3, జులై 2022, ఆదివారం

సమస్య - 4125

4-7-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పగలె చంద్రుని రాహువు పట్టి మ్రింగె”
(లేదా...)
“దినమధ్యంబున మ్రింగె రాహువు శశిన్ దిక్కుల్ ప్రకాశింపఁగన్”

15 కామెంట్‌లు:

  1. అమెరి కాలోన నున్నట్టి యాడ బిడ్డ
    చంద్ర గ్రహణపుఁ జిత్రాల సరముఁ బంప
    భరత ఖండము వారికి పగలె యగుట
    పగలె చంద్రుని రాహువు పట్టి మ్రింగె

    రిప్లయితొలగించండి
  2. మిట్టమధ్యాహ్ణమందునమేలిరుచుల
    సూర్యుడుండంగపౌర్ణమిశోభదరిగె
    పట్టెనయ్యయొచంద్రునిపామునొకటి
    పగలెచంద్రునిరాహువుపట్టిమ్రింగె

    రిప్లయితొలగించండి
  3. భానుడు వెలుగు పంచును ప్రతిదినమ్ము
    “పగలె ,చంద్రుని రాహువు పట్టి మ్రింగె”
    గ్రహణ సమయము నందున కమ్మె ధ్వాంత
    మవనిలో పౌర్ణమీ దినమందు గనుడు


    రిప్లయితొలగించండి

  4. అమెరికాలోన చంద్రగ్రహణమటంచు
    దూరదర్శన మందు ప్రసారమయ్యె
    భారతీయులు గాంచిరే భ్రాతితోడ
    పగలె, చంద్రుని రాహువు పట్టి మ్రింగె

    రిప్లయితొలగించండి
  5. ఘనవేదాంతియుగాగశంకరుడుపోపోకాలాంతకుండున్వలెన్
    జనకాదుల్వినువీథిలోనగనహోజాతంబుమేథావియై
    చెనకెన్తర్కమునందుడాంబికునితాజేయుండుగాగన్తుదిన్
    దినమధ్యంబునమ్రింగెరాహువుశశిన్దిక్కుల్ప్రకాశింపగన్

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి
    ఔర!అమవస తిథినాడు క్రూరముగను
    మ్రింగె భానుని కేతువు నింగిఁబట్ట
    *పగలె;చంద్రుని రాహువు పట్టి మ్రింగె*
    పౌర్ణమీతిథి నడిరేయి పూర్ణముగను.

    మత్తేభము

    కనగా నెంతటివారికైన కలుగుంగష్టంబు లెన్నెన్నియో
    దినరాజంతటి వానినే నభమునందేజోహీనుగాఁజేయుచున్
    *దినమధ్యంబున మ్రింగె రాహువు; శశిన్ దిక్కుల్ ప్రకాశింపగన్*
    కనినారందఱు పౌర్ణమీ తిథిని యాకాశంబునన్ నిండుగా.
    ---------దువ్వూరి రామమూర్తి.

    రిప్లయితొలగించండి
  7. అంబరీష చంద్రుల పయి యలుకకలిగి
    మిహురుని పలాశి రాహువు మ్రింగె పట్ట
    పగలె ; చంద్రుని రాహువు పట్టి మ్రింగె
    పౌర్ణమి దినము నందలి వసతి నందు

    రిప్లయితొలగించండి
  8. భాను నమవస తిథి యందు పంతముగను
    కేతు వ ను వాడు మ్రింగును కీడు సేయ
    పగలె : చంద్రుని రాహువు పట్టి మ్రింగె
    పున్నమీ నాటి రాత్రిలో పూర్తి గాను

    రిప్లయితొలగించండి

  9. అనిలో కవ్వడి రెచ్చిపోయి యరి సంహారమ్ము నే జేసినన్
    ఘనుడా భీష్ముని నిల్వరించుటదియే కష్టంబుగా దోచగా
    చని యాడంగిని వెంటదెచ్చి నరుడా జ్యాయాంసునిన్ గూల్చెనే
    దినమధ్యంబున మ్రింగె రాహువు శశిన్ దిక్కుల్ ప్రకాశింపఁగన్

    రిప్లయితొలగించండి
  10. పగలునొక కునుకునిడగ వచ్చె స్వప్న
    మెకటి చంద్రిక వెలుగుల మొలక పున్న
    మిన నభమునను తారల మిణుకులేను
    చంద్రగ్రహణంతొ కలయె చెదిరిపోయి
    పగలె చంద్రుని రాహువు పట్టి మ్రింగె

    రిప్లయితొలగించండి
  11. వినుమా వారిజ లోచనా ! యిదియ యావేశంబు లేకుండ గా
    దినమధ్యంబున మ్రింగె రాహువు శశిన్ దిక్కుల్ ప్రకాశింపగన్
    దినమధ్యంబన ,రాత్రియౌ యమెరి కాదేశంపు భూవాసికిన్
    కనుకన్ వారికిఁ గన్పడున్ నటుల నాకాలంబు వేరౌటనే

    రిప్లయితొలగించండి
  12. కోడి పందాల నాగమ్మ కుటిల మంత్రి
    రాహువు పగిది పల్నాటి గ్రహణ మాయె
    బాల చంద్రుని మరణము ప్రస్తుతించ
    పగలె చంద్రుని రాహువు పట్టి మ్రింగె

    రిప్లయితొలగించండి
  13. తేటగీతి
    అమృతపానమ్ము నాపిన దమనమునకు
    కక్షఁ దీర్చుకొనెడు మేటి దీక్షఁగొనుచు
    రెచ్చెనన్ గారణమనంగఁ గచ్చితముగఁ
    బగలె! చంద్రుని రాహువు పట్టి మ్రింగె! !

    మత్తేభవిక్రీడితము
    కనగా నీతడు బాలచంద్రుఁడె? పరాక్రాంతిన్ ప్రపూర్ణండెగా!
    మనలన్ గూల్చఁగ వచ్చెనంచు నరులున్ మార్కొన్న యుద్ధమ్మునన్
    గొనసాగింపక బాణ ఘాతములచే క్రూరంబుగన్ గ్రుచ్చుచున్
    దినమధ్యంబున మ్రింగె రాహువు శశిన్ దిక్కుల్ ప్రకాశింపఁగన్!

    రిప్లయితొలగించండి
  14. గగన తల మందుఁ జీఁకటి క్రమ్ము కొనఁగఁ
    దార లెల్ల డెందముల సంతాప మందఁ
    దద్ద కోపమ్ము సెలఁగ నంతమ్ము కాఁగఁ
    బగలె చంద్రుని రాహువు పట్టి మ్రింగె


    విన లే మక్కట నిట్టి మాటల నహో విజ్ఞానులే పల్కగం
    జనునే పల్కఁగ నిట్టు లార్యులకు నస్తవ్యస్త వాక్యమ్ములం
    గన నీ మాటలు తోఁచు చున్న యవి నిక్కం బెంచ నిబ్భంగినిన్
    దిన మధ్యంబున మ్రింగె రాహువు శశిన్ దిక్కుల్ ప్రకాశింపఁగన్

    రిప్లయితొలగించండి
  15. భానుడు వెలుగు పంచును ప్రతిదినమ్ము
    “పగలె ,చంద్రుని రాహువు పట్టి మ్రింగె”
    గ్రహణ సమయము నందున కమ్మె ధ్వాంత
    మవనిలో పౌర్ణమీ దినమందు గనుడు


    మరొక పూరణ


    వినుమోకూళసుయోధనాతగనియావేశమ్మిటన్ చూపి నా
    తనయున్ వ్యూహము పన్నిజం పితిరి చందం బంచు చూడుం డయో
    కనుడీఘోరమటంచునేడ్చెనటనక్కాంతాలలామంబొగిన్
    దినమధ్యంబున మ్రింగె రాహువు శశిన్ దిక్కుల్ ప్రకాశింపఁగన్”

    రిప్లయితొలగించండి