4, జులై 2022, సోమవారం

దత్తపది - 185

5-7-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
'ఈగ - దోమ - నల్లి - పేను'
ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
రామాయణార్థంలో
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

23 కామెంట్‌లు:

  1. తేటగీతి
    ఈ గరుకు దారులందున సాగె నెటకొ?
    తెలియరాదో మరలివచ్చు తెన్ను తనకు
    తరులనల్లిన లతలార! తపనఁ గనరె?
    సీత వలపేను పొందక చెల్లఁ గలనె?

    రిప్లయితొలగించండి
  2. హనుమ, యీగమనంబునహానిలేక
    వీరదోర్మండితుండవైవేగబొమ్ము
    తోకనల్లికరావణుతోడిరణము
    చేయువీపేనుగద్దెగాసీతదెమ్ము

    రిప్లయితొలగించండి
  3. కంటి నీగడ్డి మేయుచుఁ గనుమ రిగెను
    మాయ లేడిదో మరెచటో మాయ మయ్యె
    నీపొ దరునల్లి న విజూడు నేపు గలుగు
    తీవ బాణాలు గాఁ బేను తే విలుగను
    సంహరించ నగు గద యిక శంబరమును

    రిప్లయితొలగించండి

  4. ఈ గడసరి దనుజేంద్రుని దునుమాడ
    . వచ్చిన శ్రీరామ బంటునేను

    కోపంబు వలదో మగువనీకు తెగువతో
    . కడలి లంఘించిన కపిని గాదె

    శోకంబు మాపేను సుగ్రీవ మంత్రినౌ
    . వెదకవచ్చితి నిన్ను విహగ వీధి

    పథకము నల్లితిన్ బావని నిన్నింక
    . శ్రీరాముఁ జేర్చెద శీఘ్రముగను



    ఉంగరమును గాంచి యుపకారినేనంచు
    విశ్వసించవమ్మ విమలచరిత
    నిన్ను మోసికెళ్దు నీపతి సన్నిధి
    భయము వీడమంచు పలికె హనుమ.

    (శోకంబు +మాపు+ ఏను= శోకంబు మాపేను )

    రిప్లయితొలగించండి
  5. రామలక్ష్మణులతో హనుమ సంభాషణము
    =============================
    తేటగీతి
    తరుల(నల్లి)బిల్లిగ లతల్ పెరిగినట్టి
    (ఈ గ)హనసీమలందున నేగు మీర
    లెవరు?కననె(దో,మ)హితకార్యైకమగ్ను
    లైనమిమ్ముల,మును(పేను)నరయ లేదు.

    రిప్లయితొలగించండి
  6. రాముడు హనుమంతునితో

    తే॥గీ॥

    ‘ఈ గ’మనము నందున లంక కేగి యచట
    తెఱవ యెట నున్న’దోమ’రి ! తెలుసు కొనిన
    నేను మును’ పే ను’డివినట్లు నిపుణ తనిడి
    పొసగు నెరవు’నల్లి’ జయము పొందెదమిక

    రిప్లయితొలగించండి
  7. (ఈగ)మనపువేగము దెచ్చెనిటకు నన్ను
    యెచట గల(దోమ)హీసుత యెవ్విధమున
    రామ చూ(పేను) నీకు ధరణిజ జాడ
    యనుచు (నల్లి)బిల్లిగనెంచె ననిలసుతుడు

    రిప్లయితొలగించండి
  8. (రావణునితో అంజనేయుడు పల్కినట్లు నూహించి)
    *ఈ గ* దా ఘాతము నిను చం *పేను* చాలు
    *దో మ* దమ్మునెగయ, కాని నీ మరణము
    మొగ్గరము *నల్లి* రఘురామ దిగ్గజమ్ము
    నిర్వహించును వాక్పతి నిర్ణయమున
    చంప+ ఏను: చంపేను

    రిప్లయితొలగించండి
  9. ఇంతినిటుల తెచ్చి *ఈగ*ర్వ మేలనో
    చెడు పథకము *నల్లి*సిగ్గువిడిచి
    తోషమందుటకు ని*దోమం*చికార్యమా
    రణముననలి*పేను*రాఘవుండు

    రిప్లయితొలగించండి
  10. హనుమ ఒక రక్కసి తో బల్కిన మాటలు ---
    ఈ గదా ఘాతమున నిన్ను వేగ ముగను
    మడియ జేయు గ దో మ హా మాన్య మౌచు
    నల్లి బిల్లిగ బోరాడ జెల్లు నొక్కొ
    ననుచు మును పేను నుడి వి తి ఘన ము గాను

    రిప్లయితొలగించండి
  11. ఈ గరితయె కలదో మఱి
    వేగమ తా నల్లిన తలఁపే నుగ్గయినం
    జాగినదొ యాత్మ హత్యకు
    నే గతిఁ గను గొందు నింక నే జానకినిన్

    రిప్లయితొలగించండి
  12. శంకరాభరణము వారి సమస్య

    దత్త పది
    ఈగ,దోమ,నల్లి, పేను


    పై పదములు అన్యార్ధములు వాడుచు రామాయణార్ధములో
    నా పూరణ సీసములో శూర్ఫణక రాముని పరిణయమాడమని అడుగు సందర్భము


    సీసము
    కాంచ నే(దో మ)త్తు కాయమ్ము నంజేరి కలవర మిడుచుండె, నిలువ జాల ,

    హృధిలోన నిత్యము కదలుచు నుండెను నీ తల(పే,ను)వ్వు నేను పరిణ

    యమ్మాడి (యీగ)హనమ్మున తిరుగుచు రతిసౌఖ్యమున్ కడు రమ్యగతిని

    పొందెదమయ్య, యో సుందరా! పుష్పమాలల(నల్లి) వేతు గళంబునందు


    రమ్ము మానవా నీతో సరసము లాడ
    తొందర పడుచు నుండె నీ తోయజాక్షి
    యనుచు దానవాంగన వినయమ్ము తోడ
    పలికె నా రఘురాముని చెలిమి కోరి

    రిప్లయితొలగించండి
  13. మండోదరి రావణుని ప్రశ్నించు సందర్భం.
    **********************************
    తేటగీతి
    ఈగతి కొనితెచ్చితి వేమి ,యిగురు బోడి
    సీత తానల్లి బిల్లి వాశితగ దల్చి
    తివిగ, చంపేను మనలను తేలికగనె
    ఏది కాదో మరేమిటో యెరుక జెప్పు.
    ప్రబల వేంకట సుబ్రమణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  14. ( సీసము )
    ఈగతి ఫలియించు నేరీతి నైనను ,
    రాశిగా గల్గెను రామ కృపయె !
    నూరెనొక్కతలపే నుతి సేయుచు హనుమ
    నగమువద్దకెగిరె నయము గాను !
    కొండల నల్లిన కొల్లల చెట్లన
    సంజీవినేదియో సంశయపడె !
    యేదోమదిని తల్చి యిక్కట పడనేల
    యన్చు నగమునెత్తె నటులె హనుమ !
    ( తే గీ )
    ఏమి బంటుతనంబది యేమి భక్తి ,
    యేమి శౌర్యపరాక్రమమెంత శక్తి ,
    యేమి జూచిననితనికి యెదురు లేదు ,
    జయము బలుకరె హనుమకు జయము ! జయము !
    వేణుగోపాల్ యెల్లేపెద్ది

    రిప్లయితొలగించండి
  15. హనుమ గనేని(దో మ)నుష యానతి కాదని రామకార్యమే
    యను తల(పేను) శక్తియని యండని నొక్క తటాలునుత్తరిం
    చియె సురసన్ గెలీచియును సింహిక సంహరణంబె జేయగన్
    హనుమయె తోక (నల్లి) మరియగ్నితొ గాల్చెను దూత(నీగ)తిన్

    రిప్లయితొలగించండి
  16. హనుమ గనేని(దో మ)నుష యానతి కాదని రామకార్యమే
    యను తల(పేను) శక్తియని యండని నొక్క తటాలునుత్తరిం
    చిని సురసన్ గెలీచియును సింహిక సంహరణంబె జేయగన్
    హనుమయె తోక (నల్లి) మరియగ్నితొ గాల్చెను దూత(నీగ)తిన్

    రిప్లయితొలగించండి