3-7-2022 (ఆదివారం) కవిమిత్రులారా, ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... “చెప్పులను గూర్చి గొప్పగాఁ జెప్పనొప్పు” (లేదా...) “చెప్పులఁ గూర్చి గొప్పగను జెప్పఁగ నొప్పును తప్పు గాదులే”
తండ్రి యానతిఁ బాటింప ధర్మ మనుచు రాము డేగగ నడవికి ,రాము నాఙ్ఞఁ బాద రక్షలు సేవించి యాభ రతుడు పాల నను జేసె రాముడు వచ్చు వరకు చెప్పులను గూర్చి గొప్పగాఁ జెప్పనొప్పు
తప్పక నడుసులో ఎండ దారిలోన
రిప్లయితొలగించండితిప్పలునులేక చక్కగ దిరుగుటకును
నప్పినటువంటి చెప్పులు నైన కలిగి
చెప్పులను గూర్చి గొప్పగా జెప్పనొప్పు
కందం
రిప్లయితొలగించండితప్పదు భరతా! పితరుడు
నొప్పిన వనవాసమనచు నొసఁగ రఘువరుం
డప్పుడు నయోధ్యనేలిన
జెప్పులను గురించి గొప్పఁ జెప్పగ తరమే!
(అలవాటు లో పొరపాటుగ వ్రాసిన కందం. తప్పని సరిగ సమస్యను కొద్దిగ సవరించుకొని తృప్తి పడితిని)
తేటగీతి
తండ్రి యానతి పాటింప ధర్మమనుచుఁ
గోర భరతునిఁ బ్రేమతో నూరడింప
నొసఁగఁ బట్టమ్ము గట్ట నయోధ్యనేలఁ
జెప్పులను గూర్చి గొప్పగాఁ జెప్పనొప్పు
ఉత్పలమాల
తప్పదు తండ్రియానతిని దాల్చుటె పుత్రుల ధర్మమంచు వా
రొప్పిన రీతి కానలకు నుగ్మలి తోడుగ సాగు రాఘవుం
డప్పుడిడింగఁ గైక సుతుఁడందఁగఁ బ్రీతి నయోధ్యనేల నా
చెప్పులఁ గూర్చి గొప్పగను జెప్పఁగ నొప్పును తప్పు గాదులే!
కందం
తొలగించండితప్పదు భరతా! పితరుడు
నొప్పిన వనవాసమనచు నొసఁగ రఘువరుం
డప్పుడు నయోధ్యనేలిన
జెప్పులను గురించి గొప్పఁ జెప్పగ తరమే!
(అలవాటు లో పొరపాటుగ వ్రాసిన కందం. తప్పని సరిగ సమస్యను కొద్దిగ సవరించుకొని తృప్తి పడితిని)
తేటగీతి
తండ్రి యానతి పాటింప ధర్మమనుచుఁ
గోర భరతునిఁ బ్రేమతో నూరడింప
నొసఁగఁ బట్టమ్ము గట్ట నయోధ్యనేలఁ
జెప్పులను గూర్చి గొప్పగాఁ జెప్పనొప్పు
ఉత్పలమాల
తప్పదు తండ్రియానతిని దాల్చుటె పుత్రుల ధర్మమంచు వా
రొప్పిన రీతి కానలకు నుగ్మలి తోడుగ సాగు రాఘవుం
డప్పుడిడంగఁ గైక సుతుఁడందఁగఁ బ్రీతి నయోధ్యనేల నా
చెప్పులఁ గూర్చి గొప్పగను జెప్పఁగ నొప్పును తప్పు గాదులే!
చెప్పుచుమడినగొప్పలుచెలగుకీర్తి
రిప్లయితొలగించండిఅప్పజెప్పగవత్తురేయవనిపీఠి
చెప్పుదెబ్బకుసిద్ధమైజేరవలయు
చెప్పులనుగూర్చిగొప్పగాజెప్పనొప్పు
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0x4VZ4pLaRPny2Wbw5ZrHkKf2Dn2TExGj8vzS4h3WmpGSR4ZqcfLvLYQGPm3JYc5Rl&id=100000340429045&sfnsn=wiwspwa
రిప్లయితొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిచెప్పు సింహాసనంబెక్కి క్షితినినేలె
చెప్పుఁజూపనగౌరవ చిహ్నమగును
చెప్పు పాదాలకున్నచో ముప్పుతప్పు
*చెప్పులనుఁగూర్చి గొప్పగాఁజెప్పనొప్పు.*
ఉత్పలమాల
చెప్పులె రాజ్యమేలినవి శ్రీరఘురాముఁడొసంగ,మేదినిన్
చెప్పులనేక రూపముల స్త్రీపురుషాళిధరించి మెచ్చరే!
చెప్పులదండ వేయుటయు చిహ్నమె గౌరవహానికక్కటా!
చెప్పులఁగూర్చి గొప్పగను జెప్పగ నొప్పును తప్పు గాదులే.
చప్పుడు సలుప కుండును చలనమందు
రిప్లయితొలగించండిచప్పున ధరించ వీలగు సంభ్ర మమున
నొప్పినిడవు హవాయీ గ నుడువబడెడి
చెప్పులను గూర్చి గొప్పగాఁ జెప్పనొప్పు
రిప్లయితొలగించండిభాతృ భక్తిని కలిగిన భరతుడడగ
పాదుకలనొసగెనె రామ భద్రుడపుడు
రాజుకు ప్రతిరూపమ్ముగ రాజ్యమేలె
చెప్పులను గూర్చి గొప్పగాఁ జెప్పనొప్పు
నిప్పులు రాలు వేసవిని నీరజబంధు ప్రతాపమందునన్
తప్పక దాల్చరే జనులు, తప్పదె కంటక బాధ, కాముకుల్
తిప్పలు పెట్టువేళ కొమ త్రిమ్మరిఁ మోదెడి యాయుదమ్మెయౌ
చెప్పులఁ గూర్చి గొప్పగను జెప్పఁగ నొప్పును తప్పు గాదులే
తండ్రి యాజ్ఞపాలింపగ తరలిపోయి
రిప్లయితొలగించండికానలకు పిదప తన ప్రేమానురక్తి
తోడ రామచంద్రుడు భరతునికొసగిన
చెప్పులను గూర్చి గొప్పగాఁ జెప్పనొప్పు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివత్సరమ్ములుపదునాల్గువాసిగాను
రిప్లయితొలగించండిసింహపీఠికపైనుంచి చిత్తమలర
భరతుడు కొలిచినట్టిశుభప్రదమగు
చెప్పులను గూర్చి గొప్పగాఁ జెప్పనొప్పు”
నిప్పులు గ్రక్కు గ్రీష్మమున నిస్తుల కంటకదుర్గమాటవిన్
రిప్లయితొలగించండితిప్పలు బెట్టు శైత్యమున ధీరత నిల్పుచు గాళ్ళ నెప్పుడున్
దప్పక కాచుచుండునవి ధారుణిపైనను సత్యమందు నా
చెప్పులఁ గూర్చి గొప్పగను జెప్పఁగ నొప్పును తప్పు గాదులే.
తండ్రి యానతిఁ బాటింప ధర్మ మనుచు
రిప్లయితొలగించండిరాము డేగగ నడవికి ,రాము నాఙ్ఞఁ
బాద రక్షలు సేవించి యాభ రతుడు
పాల నను జేసె రాముడు వచ్చు వరకు
చెప్పులను గూర్చి గొప్పగాఁ జెప్పనొప్పు
పాదములరక్ష సేయుచు పరగు చుండి
రిప్లయితొలగించండిపలు ర కమ్ముల రూపాన వెలుగి తాము
మాన వాళిని సేవించు మనుచు నుండు
చెప్పులను గూర్చి గొప్పగా చెప్ప నొప్పు
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిపవలు రేయన్న భేదము పరిహరించి
సతతమంతయు పథమున చక్కదమగు
రక్షణొసగి ఘనముగ దొరలెడు కాలి
చెప్పులను గూర్చి గొప్పగా జెప్పనొప్పు.
చెప్పులు రాజ్యపా లననుఁ జేసెను రాముడె యాఙ్ఙఁ జేయగా
రిప్లయితొలగించండినప్పరమ పావ నుడగు నాభర తుండెసు రాము చెప్పులన్
నొప్పుగఁ బీఠమం దునిచి యూపిరి గాఁ గను జేయ పాలనన్
చెప్పులఁ గూర్చి గొప్పగను జెప్పఁగ నొప్పును తప్పు గాదులే .
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిమెప్పగురీతి రక్షణను మెల్పుగ నిచ్చుచు నెల్లవేళలన్
త్రిప్పుచు సేవజేయుచును తీరుగ కోరికలేమి కోరకున్
యొప్పగునట్టి రూపమున యోర్పుగ పాదములంటియుండు నా
చెప్పులగూర్చి గొప్పగను జెప్పగ నొప్పును తప్పులేదులే!
చెప్పు నీకేమి తెలియునో 'చెప్పు'గూర్చి?
రిప్లయితొలగించండిచెప్పు పాదాల రక్షించు నొప్పుగాను
నిప్పు మీదైన నడచి తా మెప్పునొందు
చెప్పులను గూర్చి గొప్పగాఁ జెప్పనొప్పు
చెప్పులు పాదరక్షలయి చెన్నుగ సౌఖ్యమొసంగు నిచ్చలున్
రిప్లయితొలగించండినిప్పులమీదనైన నతి నేర్పుగ దాటెడు సాధనంబిదే
తప్పులు జేయు ధూర్తులకు దండన నిచ్చెడు సాధనంబిదే
చెప్పులఁ గూర్చి గొప్పగను జెప్పఁగ నొప్పును తప్పు గాదులే
మూడవ పాదం "తప్పులు చేయు ధూర్తులకు దండననిచ్చెడు నాయుధంబిదే" గా చదవ గోర్తాను.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిమండుటెండలో రక్షించి మెండు మేలు
జేయు, కాలికి తొడిగిన జేయు మంచి
కంటకముబారి చరణాల కాచు నట్టి
చెప్పులను గూర్చి గొప్పగ చెప్ప నొప్పు
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
గొప్పను చూప నెంచుచును కోమలు లిచ్చగ సేకరింతురే
రిప్లయితొలగించండితిప్పలఁ బెట్టు యెండలను దీటుగ నిల్చుచు పాదరక్షకై
చొప్పడజేయు రైతులకు సొంపును కిఱ్ఱని చేసి శబ్దముల్
తప్పుకుపోవ పాములును దారులలోన చరించ చీకటిన్
చెప్పులఁ గూర్చి గొప్పగను జెప్పఁగ నొప్పును తప్పు గాదులే
భక్త సందోహమున కవి ముక్తిదములు
రిప్లయితొలగించండిసంకట హరణమ్ములు విశ్వ సన్నుతుఁడు భ
రతుఁడు శిరమున నుంచిన రాఘవేంద్రు
చెప్పులను గూర్చి గొప్పగాఁ జెప్ప నొప్పు
చప్పుడు సేయ నేల సువిచారము సేసి గణింప సత్యముల్
తప్పక యాచరింప వలె ధాత్రిని నెల్లరు మానవాళి కె
ల్లప్పుడు నంచితమ్ముగను బ్రాజ్ఞ వరేణ్య ముఖచ్యుతమ్ము లా
చెప్పులఁ గూర్చి గొప్పగను జెప్పఁగ నొప్పును దప్పు గాదులే
[చెప్పులు = చెప్పెడి మాటలు]
తేటగీతి
రిప్లయితొలగించండినిలువ నీడలే ని యునికిని గని సరిగ
మండుటెండని యూడిన మలకడాలు
గుడి మెటికలపై పోగొట్టు కొన్న కొత్త
చెప్పులను గూర్చి గొప్పగాఁ జెప్పనొప్పు
ఎప్పుడు మానవాళినవి యెన్నడ వీడక
రిప్లయితొలగించండిపాదరక్షలై
తప్పక చేయు రక్షణము తద్దయు తీక్ష్ణపు
ముళ్ళనుండియున్
ముప్పను గల్గకుండ విషపూరిత పుర్గుల
నుండి యందుకే
చెప్పులగూర్చి గొప్పగను జెప్పగ నొప్పును
తప్పుగాదులే
తే.గీ:నాదు కుట్టిన పద్యముల్ నాకు గొప్ప
రిప్లయితొలగించండిబట్టలను కుట్టు వాని కా కుట్టు గొప్ప
చెప్పులను కుట్టు వాడు తా జేసి నట్టి
చెప్పులను గూర్చి గొప్పగా జెప్ప నొప్పు
ఉ:గొప్ప ధనమ్ము గల్గియును,కోట్లు గడించెడు వర్తకమ్ములో
రిప్లయితొలగించండిగొప్పగ పేరు పొందియును గొప్పగనే ప్రకటించు కొందు రీ
గొప్పల కంపెనీలు ,తమకున్ కుల వృత్తియె యౌట మాదిగల్
చెప్పులఁ గూర్చి గొప్పగను జెప్పఁగ నొప్పును తప్పు గాదులే
తండ్రికిచ్చినమాటనుతప్పననుచు
రిప్లయితొలగించండిభరతునకొసంగనారామభద్రు డపుడు,
ముదముతొడను తలపైన మోసినట్టి
*చెప్పులను గూర్చి గొప్పగాఁ జెప్పనొప్పు*
కంటకములనుండి మనను కాపు కాచు
పాద యుగళి కెపుడుమంచి భద్రతనిడు
*చెప్పులనుగూర్చిగొప్పగా చెప్పనగును*
వృశ్చికముల చంపగవచ్చు వీనితోడ