్చు వార్త విని మోదము నొందుచు వాని చూడగన్
    వాడుక వీడకే తనరి భళ్ళున నందిని పిల్చి ప్రీతిగా;...
    గాడిద!;...నెక్కి శంకరుఁడు గాశికి నేఁగె నుమాసమేతుఁడై....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. * పాఠాంతరము:

      ఆటవిడుపు సరదా పూరణ:
      (జిలేబి గారికి అంకితం)

      "PM Modi on day-long visit to Varanasi...Feb 16, 2020"

      వేడుక నిచ్చు మాటలను పేర్చుచు కైపదమీయ పాడియా?
      మోడియె వచ్చు వార్త విని మోదము నొందుచు వాని చూడగన్
      వాడుక వీడకే తనరి వాసిగ నందిని ప్రీతి;...కాదుగా
      గాడిద!;...నెక్కి శంకరుఁడు గాశికి నేఁగె నుమాసమేతుఁడై....

      తొలగించండి
    2. మీ ఆటవిడుపు పూరణ సరదాగా, మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  3. బూడిద లోఁబడి దొర్లిన
    గాడిద నెక్కి శశిధరుఁడు గాశికి నేఁగెన్
    చూడమి సరిగా నందో
    కాడో! సంధ్యాభిషేక కాలత్వరణన్!

    రిప్లయితొలగించండి
  4. లేడయె వాహన దారుడు
    నేడే పెళ్ళటశశిధరు నికికాశీనన్
    వాడికి గలట్టి మేలగు
    గాడిద నెక్కి శశిధరుఁడు గాశికి నేఁగెన్"

    రిప్లయితొలగించండి
  5. కోడలు గర్భము కొరకును
    వేడగశివుడునుశశిధరు వెళ్ళుటవేళన్
    చూడగ బండ్లుయు లేకయె
    గాడిద నెక్కి శశిధరుఁడు గాశికి నేఁగెన్

    రిప్లయితొలగించండి
  6. వాడు విదేశమందు బహుభంగుల విద్య గడించి వచ్చె నే
    డీడకు,తెల్గు భాష పఠియించడు, కాకర జూచి కీకరం
    చాడెడి వాడు చిత్రమొక టచ్చట జూచి వచించె నీగతిన్
    గాడిద నెక్కి శంకరుఁడు గాశికి నేఁగె నుమాసమేతుఁడై.

    రిప్లయితొలగించండి
  7. (చిలకమర్తి వారి "గణపతి "నవలలో సింగమ్మ తన మూర్ఖపు ముద్దులకొడుకు
    గణపతిని గుడిలోని శివుని ఊరేగింపు గురించి ప్రశ్నిస్తే గాడిద నెక్కిన వాడి సమాధానం)
    వేడుకతోడ బెంచుకొను
    వెంగలి గణ్పతి సింగమాంబయే
    "నేడు శివాలయంబున ద్రి
    నేత్రుని యుత్సవమెట్టులయ్యెనో
    పోడిమి దెల్పరా !" యన బ్ర
    బుద్ధుడు బల్కెను బెత్తమూపుచున్
    గాడిద నెక్కి ;" శంకరుడు
    గాశికి నేగె నుమాసమేతుడై ."
    (వెంగలి -మూర్ఖుడు;పోడిమి -చక్కగా)
    (మనలో మూడు వంతులమంది బందా వారి రేడియో నాటకీకరణం "గణపతి" వినే ఉంటారు .
    గణపతిగా నండూరి సుబ్బారావు ,సింగమ్మగా సీతారత్నమ్మ నవ్వులు పూయించారు .)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      నవల చదివాను కానీ రేడియో రూపాంతరం వినలేదు.

      తొలగించండి
    2. చక్కని పురణార్యా!అభినందనలు,నమస్సులు!

      తొలగించండి




  8. వాడికి స్వస్థలమది పో
    రాడె బతుక వలసకూలి రాబడి తోడై
    చూడ కరోన! రయిలు లే!
    గాడిద నెక్కి శశిధరుఁడు గాశికి నేఁగెన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. వేడుక జరిగెడికాశిన
    తోడుగ నుండెడిరజకుడు తోడ్కొనినేడున్
    బాడుగ బండియు దొరకక
    గాడిద నెక్కి శశిధరుఁడు గాశికి నేఁగెన్

    రిప్లయితొలగించండి


  10. వలస కూలి యానము


    వాడొక కూలి వాడు తను పాటికి పట్నపుటూడిగమ్ము! తె
    డ్డోడె బసాలుతోబతుక! డుండుల కూడదె కారణంబటా!
    చూడ కరోన వచ్చెనదె! సొమ్మొక రూకయు లేదు చేతిలో
    గాడిద నెక్కి శంకరుఁడు గాశికి నేఁగె నుమాసమేతుఁడై!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. పాడుచు"నందిని" బదులుగ
    గాడిద నెక్కి శశిధరుఁడు గాశికి నేఁగెన్
    చూడర!పెద్దలు యనుకొనె
    పాడెడి పిల్లలను చూచిపాడైపోయెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పెద్దలు+అనుకొనె' అన్నపుడు యడాగమం రాదు. "పెద్ద లనుకొనిరి" అనండి.

      తొలగించండి
  12. కం|| నేడరిగెహితుడుమత్తిల
    వేడినభక్తినివరములువేగమునీడే
    తోడులఁదలిదండ్రులెలమి
    "గాడిద నెక్కి, శశిధరుఁడు, గాశికి నేఁగెన్"

    ( క్రమాలంకారము)

    రిప్లయితొలగించండి
  13. పాడై పోయిరి పిల్లలు
    గాడిద నెక్కి శశిధరుఁడు గాశికి నేఁగెన్
    నేడే యివ్విధి బల్కిరి
    చూడగ రేపటి దినముల చోద్యమెటులనో

    రిప్లయితొలగించండి
  14. మోడీగెలిచినచోటుకు
    గాడిద నెక్కి శశిధరుఁడు గాశికి నేఁగెన్
    వేడెనెశివుడునుయప్పుడు
    వీడును మొక్కుయుకొరకును వీడెనువూరున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శివుడును+అప్పుడు' అన్నపుడు యడాగమం రాదు. 'మొక్కుయు' అనడం సాధువు కాదు. ఊరును వూరు అనరాదు.

      తొలగించండి
  15. వాడో వీడో యెవడో  
    తేడా తెలియక ఒకండు తీరిక ననియెన్ 
    వాడుర ఒరె  వింటివిరా 
    గాడిద నెక్కి శశిధరుఁడు గాశికి నేఁగెన్

    రిప్లయితొలగించండి
  16. వీడడు మధుపానమతడు
    పాడలవాటనుచుఁ జెప్ప ఫలితమె లేదే
    వాడే త్రాగుచు వాగెను
    గాడిద నెక్కి శశిధరుఁడు గాశికి నేఁగెన్

    రిప్లయితొలగించండి
  17. కోడియుమేకయుతోటియు
    గాడిద నెక్కి శశిధరుఁడు గాశికి నేఁగెన్
    వేడుకలొచ్చెడిసమయము
    దాడులుజరుపనివలసరితానన్కొనియెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఒచ్చెడి' అనడం సాధువు కాదు. "వేడుకలు వచ్చు సమయము" అనండి. చివరి పాదం అర్థం కాలేదు.

      తొలగించండి
  18. చూడగ గోరెను జంగమ
    వేడుక శివరాత్రినాడు,వెళ్ళెడు విధమున్
    వేడెడు భక్తుని రమ్మన
    గాడిద నెక్కి శశిధరుడు,గాశికి నేగెన్

    రిప్లయితొలగించండి
  19. పాడియు గాదని యందురు
    పోడిమి గాని విధమునను పూజ్యులు బలుక న్
    తోడుగ వృషభము గల దే
    గాడిద నెక్కి శశిధరుడు గాశికి నేగె న్?

    రిప్లయితొలగించండి
  20. జాడలు మఱచిరి వారలు
    వీడిరివాహనములన్నవిలయముగలుగన్,
    వీడెనువృషవాహనమన
    గాడిద నెక్కి శశిధరుఁడు గాశికి నేఁగెన్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు
    ఇచట శిధరుడు వేరు వీరభద్రుడు వేరు

    రిప్లయితొలగించండి
  21. వేడగ గార్ధభములకొక
    నాడొసగిన వరబలమ్మొనరియో, గాకన్,
    నేడే దాని సుకృతమో,
    గాడిదనెక్కి శశిధరుడు గాశికి నేగెన్.

    రిప్లయితొలగించండి
  22. వేడెడు భక్తుల గావగ
    రాడా శివుడని,తన ప్రియ రాకకు భక్తుల్
    చూడగ నందిని గానక
    గాడిదనెక్కి శశిధరుడు గాశికి నేగెన్.

    రిప్లయితొలగించండి
  23. సమస్య :-
    "గాడిద నెక్కి శశిధరుఁడు గాశికి నేఁగెన్"

    *కందం**

    చూడ కరోన ప్రబలునని
    మోడీ లాక్డౌన్ విధించె ముందరి చూపున్
    గాడీ లేకనె కూలీ
    గాడిద నెక్కి శశిధరుఁడు గాశికి నేఁగెన్
    ......................✍ చక్రి

    రిప్లయితొలగించండి

  24. * శంకరాభరణం వేదిక *
    07/05/2020 బుధవారం

    సమస్య
    ********

    "గాడిద నెక్కి శంకరుఁడు గాశికి నేఁగె నుమాసమేతుఁడై"

    నా పూరణ.
    **** **** **
    ( ఊరిలో పని దొరకక శంకరుడు తన భార్య తో తన గాడిదపై పొట్టచేత పట్టుకొని కాశికి ఏగినాడు)

    ఉ.మా.

    వాడిక కూలి;శంకరుడు వాడి సునామము:కష్ట జీవియౌ

    వాడి సుపత్ని పేరు యుమ;వారల పెంపుడు జంతువే కదా

    గాడిద; గ్రామమందు పని గానక యేడ్చుచు బొట్ట కూడుకై

    గాడిద నెక్కి శంకరుఁడు గాశికి నేగె నుమాసమేతుడై


    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  25. గురువు గారికి నమస్సులు.
    యేడునకొకసారికనుట
    పాడిగ దోచెనుతమాదిపడతికిజగతిన్
    పాడుతుతనసతితోడన్
    గాడిదనెక్కి శశిధరుడుగాశికిచేరెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పద్యాన్ని యడాగమంతో ప్రారంభించారు.

      తొలగించండి
  26. ఆడుచు మతిహీనుండొక
    గాడిద నెక్కె;శశిధరుడుఁగాశికి నేగెన్
    మాడిన బ్రతుకులఁగావగ
    తోడై రక్షింప జనుల దుర్గతిఁబాపన్.

    రిప్లయితొలగించండి
  27. ఏడిదగ్రామవాసియతడేర్పడశంకరనామధేయుడా
    చేడియధర్మపత్ని యుమ జేయగనేగిరి తీర్థయాత్రలన్
    వీడని లాకుడౌనులతొవేసటనొందుచు నంత్యమందునన్
    గాడిద నెక్కి శంకరుఁడు గాశికి నేఁగె నుమాసమేతుఁడై

    రిప్లయితొలగించండి
  28. అందరికీ నమస్సులు 🙏🙏

    *నా సరదా పూరణ:*

    *కం||*

    వేడికి వడ దెబ్బ తగిలి
    తోడుగ నొక పెగ్గు వేసి తొందర పడి తా
    తేడాగా పలికెనిటుల
    *"గాడిద నెక్కి శశిధరుఁడు గాశికి నేఁగెన్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏😊🙏😊🙏

    రిప్లయితొలగించండి
  29. మిత్రులందఱకు నమస్సులు!

    [శంకరుఁడనువాఁడు తన భార్య యుమతోఁ గాశికిఁ బోవు సందర్భము]

    వేడుకతోడఁ గాశిఁ జన వేఁడుచు దంపతు లెడ్లబండిపైఁ
    బోఁడిమి వెల్లువెత్తఁగను బోవుచునుండఁగ, దారిదొంగలే
    దాడి యొనర్చి, దోచఁ, దన దగ్గఱ నేమియు లేక, యెట్టులో

    గాడిద నెక్కి, శంకరుఁడు గాశికి నేఁగె, నుమా సమేతుఁడై!

    రిప్లయితొలగించండి
  30. కం//
    తోడుగ విరజుడు రమ్మన
    నాఁడిక జూచుట కొరకును నయనాయుధుడున్ !
    వేడుక జేయగ ఘనమగు
    గాడిద నెక్కి శశిధరుఁడు గాశికి నేఁగెన్ !!

    రిప్లయితొలగించండి
  31. వీడుముశంకనుమురహర!
    గాడిదనెక్కిశశిధరుడుగాశికినేగెన్
    గాడిదవలెగనిపించెనే
    గాడిదనేబోలియుండుకంబళియదియే

    రిప్లయితొలగించండి
  32. గాడిదనెక్కిశంకరుడుగాశికినేగెనుమాసమేతుడై
    గాడిదనెక్కెనంచనుటకర్కశమాయెనునాదుడెందమే
    వేడెదనాదిదంపతులభీకరమైనదిచూసినందుకున్
    గాడిదగోడెగాదలచికమ్రపుపద్యమువ్రాయగోరుదున్

    రిప్లయితొలగించండి
  33. రాడె!శివుండు!నీడె!వరరత్నము!నేండ్లుగతించె సంయతిన్
    నేడిదెరాకయున్నతలనిచ్చెదనన్నభవుండువచ్చెశ్రీ
    తోడనుఁదీర్చెకోర్కెఁబరితోషమురాక్షసుడేగెయానమౌ
    గాడిద నెక్కి ,శంకరుఁడుగాశికినేఁగె నుమాసమేతుఁడై

    రిప్లయితొలగించండి
  34. వాడిన ముఖమ్మునఁ బలికె
    నేడ శివుఁ డనంగ భృంగి యీసున నందిన్
    వేఁడి వడిన్ రమ్మని యా
    గాడిద నెక్కి శశిధరుఁడు గాశికి నేఁగెన్


    గాడిద రావణాసురుని కంచర మింపుగ లాగుచుండఁ బో
    నాడ భృశమ్ము భావ్యమె మహాత్ముల కిద్ధర నాఁ దలంచి తాఁ
    దోడుగ నుండ నంది కట దూర్జటి నందిని పిల్చి, మెచ్చి యా
    గాడిద, నెక్కి శంకరుఁడు గాశికి నేఁగె నుమాసమేతుఁడై

    రిప్లయితొలగించండి
  35. మోడి యనుజ్ఞ నిచ్చెనని మోదము నందుచు మద్యశాలలన్
    వీడుల లోన తెర్చిరిక విస్తృత స్థాయిని మద్యమందగన్
    వాడొక త్రాగుబోతు మధుపానముఁ జేసి వచించె నిట్టులన్
    గాడిద నెక్కి శంకరుఁడు గాశికి నేఁగె నుమాసమేతుఁడై

    రిప్లయితొలగించండి
  36. ఉ:

    కూడలి వేదికై నొకడు గొప్పలు బల్కుచు మైకమందునన్
    వేడుచు నుండ పాంథులను వేడుక త్రాగుడు తూలు రండనన్
    ఓడిన చోట పంతమున నోటమినొప్పక నేగ తానెయై
    గాడిద నెక్కి; శంకరుడు గాశికి నేగె నుమాసమేతుడై

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి

  37. కందం
    పాడుది మద్యమనినఁ గొనఁ
    గూడఁగ బారుల ప్రజాళి కోపము తోడన్
    వీడుచు కోవెలఁ దొందర
    గాడిద నెక్కి శశిధరుఁడు గాశికి నేఁగెన్!

    ఉత్పలమాల
    పాడుది మద్యమన్న వినువారలు లేరనఁ దీర బారులున్
    మూడెను వీరికిన్ భువిని బ్రోవఁగ కష్టమటంచు కోవెలల్
    వీడుచు తొందరన్ హరియె విత్సనమెక్కి వికుంఠమేగగన్!
    గాడిద నెక్కి శంకరుఁడు గాశికి నేఁగె నుమాసమేతుఁడై!

    రిప్లయితొలగించండి
  38. కాడిని బట్టెడు రైతుకు
    కూడే కరవైనవేళ కూలగ భువిపై
    మోడై నిల్వగ వృషభము
    గాడిదనెక్కి శశిధరుడు గాశికినేగెన్
    వృషభము = ఎద్దు,ధర్మదేవత

    శశిధరుడనే కూలీ
    పాడు కరోనా నీడను
    గూడును గోల్పోయి వలసకూలీ,రైల్వే
    గాడిని గానక నందిన
    గాడిదనెక్కి శశిధరుడు గాశికినేగెన్

    కూడిరి సర్వదేవతలు క్షోభనుబొందుచు లాకుడౌనునన్
    వాడిగ చర్చలేజరిగె పాడు కరోనను నిగ్రహించగా
    వీడుచు నొంటెనెక్కిజన బేర్మిని మహ్మదు,మేరిసూనుడే
    గాడిదనెక్కి,శంకరుడు గాసికినేగె నుమాసమేతుడై!

    రిప్లయితొలగించండి
  39. వేడగ లోక రక్షకుని వేగమె రమ్మని భక్తులెల్లరున్,
    వేడుక మీర భృత్య పరివేష్టితుడై ప్రమధాది బృందమున్
    దోడుగ లోకమాత యగు దుర్గయు జేరగ కాళరాత్రియై
    గాడిద నెక్కి, శంకరుఁడు గాశికి నేఁగె నుమాసమేతుఁడై

    రిప్లయితొలగించండి
  40. క్షమించాలి. మీరు వ్రాసింది ఛందోబద్ధంగా లేదు.

    రిప్లయితొలగించండి
  41. వీడెను వీడును రేవడు
    గాడిదనెక్కి,శశిధరుడు కాశికి నేగెనన్
    వేడెడి భక్తుల కావగ
    వీడుచు కైలాసగిరిని వేడుక తోడన్.

    రిప్లయితొలగించండి