10, జులై 2022, ఆదివారం

సమస్య - 4131

11-7-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తపము లేలనొ యజనమ్ము లేల”
(లేదా...)
“తపమొనరింపనేల యజనంబులఁ జేయఁగ నేల ముక్తికై”
(యతిని గమనించండి)

9, జులై 2022, శనివారం

సమస్య - 4130

10-7-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ధారణన్ జేయని వధాని కౌర మెప్పు”
(లేదా...)
“ధారణ సేయఁ జాలని వధానిని మెత్తురు పండితోత్తముల్”

8, జులై 2022, శుక్రవారం

సమస్య - 4129

9-7-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పప్పులు బెల్లమ్ము వద్దు పద్యమె మేలౌ”
(లేదా...)
“పప్పులు బేల్లమే వలదు పద్యమె కావలెనండ్రు బాలకుల్”

7, జులై 2022, గురువారం

సమస్య - 4128

8-7-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అప్రాచ్యులు సేయసాగి రవధానములన్”
(లేదా...)
“అప్రాచ్యుల్ బుధులై వధానములఁ జేయం జొచ్చి రాంధ్రావనిన్”

6, జులై 2022, బుధవారం

సమస్య - 4127

7-7-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పండితులు మెచ్చనిది రమ్యపద్యమయ్యె”
(లేదా...)
“పండితులెల్ల మెచ్చకయె వాసిఁ గనెన్ రసరమ్యపద్యమై”

5, జులై 2022, మంగళవారం

సమస్య - 4126

6-7-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హర్మ్యంబునఁ దగవులాడె హస్తి మకరముల్”
(లేదా...)
“హర్మ్యంబందున హస్తి నక్రములు సేయంజొచ్చె సంగ్రామమున్”

4, జులై 2022, సోమవారం

దత్తపది - 185

5-7-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
'ఈగ - దోమ - నల్లి - పేను'
ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
రామాయణార్థంలో
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

3, జులై 2022, ఆదివారం

సమస్య - 4125

4-7-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పగలె చంద్రుని రాహువు పట్టి మ్రింగె”
(లేదా...)
“దినమధ్యంబున మ్రింగె రాహువు శశిన్ దిక్కుల్ ప్రకాశింపఁగన్”

2, జులై 2022, శనివారం

సమస్య - 4124

3-7-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చెప్పులను గూర్చి గొప్పగాఁ జెప్పనొప్పు”
(లేదా...)
“చెప్పులఁ గూర్చి గొప్పగను జెప్పఁగ నొప్పును తప్పు గాదులే”

1, జులై 2022, శుక్రవారం

సమస్య - 4123

2-7-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భర్తయె భారమ్ము గాఁడె భార్యకు నెపుడున్”
(లేదా...)
“భర్తయె భారమై సతిని బాధలకున్ గురిసేయు నెప్పుడున్”