14, మే 2025, బుధవారం

దత్తపతి - 212

15-5-2025 (గురువారం)

కవిమిత్రులారా,

“నేపాలు - జపాను - చైన - ఇరాకు” 

(యడాగమంతో యిరాకు అనవచ్చు)

ఈ పదాలను ప్రయోగిస్తూ

భారతార్థంలో మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. కీచకుడు సైరంధ్రి తో...

    తేటగీతి
    వనిత! నీ బుగ్గ గిల్ల నే పాలుకారు
    పరువమున్ సంజ పానుపు మురిసిపోవ
    చేర్చి మంచైన కానెంచు సేమమొదవు
    రాలుగాయి రాకు మనకు రతినిఁ దేల!

    రిప్లయితొలగించండి
  2. వాసు దేవుడు బడలునే పాలు పిదికి
    కాని ధర్మజ పానుపు పైన జేరి
    విశ్రమించైన ముందుగా విజయుని గనె
    నోయి రాకున్నను దొలుతన్ సాయమడుగ

    రిప్లయితొలగించండి
  3. తే||గీ||
    పాండవులు దాయ తోడ 'నే పాలు' పంచు
    కొనగ నేర్పు వెర'జ పాను' కొనుట కొరకు
    కలిగిన చదువు కుర'చైన'' కతన భంగ
    ము దమప'యి రాకు' మని వారు మొనయసాగె

    రిప్లయితొలగించండి
  4. రాయబార సమయమున కృష్ణుడు ధృతరాష్ట్రునితో (అతడు పాండురాజుకు అన్న కనుక అగ్రజ వాడినాను)

    తే॥ సదమలమదినే పాలుచు సర్వ హితము
    నుగన నగ్రజ పానుకొనుమయ కనుచు
    గతపు మంచైనఁ గీడైనఁ గదలి చక్కఁ
    బరచ ముదమయి రాకుఁడు ప్రభలనొందు

    పాలుచు భాగము పంచు
    పానుకొను పూనుకొను
    రాకుడు సూర్యుడు (నిఘంటువు సహాయమండి)

    మరొక పూరణ అండి
    కృష్ణుడు రాయబార సమయంలో సుయోధనుని హెచ్చరించుట

    మ॥తగునే పాలును బంచఁ , బాండు సుతులన్ ధైర్యాది సంపన్నులన్
    దగునా యగ్రజ పానుకొన్న సమరాస్త్రమ్మెంచి కచ్చించఁగన్
    సెగలేలా కను ధార్తరాష్ట్రులకటుల్ క్షేమంబు నెంచైననున్
    బగ నష్టంబయి రాకుమార విను నీవంశమ్మె నాశమ్మగున్

    పానుకొను పూనుకొను కచ్చించు ఎదురించు

    పైదత్త పదులకు తేటగీతి ముదము. లేకుంటే మ॥ కాని శా॥ కాని ప్రయత్నించాలి మ॥ ప్రయత్నించానండి

    రిప్లయితొలగించండి
  5. ఆజిఁ నే పాలుగొననంటి నదినిజమ్ము
    గాని యోరాజ పానుకోగలను రథఁపు
    చోదనమునందు మంచైన చూడ్కి దెల్పు
    మోయి రాకుమారా నీకు నొప్పిదమ్మ?

    రిప్లయితొలగించండి
  6. *(ధర్మరాజు కృష్ణునితో పలికిన మాటలుగా)*

    నీ జపాను రక్తులమోయి నీరజాక్ష
    పాలకు డొసగునే పాలు బావ మాదు
    పొక్కులనికనుంచైన విముక్తి జేయ
    పోయి రాకురు సభకంటి పుణ్యచరిత.

    రిప్లయితొలగించండి
  7. కోరు చుంటి నే పాలును కురు వరేణ్య
    యది యె మంచైన మార్గమీ యవని యందు
    వలదు రుజ పానుపు మనకు వాంఛ తోడ
    రణము న కయి రాకు మో రాజ రాజ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాలుగవ పాదంలో రణమున కయి రాకు మిపుడు రాజ రాజ అని సవరణ చేయడమైనది

      తొలగించండి
  8. ద్యుతలజ పానుజ కృష్ణా
    నతి తతినే పాలు సేయ నలిన దళాక్షా
    గతి వైనం ద్రాచైనఁ గు
    పిత వయి రాకు మన మరలి వెడలదె కన్నా

    రిప్లయితొలగించండి
  9. పోయిరాకురువీరుల బుద్ధిమార్చు
    కౌరవపతినేనేపాలుకావలెనని
    నీజపానువర్తుడి నైననేనడిగితి
    ననుము మంచైనను చెడైన నదియెమేలు

    రిప్లయితొలగించండి