27-5-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలు సేవింపుఁడనె గాంధి గాదనఁగలవా”
(లేదా...)
“కలు సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా”
కందంతెలవారు స్వార్థపరులైప్రలోభములకు గురిచేయ పాల్గొనకుండన్విలువలెరిగి జావగ నూకలు సేవింపుఁడనె గాంధి గాదనఁగలవా?మత్తేభవిక్రీడితముతెలవారల్ మన దేశ సంపదలతో దేదీప్యమానంబుగన్వెలుగంగన్ నిరతంబు దోచుకొన చూపించన్ ప్రలోభమ్ములన్విలువల్ ముఖ్యమటంచు దేశమున భక్తిన్ జావ చాలంచు నూకలు సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా!
అలపు నెరుగకుండుటకయికలిసిన మిత్రులను గూడి కాలక్షేపంసలుపగ , వేయించిన శన గలు సేవింపుఁడనె గాంధి , గాదనఁగలవా
వలదిక మతమౌఢ్యమని ప్రజలన్న దమ్ముల వలెనిల సంభావనతో మెలగుచు శ్రీరాముని తురకలు సేవింపుఁడనె గాంధి గాదనఁగలవా.వలదీ దాస్యము స్వేచ్ఛ కావలయు సౌభాగ్యంబదే కావునన్ ఖలు లాంగ్లేయుల పాఱనొత్తుటదియే కర్తవ్యమై సాగగన్ కులభేదమ్ములు వీడు, సంపదలు లేకున్నన్ జనాలెల్ల నూకలు సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా.
వలదా మాంసాహారముతలపగ శక్తినిడునె తృణ ధాన్యము కంటెన్బలమొసగు గింజలను నూకలు సేవింపుఁడనె గాంధి గాదనఁగలవాకలదా గింజల కంటె పుష్టికరమై గట్టిల్లు నాహారమేవలదేమాత్రము మాంస భక్షణము సంప్రాప్తంబులౌ ధాన్యముల్బలమున్ గూర్చెడి కూరగాయలు సహా ప్రాణంబులన్ నిల్పు నూకలు సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా
తలపన్ వచ్చె ప్రపంచ యుద్ధమిపుడున్ దన్నవ్వగా పాలకుల్విలసిల్లంగను స్వేచ్చనిచ్చు మనకున్ వెయ్యేల సాయంబు లోకుల ధర్మంబగు గాన మిమ్ముననికై కోరంగ నాంగ్లేయ మూకలు సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కం॥ తొలఁగఁగ విదేశ పాలనవలచి స్వదేశ వలువలనె పరిణితిఁ బడయన్బిలుపు నొసంగి యిచటి కోకలు సేవింపుఁడనె గాంధి గాదనఁగలవా!మ॥ వలపుల్ మీర స్వదేశ వస్తువులు సంభావించుచున్ సర్వదాపొలుపున్ బూని విదేశ వస్తువులు సంపూర్ణమ్ముగన్ వీడఁగన్బిలుపున్ జేసె తిరస్కరించుటయె సంవేద్యమ్ము చేనేత కోకలు సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమాకోక వస్త్రముకోకలు సేవించు (ఉపయోగించు అర్థముతో వాడినానండి) దోషమైతేకం॥ తొలఁగఁగ విదేశ పాలనవలచి స్వదేశ విలువలను బరిణతిఁ బడయన్బిలిచెను నిరసనఁ గని యల్కలు సేవింపుఁడనె గాంధి గాదనఁగలవా!మ॥ వలపుల్ మీర స్వదేశ వస్తువులు సంభావించుచున్ సర్వదాపొలుపున్ బూని విదేశ వస్తువులు సంపూర్ణమ్ముగన్ వీడుచున్ జలియించంగఁ దిరస్కరించి వరలన్ సత్యాగ్రహోత్పన్న యల్కలు సేవించు డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా
ఇలలో తరగని స్వాస్థ్యమునెలకొల్పఁగ వెరవిదెయని నిరతము మనుజుల్తెలివిడితో పాలకు మేకలు సేవింపుఁడనె గాంధి గాదనఁగలవా
కలుషంబుల్గనరాని దుగ్ధమది మేకల్ బెంచగా లభ్యమౌవిలువంగట్టగ శక్యమే జనులకున్ విత్తంబుతోదాని? మేకలు గోవుల్ మనుజాళి కెల్లరకు సౌఖ్యంబున్ ప్రసాదించు మేకలు సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా
కం:"తలతుము గోమాతనె,మేకల పాలే శ్రేష్ఠ మనుచు కమ్మగ గొని తల్లుల తో సమములు గా మేకలు! సేవింపుఁ"డనె గాంధి గాదనఁగలవా”
తులువలు నాంగ్లేయుల తో చెలువము గా జట్టు గట్టి చేరితిరి గదా పలు విధ ముల వార ల కో కలు సేవింపు డనె గాంధి గాదన గలవా?
మ;పలు రోగమ్ముల బాపి స్వాస్థ్య మొసగున్ పాలిచ్చి, నే నెంచ గోవులకున్ సాటియె మేక తల్లి యనుచున్, పోదోలు డేహ్యమ్ము హింసల బాధింపకు డట్టి తల్లిని నమస్కారార్హహలే యౌను మేకలు, సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా”
కలిగిన దుర్భరముగ బాధలు మీకున్ మిత్రు లార తఱుఁగుటకై రాహు లనం దా విఖ్యాతుఁడు కలు సేవింపుఁ డనె గాంధి గా దనఁ గలవా అల సత్యాగ్రహ ముండ రక్షణకు నన్యాయమ్ము నాపంగ క్ష్మాతలమం దింపుగ వీడు సందియము డెందం బందు నిర్భీతి వంతలు వాటిల్లిననున్ నిరంతరము సత్యమ్మున్, విసర్జించి వంకలు, సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా
కం.బలమును గలుగగ జేసెడికలిమిని నిండుగ కలిగిన కమ్మని రుచితో మెలగెడి మొలిచిన పలు మొల కలు సేవింపుడనె గాంధి గాదన గలవా ?
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.బలమునకు పప్పులు తినగపిలుపు నిడెను చౌక యనుచు పేదలకెల్లన్విలువ తెలిసి జావగ నూకలు సేవింపుడనె గాంధి గాదనఁ గలవా?
కందం
రిప్లయితొలగించండితెలవారు స్వార్థపరులై
ప్రలోభములకు గురిచేయ పాల్గొనకుండన్
విలువలెరిగి జావగ నూ
కలు సేవింపుఁడనె గాంధి గాదనఁగలవా?
మత్తేభవిక్రీడితము
తెలవారల్ మన దేశ సంపదలతో దేదీప్యమానంబుగన్
వెలుగంగన్ నిరతంబు దోచుకొన చూపించన్ ప్రలోభమ్ములన్
విలువల్ ముఖ్యమటంచు దేశమున భక్తిన్ జావ చాలంచు నూ
కలు సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా!
అలపు నెరుగకుండుటకయి
రిప్లయితొలగించండికలిసిన మిత్రులను గూడి కాలక్షేపం
సలుపగ , వేయించిన శన
గలు సేవింపుఁడనె గాంధి , గాదనఁగలవా
రిప్లయితొలగించండివలదిక మతమౌఢ్యమని ప్ర
జలన్న దమ్ముల వలెనిల సంభావనతో
మెలగుచు శ్రీరాముని తుర
కలు సేవింపుఁడనె గాంధి గాదనఁగలవా.
వలదీ దాస్యము స్వేచ్ఛ కావలయు సౌభాగ్యంబదే కావునన్
ఖలు లాంగ్లేయుల పాఱనొత్తుటదియే కర్తవ్యమై సాగగన్
కులభేదమ్ములు వీడు, సంపదలు లేకున్నన్ జనాలెల్ల నూ
కలు సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా.
వలదా మాంసాహారము
రిప్లయితొలగించండితలపగ శక్తినిడునె తృణ ధాన్యము కంటెన్
బలమొసగు గింజలను నూ
కలు సేవింపుఁడనె గాంధి గాదనఁగలవా
కలదా గింజల కంటె పుష్టికరమై గట్టిల్లు నాహారమే
వలదేమాత్రము మాంస భక్షణము సంప్రాప్తంబులౌ ధాన్యముల్
బలమున్ గూర్చెడి కూరగాయలు సహా ప్రాణంబులన్ నిల్పు నూ
కలు సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా
తలపన్ వచ్చె ప్రపంచ యుద్ధమిపుడున్ దన్నవ్వగా పాలకుల్
రిప్లయితొలగించండివిలసిల్లంగను స్వేచ్చనిచ్చు మనకున్ వెయ్యేల సాయంబు లో
కుల ధర్మంబగు గాన మిమ్ముననికై కోరంగ నాంగ్లేయ మూ
కలు సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం॥ తొలఁగఁగ విదేశ పాలన
తొలగించండివలచి స్వదేశ వలువలనె పరిణితిఁ బడయన్
బిలుపు నొసంగి యిచటి కో
కలు సేవింపుఁడనె గాంధి గాదనఁగలవా!
మ॥ వలపుల్ మీర స్వదేశ వస్తువులు సంభావించుచున్ సర్వదా
పొలుపున్ బూని విదేశ వస్తువులు సంపూర్ణమ్ముగన్ వీడఁగన్
బిలుపున్ జేసె తిరస్కరించుటయె సంవేద్యమ్ము చేనేత కో
కలు సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా
కోక వస్త్రము
కోకలు సేవించు (ఉపయోగించు అర్థముతో వాడినానండి) దోషమైతే
కం॥ తొలఁగఁగ విదేశ పాలన
వలచి స్వదేశ విలువలను బరిణతిఁ బడయన్
బిలిచెను నిరసనఁ గని య
ల్కలు సేవింపుఁడనె గాంధి గాదనఁగలవా!
మ॥ వలపుల్ మీర స్వదేశ వస్తువులు సంభావించుచున్ సర్వదా
పొలుపున్ బూని విదేశ వస్తువులు సంపూర్ణమ్ముగన్ వీడుచున్
జలియించంగఁ దిరస్కరించి వరలన్ సత్యాగ్రహోత్పన్న య
ల్కలు సేవించు డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా
ఇలలో తరగని స్వాస్థ్యము
రిప్లయితొలగించండినెలకొల్పఁగ వెరవిదెయని నిరతము మనుజుల్
తెలివిడితో పాలకు మే
కలు సేవింపుఁడనె గాంధి గాదనఁగలవా
కలుషంబుల్గనరాని దుగ్ధమది మేకల్ బెంచగా లభ్యమౌ
రిప్లయితొలగించండివిలువంగట్టగ శక్యమే జనులకున్ విత్తంబుతోదాని? మే
కలు గోవుల్ మనుజాళి కెల్లరకు సౌఖ్యంబున్ ప్రసాదించు మే
కలు సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా
కం:"తలతుము గోమాతనె,మే
రిప్లయితొలగించండికల పాలే శ్రేష్ఠ మనుచు కమ్మగ గొని త
ల్లుల తో సమములు గా మే
కలు! సేవింపుఁ"డనె గాంధి గాదనఁగలవా”
తులువలు నాంగ్లేయుల తో
రిప్లయితొలగించండిచెలువము గా జట్టు గట్టి చేరితిరి గదా
పలు విధ ముల వార ల కో
కలు సేవింపు డనె గాంధి గాదన గలవా?
మ;పలు రోగమ్ముల బాపి స్వాస్థ్య మొసగున్ పాలిచ్చి, నే నెంచ గో
రిప్లయితొలగించండివులకున్ సాటియె మేక తల్లి యనుచున్, పోదోలు డేహ్యమ్ము హిం
సల బాధింపకు డట్టి త
ల్లిని నమస్కారార్హహలే యౌను మే
కలు, సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా”
కలిగిన దుర్భరముగ బా
రిప్లయితొలగించండిధలు మీకున్ మిత్రు లార తఱుఁగుటకై రా
హు లనం దా విఖ్యాతుఁడు
కలు సేవింపుఁ డనె గాంధి గా దనఁ గలవా
అల సత్యాగ్రహ ముండ రక్షణకు నన్యాయమ్ము నాపంగ క్ష్మా
తలమం దింపుగ వీడు సందియము డెందం బందు నిర్భీతి వం
తలు వాటిల్లిననున్ నిరంతరము సత్యమ్మున్, విసర్జించి వం
కలు, సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా
కం.
రిప్లయితొలగించండిబలమును గలుగగ జేసెడి
కలిమిని నిండుగ కలిగిన కమ్మని రుచితో
మెలగెడి మొలిచిన పలు మొల
కలు సేవింపుడనె గాంధి గాదన గలవా ?
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
బలమునకు పప్పులు తినగ
పిలుపు నిడెను చౌక యనుచు పేదలకెల్లన్
విలువ తెలిసి జావగ నూ
కలు సేవింపుడనె గాంధి గాదనఁ గలవా?