కం:ముఖముల తేజపు లేమియు నఖండ మైనట్టి మందహాసపు లేమిన్ ముఖ వేదాంతపు యోగులు సుఖలౌల్యులు ,యోగులెల్లఁ జూడరు ముక్తిన్” (నిజమైన యోగికి ఒక తేజస్సు ఉంటుంది.అతని ముఖం పై మందహాసం ఉంటుంది.అవి లేని వాచా వేదాంతపు యోగులు సుఖ లౌల్యులే అయ్యుంటారు. అందరు యోగులు ముక్తి గాంచే వారు కారు.కొందరే అసలైన యోగులు.)
అఖిల జగత్తున యోగుల
రిప్లయితొలగించండిముఖముల గనిపించు చుండు ముక్తిన యితమే
సుఖమును జవిగొన నెంచెడు
సుఖలౌల్యులు యోగులెల్లఁ జూడరు ముక్తిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ముక్తిన యితమే' ?
🙏. ముక్తి నందు హితము ( తప్పయితే క్షమించండి )
తొలగించండి
రిప్లయితొలగించండినిఖిల జగమ్ముల నేలెడి
యఖిలాండేశ్వరుని గొలువ నాజానమునం
దఖిలార్థములచటను గల
సుఖలౌల్యులు యోగులెల్లఁ , జూడరు ముక్తిన్.
అఖిలాండమ్ముల నేలు వాడొకడటంచా హంసనే గొల్వగన్
సుఖదుఃఖమ్ముల లెక్కజేయరుగదా చోద్యంబదే గాంచగా
నఖిలార్థంబులు లభ్యమౌ స్థలమదే యాజానమున్ దక్కెడిన్
సుఖలౌల్యుల్ గద , యోగులెల్లరు ముముక్షుల్ గారు ముమ్మాటికిన్.
మ.
రిప్లయితొలగించండిశిఖి బర్హంబును దాల్చు కేశవుడు సచ్చిద్యోగమార్గంబుఁ దా
సఖుడై యింపుగఁ జేరి వీరికయి ప్రాంచత్బోధగాఁ జెప్పినన్
ముఖ సౌందర్యపు కాంతలం గనుచు సమ్మోహంబులో మున్గిరీ
సుఖలౌల్యుల్ గద ? యోగులెల్లరు ముముక్షుల్ గారు ముమ్మాటికిన్ !
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅఖిలాత్ముని సేవించుచు
రిప్లయితొలగించండిసుఖముల నన్నియు ద్యజించు శుద్ధులు యోగుల్
నిఖిలము గాంచగ నేడిట
సుఖలౌల్యులు యోగులెల్లఁ జూడరు ముక్తిన్
అఖిలాత్ముండగువాని భక్తియుతులై యర్చించు వారేగదా
సుఖభోగాలను వీడి నిత్య తపమున్ శోభిల్లు సన్యాసులౌ
సుఖభోగాలకు లొంగి నేడు మనకున్ జూపట్టు విఖ్యాతులే
సుఖలౌల్యుల్ గద, యోగులెల్లరు ముముక్షుల్ గారు ముమ్మాటికిన్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండినిఖిల ము తానే యగుచు ను
రిప్లయితొలగించండిసఖిని గ సాయమ్ము జేయు సర్వేశ్వరు నిన్
ముఖమును మదిలో ని లు ప ని
సుఖ లౌ ల్యు లు యోగులెల్ల జూడరు ముక్తి న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సఖిని గ' ?
స ఖు ని గ
తొలగించండికం॥ సఖుఁడుగ సుజనులఁ గావ స
రిప్లయితొలగించండిముఖమున ధరను హరి యుండ ముదముగఁ గనుచున్
నిఖిలాత్ము సతతముఁ దనయు
సుఖలౌల్యులు యోగులెల్లఁ జూడరు ముక్తిన్
మ॥ అఖిలాండంబును రక్షఁ జేయు హరి దైత్యాన్తమ్ముఁ గావించఁగన్
సఖుఁడై ధాత్రిని సజ్జనాఢ్యులకటుల్ జన్మించ సంప్రీతితో
నిఖిలాత్ముండనుఁ గాంచి నెమ్మిఁ బడయన్ నిత్యమ్ము భావించెడిన్
సుఖలౌల్యుల్ గద యోగులెల్లరు ముముక్షుల్ గారు ముమ్మాటికిన్
భగవంతుడే భూమిపైన నుంటే మోక్షమెందుకు అనే భావనతోనండి
నిఖిల జగమ్ములనేలుచు
రిప్లయితొలగించండిసఖుడై భక్తులను గాఁచు సర్వేశ్వరునిన్
సుఖములనిమ్మని కొలిచెడు
సుఖలౌల్యులు యోగులెల్లఁ జూడరు ముక్తిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసఖుడై భక్తులపాలి సంతతము కష్టమ్ముల్ నివారించుచున్
రిప్లయితొలగించండియఖిలంబౌ జగమేలు మాధవుని హేయంబైన దుర్బుద్ధితో
సుఖముంగోరుచు సల్పు నర్చనములన్ చోద్యంబులన్ సేయునా
సుఖలౌల్యుల్ గద యోగులెల్లరు ముముక్షుల్ గారు ముమ్మాటికిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిముఖసౌందర్యము జూతురు
రిప్లయితొలగించండిసుఖలౌల్యులు, యోగులెల్ల జూడరు ముక్తిన్
సుఖమరయ, విభుని కొలువె ప్ర
ముఖముగ తప్పించి నికటముగ చేరంగన్
కం:ముఖముల తేజపు లేమియు
రిప్లయితొలగించండినఖండ మైనట్టి మందహాసపు లేమిన్
ముఖ వేదాంతపు యోగులు
సుఖలౌల్యులు ,యోగులెల్లఁ జూడరు ముక్తిన్”
(నిజమైన యోగికి ఒక తేజస్సు ఉంటుంది.అతని ముఖం పై మందహాసం ఉంటుంది.అవి లేని వాచా వేదాంతపు యోగులు సుఖ లౌల్యులే అయ్యుంటారు. అందరు యోగులు ముక్తి గాంచే వారు కారు.కొందరే అసలైన యోగులు.)
కందం
రిప్లయితొలగించండినిఖిలమెరుగ విశ్వదయే
యఖిలము వేమనకు, సిద్ధుఁడనతుదకంత
ర్ముఖుఁడై, మోహము విడకయె
సుఖలౌల్యులు యోగులెల్లఁ జూడరు ముక్తిన్
మత్తేభవిక్రీడితము
నిఖిలమ్మాదెసఁ జూడ విశ్వదయె సాన్నిధ్యమ్ము వేమన్నకే
యఖిలంబందున జూచె నామె సొగసుల్! హ్లాదానమగ్నుండునై!
సఖియే సత్యము దెల్పయోగమమరెన్! సద్యోగ పూర్వమ్మునన్
మ:సుఖమౌ నిద్రయు ,స్వాస్థ్యమున్ బడయనే శోచించుచున్ లౌక్యమౌ
రిప్లయితొలగించండిసుఖమే కోరుచు తత్త్వ మింతయు మదిన్ జూడన్ విచారించకే
ముఖముల్ జూచుచు నాసనమ్ముల కడున్ మోదమ్ముతో జేసినన్
సుఖలౌల్యుల్ గద! యోగులెల్లరు ముముక్షుల్ గారు ముమ్మాటికిన్”
(కొందరు యోగా చేసినా అది కేవలం ఆరోగ్యం కోసమే చేస్తారు కానీ తాత్త్వికత ఉండదు.వారు సుఖలోలులే అవుతారు.)
సఖు లొసఁగ విత్తమును గో
రిప్లయితొలగించండిముఖ శార్దూలురను బోలి పొగడఁగ జనులే
మఖ శతము సేసినను గా
సుఖ లౌల్యులు యోగు లెల్లఁ జూడరు ముక్తిన్
మఖ సందోహము పేరునన్ ధనము సంపాదించి ధాత్రీ తల
మ్ము ఖగోళమ్మును నిండఁ దేలుచు నిలన్ భోగమ్ములన్ దైవ స
మ్ముఖమం దక్కట సత్య దూరు లగుచున్ బోధించినన్ నీతులన్
సుఖ లౌల్యుల్ గద యోగు లెల్లరు ముముక్షుల్ గారు ముమ్మాటికిన్