15, మే 2025, గురువారం

న్యస్తాక్షరి - 87

16-5-2025 (శుక్రవారం)

కవిమిత్రులారా,

దేశరక్షణా భారాన్ని వహిస్తున్న సైనికులను కీర్తిస్తూ 

చంపకమాలలో పద్యం వ్రాయండి

1వ పాదం 4వ అక్షరం 'జ'

2వ పాదం 12వ అక్షరం 'న్మ'

3వ పాదం 14వ అక్షరం 'భూ'

4వ పాదం 18వ అక్షరం 'మి'

(లేదా...)

పై అక్షరాలను వరుసగా పాదాదిలో న్యస్తం చేస్తూ ఆటవెలది పద్యం వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. తనభుజ శక్తి రాజ్యముకు త్రాణము గా విలసిల్లి యుండగా
    జనులకు రక్షణంబునిడు జన్మము తప్పక సార్థకమ్మగున్
    దినకరుఁ బోలు సైనికులె దేశవి భూషణ రత్నదీపికల్
    పనిగొని పూరగింతురిట భారత పౌరుల కామితంబులన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనని రక్షణమున తనశక్తి నొడ్డ జ
      న్మ తరియించుఁ గాదె మహిని జన్మ
      భూమి కొరకు ప్రాణములు విడిచినపుడు
      మిసమిసమను దివము పొసగునంద్రు

      తొలగించండి
  2. భరత జనాళి రక్షణఁపు భారముఁ జేకొను వీరసైనికా
    సరియెవరయ్య నీకిలను జన్మము సార్ధకమైనదయ్య సం
    బరమున జైజవాననుచు బల్కుచు భూజనులెల్ల మెచ్చగన్
    చిరయశ మొందుమయ్య వికసించగ నెల్లరి కామితార్థముల్

    రిప్లయితొలగించండి

  3. ఆ.వె.
    జనని భరత భూమి సత్కథల విని త
    న్మయుడ నైతినోయి మహిని జన్మ
    భూమి కక్షకుడవు పుణ్య చరితవీవు
    మిగుల ధన్యుడవని మిమ్ము గొలతు.

    చం.
    ఘనవిజయమ్ము పొందవలె కానల కొండలలో చరించుచున్
    జనులను రక్షజేయు బలి జన్మమె ధన్యమటంచు
    నెప్పుడున్
    వినయము తోడ కొల్చెదను పృథ్వికి భూరిగ సేవజేసి నీ
    వనిశము మార్గదర్శివగు హంసవు దేహిని ప్రేమికుండవౌ.

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. నేటి న్యస్తాక్షరికి నా ప్రయత్నం

      ఆ॥ జనని జన్మభూమి సర్వమనుచును జ
      న్మఁ గనిన ధరరక్ష మాది యనుచు
      భూరి మనము నొదవి పోరు సైనికులక
      మిత ప్రణతుల నిడుచు మెచ్చు నాడు

      చం॥ సరసిజ నేత్రు దీవెనల సౌఖ్యము నొందుచు దేశ రక్షకై
      సరగున సిద్ధమొందు నిజ జన్మము ధన్యము శత్రు మూకలన్
      బరిపరి చెండు సైనికులు భారత భూమికి ముద్దు బిడ్డలై
      పరఁగుచునుంద్రు మన్ననల భాసిలి ధైర్యపు లేమిఁ గాంచకన్

      నాడు దేశము

      తొలగించండి
  5. ఆ||వె||

    జగడమందు దేశ శరణముగోరి జ
    న్మమును వీడు చుండి మరణ మొంది
    భూమి ఋణము దీర్చ బొసగు విధముగ న
    మితపు ధృతిని జూపు మీకు ప్రణతి

    రిప్లయితొలగించండి
  6. ఆ.వె:జన్మ నిచ్చినట్టి జననిని వీడి జ
    న్మమ్ము దేశ మనెడు నమ్మ కొరకె,
    భూమి యించు కైన పోక నడ్డుగ ప్రాణ
    మిడుదు ననెడు వీర!యిదె నమస్సు.

    రిప్లయితొలగించండి
  7. 2)చం:తన భుజ మందు బిడ్డ వలె దాల్చి తుపాకిని,కన్న బిడ్డలన్,
    జననిని,భార్య వీడి తన జన్మము,మృత్యువు దేశమాతకే
    యనుకొని స్వంత భూమి వలె యద్రిని,భూమిని గాచు వీరు నే
    మని స్తుతియించు నెంతటి మహాకవి ?వర్ణన మేమి సాధ్యమౌ?

    రిప్లయితొలగించండి
  8. జయము బొంద నెంచి శత్రువు న ణ చ జ
    న్మంబు నెత్తి నాడ మానవుడు గ
    భూరి శక్తి జూపి పోరాడ దేశమ్ము
    మిగుల సంత సించు మేర లేక

    రిప్లయితొలగించండి
  9. జన్మ మన్న ధైర్య సాహస వీర జ
    న్మ మని చాటి చెప్ప మానితముగ
    భూరి భరత నామ భూమిలోఁ బొందితి
    మి కనుఁ డంచు భటులు మీఱి రాజి


    ధరణి జనించి భారత నితాంత విశిష్ట చమూ సమూహ మం
    దరి కరి కోటి సింహ గణ మన్మహిమాన్విత వీర రాసులై
    సురుచిర ధైర్య సాహస విశుద్ధ విభూతి సమేత శూరులై
    కరము వెలింగి రాజి నిజ కాంతుల శాత్రవ భూమిఁ గాంచుఁడీ

    రిప్లయితొలగించండి
  10. ఆటవెలది
    జయమపజయమనక సైనికులెల్ల జ
    న్మము తరింప పోరునదిగి.,జన్మ
    భూమి స్వర్గమునకు పోలదనుచు, కడు
    మిన్నయనుచు దలఁచి, మెరయువారు

    చంపకమాల
    మదిని జయమ్ము నోటముల మాయలఁ జిక్కక యుద్ధమందునన్
    సదమల దేశభక్తిఁ దమ జన్మము ధన్యమొనర్చు దృష్టిమై
    పదునగు పాటవమ్ముల విపత్కర భూమికలెన్నొవైచి మో
    క్షదమని త్యాగమెంచెదరు సైనికులంచన భూమికోసమై!

    రిప్లయితొలగించండి
  11. చం. మా.
    గజగజలాడ శాత్రవులు క్షాత్రము జూపి మహాస్త్రశక్తితో
    విజయ విహారమూనిరట విన్మదె భారత సింహ గర్జనల్
    భుజబల వీర విక్రమ రిపుంజయ భూరి యశోధనుల్ భళా
    సుజనులహో జవానులకు జోతలు భారత భూమికిన్ సదా

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    జయము నొందిన మన సైనికుల గని త
    న్మయము నొందె భరతమాత మిగుల
    భూరి దేశ జనులు మోదమున్ బల్కిరి
    మీకు సాటి యెవరు మీరె యనుచు.

    రిప్లయితొలగించండి
  13. జన్మభూమి యన్న జనని సమమని త
    న్మనముల తలచమని మాత సుతుకు
    భూరి తిలకమిడుచు పోయి రమ్మనుచును
    మిగుల మమత తోడ మేను నిమిరె.


    జనని జవమ్ముగా నుదుట చక్కని బొట్టునుతాను దిద్దుచున్
    జనుము సుపుత్ర దేశమిది జన్మనొసంగెనటంచుమర్వకన్
    ననిశము సేవ చేయుచును నందుము భూరి యశమ్ము పోరునన్
    మనమున భక్తి భావమును మానుగ మ్రొక్కుము స్వామి కిన్వడిన్

    రిప్లయితొలగించండి