8, జులై 2022, శుక్రవారం

సమస్య - 4129

9-7-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పప్పులు బెల్లమ్ము వద్దు పద్యమె మేలౌ”
(లేదా...)
“పప్పులు బేల్లమే వలదు పద్యమె కావలెనండ్రు బాలకుల్”

24 కామెంట్‌లు:

  1. గొప్పగ వ్రాయగ పద్యము
    నప్పడతులు సూచి చదివి యానందముతో
    నప్పుర వాసుల తోననె
    పప్పులు బెల్లమ్ము వద్దు పద్యమె మేలౌ

    రిప్లయితొలగించండి
  2. కందము
    అప్పా!యాంగ్లము రుద్దకు
    పప్పులు బెల్లమ్ము వద్దు,పద్యమె మేలౌ
    నిప్పగిదిఁబలుకు పిల్లల
    దప్పక నాశీర్వదింతు దద్దయుప్రేమన్.

    రిప్లయితొలగించండి
  3. చెప్పనలవి కాదు బడిన,
    గొప్పగ మధ్యాహ్నమందు కూడును కనగా
    పప్పన్నమునన్ బురుగులు
    పప్పులు బెల్లమ్ము వద్దు పద్యమె మేలౌ.

    రిప్లయితొలగించండి
  4. , మెప్పునఛందోరీతులు
    గుప్పినభాసిలునుపమలగూర్చినకవితల్
    కప్పగచాలగశర్కర
    పప్పులుబెల్లమ్మువద్దుపద్యమెమేలౌ

    రిప్లయితొలగించండి
  5. గొప్పగ నీతులు దెలుపుచు
    నెప్పుడు విలువలనుగూర్చి
    యెరగించుచు మా
    తప్పల దిద్దిన జాలును
    పప్పులు బెల్లమ్మువద్దు
    పద్యమె మేలౌ.

    రిప్లయితొలగించండి
  6. అప్పునుఁజేసిపప్పులనునాంగ్లమునందునపంచౄజూచినన్
    చప్పునజీర్ణమెట్టులగుసాజముగాకనుశంకదెచ్చునే
    తిప్పలునయ్యెడింభకులతేజమువిద్యవిహీనమౌగదా
    పప్పులుబెల్లమేవలదుపద్యమెకావలెనండ్రుబాలకుల్

    రిప్లయితొలగించండి
  7. తప్పుగ నెంచకు మ య్యా
    చెప్పుము నీ కేమి వలయు శీఘ్ర మె యనగా
    చప్పున బాలుం డనియెను
    పప్పులు బెల్లమ్మువద్దు పద్య మె మే లౌ

    రిప్లయితొలగించండి
  8. తప్పక నేర్వగా వలయు దద్దయు బ్రీతిని మాతృభాష,చి
    న్నప్పుడు ముద్దుముద్దుగనె,యమ్మమ తాతయఁజెంతఁజేరి,యో
    యప్ప!తెనుంగు భాషరుచి యందము చందముఁజెప్ప శక్యమే
    *పప్పులు బెల్లమే వలదు పద్యమె కావలెనండ్రు బాలకుల్*

    రిప్లయితొలగించండి
  9. గొప్పగ పద్యము చెప్పిన
    దెప్పరములు తొలగు శాంతిఁదెచ్చును మదికిన్
    చిప్పిలజేయును సుధలను
    పప్పులు బెల్లమ్ము వద్దు పద్యమె మేలౌ

    రిప్లయితొలగించండి
  10. కందం
    పప్పులు వేమన బద్దెన
    గొప్పగ పాపయ్య తీపిఁ గూర్పగ గొనుచున్
    మెప్పున నా బాలలనిరి
    "పప్పులు బెల్లమ్ము వద్దు పద్యమె మేలౌ"

    ఉత్పలమాల
    పప్పులఁబోలుచున్ రుచులు బంచగ వేమన బద్దెనాదులున్
    గొప్పగ తీపి రువ్వగనె కూరిమి పాపయ తెల్గుబాలగన్
    జొప్పడ నోట నానగల సొంపగు ధారలు వల్లెవేయుచున్
    పప్పులు బేల్లమే వలదు పద్యమె కావలెనండ్రు బాలకుల్!

    రిప్లయితొలగించండి
  11. తప్పక బడికేగుటకై
    పప్పులు బెల్లమ్ము వద్దు, పద్యమె మేలౌ
    నొప్పుగ నేర్పించినచో
    తప్పులు లేకనె జదివెద దామిక మెచ్చన్

    రిప్లయితొలగించండి
  12. పప్పులు బెల్ల మౌ రుచిని పద్యము దాటిన గారణంబుగా
    పప్పులు బెల్లమే వలదు పద్యమె కావలెనండ్రు బాలకుల్
    చప్పున పద్యలక్షణముఁ జాలిన మేరకు నేర్ప వారికిన్
    దప్పక నేర్పుతో రచన దారును జేయుదు రందమౌ విధిన్

    రిప్లయితొలగించండి
  13. గొప్పగ పెద్దన పద్యము
    జెప్పగ బాలలు ముదంబుజెంది నభిరుచిన్
    జప్పున పొందియు చెప్పిరి
    పప్పులు బెల్లమ్ము వద్దు పద్యమె మేలౌ

    రిప్లయితొలగించండి

  14. కొప్పరపు కవుల వోలెను
    మెప్పును బొందంగదలచి మేవడి తోడన్
    చెప్పుచు నుంటిమి శాస్త్రా
    పప్పులు బెల్లమ్ము వద్దు పద్యమె మేలౌ.


    ఒప్పిద మైనమాటలవి యోరిమితోడ దృశాను లెల్లరున్
    జెప్పగ నాలకించి తమ క్షేమము గోరెడు వారిమాటలన్
    దప్పక నాచరించుటె ప్రధానమటంచు దలంచి బూరెలున్
    పప్పులు బెల్లమే వలదు పద్యమె కావలెనండ్రు బాలకుల్.

    రిప్లయితొలగించండి
  15. రిప్లయిలు
    1. కందం
      చెప్పరె నీతిశతకమును
      గొప్పగ మారును నడతలు! కొదవగు నేడున్
      చిప్పులు చాక్లెట్లుండగ
      పప్పులు బెల్లమ్ము వద్దు పద్యమె మేలౌ

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  16. తప్పులుదిద్ది చక్కనగు దారిని చూపెడు సూక్తులెన్నియో
    చెప్పిరి నీతిపద్యముల చెన్నుగ సత్కవివర్యు లెందరో
    తప్పక మాకు చాలునవి తక్కినవేటికి యంచు పల్కుచున్
    పప్పులు బేల్లమే వలదు పద్యమె కావలెనండ్రు బాలకుల్

    రిప్లయితొలగించండి
  17. తప్పుల తడకల పథకము
    గొప్పగ ప్రకటనల కొరకు కోట్లగు చుండన్
    తిప్పలు పెట్టెడు చదువుల
    పప్పులు బెల్లమ్ము వద్దు పద్యమె మేలౌ

    రిప్లయితొలగించండి
  18. కందం
    జెప్పెద వినుమా మనుజా
    ఎప్పుడు గాని పొగడదగు, యెక్కడ గానీ
    తప్పుగ నెంచక నుడువుము
    పప్పులు బెల్లమ్ము వద్దు పద్యమె మేలౌ.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  19. చెప్పినది వినం డెప్పుడు
    తప్పులె వచియించు సంతతము వ్రాయకుమీ
    తప్పులు పథ్యమురా యిటఁ
    బప్పులు బెల్లమ్ము వద్దు పద్యమె మేలౌ


    చప్పుడు సేయకుండఁ దగఁ జక్కఁగఁ బద్యము విన్న వారికిం
    దప్పక చిత్ర వీక్షణము దక్కును శీఘ్రమ యట్లు కానిచోఁ
    బప్పుల తోడ బెల్లమును వారక తిన్డని చెప్పి నంతటం
    బప్పులు బెల్లమే వలదు పద్యమె కావలె నండ్రు బాలకుల్

    రిప్లయితొలగించండి
  20. గొప్పగ భాష నేర్పవలె గూరిమి
    తోడను భావి జీవితం
    బెప్పుడు కష్టదు:ఖముల నెల్ల సమ
    మంబుగ జూపునట్టి దౌ
    మెప్పును బొంది పండితులు మిక్కలి
    సంస్తుతి జేయునట్టిదౌ,
    పప్పులు బెల్లమే వలదు, పద్యమె
    కావలె నంద్రు బాలకుల్.

    రిప్లయితొలగించండి
  21. చెప్పిన శిక్షకుండు కడుఁ జెన్నగు శైలిని శిష్యకోటికిన్
    గుప్పున చేరు పాఠ్యములు కోమలమైన మనస్సులందునన్
    చొప్పడఁ జేయఁ గౌతుకము సుందరమైన పథమ్ముఁ బాడుచున్
    పప్పులు బెల్లమే వలదు పద్యమె కావలెనండ్రు బాలకుల్

    రిప్లయితొలగించండి
  22. ఒప్పుగనేర్పినచాలును
    పప్పులుబెల్లమ్మువద్దుపద్యమెమేలౌ
    తప్పక నేర్చుచువడిగా
    యొప్పింతుముమేముమీకు నోగురువర్యా

    రిప్లయితొలగించండి