19, సెప్టెంబర్ 2025, శుక్రవారం

సమస్య - 5249

20-9-2025 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కూపభేకప్రగల్భముల్ గొప్పవి కద”

(లేదా...)

“ఒనరఁగఁ గూపభేకగతి నుండి ప్రగల్భములాడు టొప్పగున్”


6 కామెంట్‌లు:

  1. సమస్య:
    "ఒనరఁగఁ గూపభేకగతి నుండి ప్రగల్భములాడు టొప్పగున్”

    చం.మా :

    కనగను లేవు కూపములు కప్పలబోలుజనంబు లేరులే
    మనగను మోసమే భళిర మానసమందున కుత్సితంబులే
    అనయము ధర్మమే మఱచి యాపద సేయుగ తోటివారికిన్
    "నొనరఁగఁ గూపభేకగతి నుండి ప్రగల్భములాడు టొప్పగున్”

    రిప్లయితొలగించండి
  2. చ.
    ఘనకపి కేతన ప్రకట కమ్ర శతాంగ విరాజమాన శూ
    ర నరుడు తూపులేయగ కరంబున వింటిని వీడి యంగరా
    జు నిశిని పోలు మారెను, యశోనిధి యీల్గెను పోరు, నింటిలో
    నొనరగ కూపభేకగతి నుండి ప్రగల్భములాడు టొప్పగున్ !

    రిప్లయితొలగించండి
  3. ఉన్నతమగు స్థితిన నుండి యొదుగుటయును 
    కూపభేకప్రగల్భముల్ గొప్పవి కద
    పుడమి యందు మనుజ గుణములను గాంచ 
    వేరు వేరగు విధములు‌ ; వింత గొలుపు

    రిప్లయితొలగించండి
  4. తేటగీతి
    కోటబైటకు పుల్లెలు కోట్లువిసరి
    శత్రురాజును భయపెట్టి సాగనంపి
    రణము వారించి నారన ప్రజ్ఞ కాదె!
    కూపభేకప్రగల్భముల్ గొప్పవి కద!

    చంపకమాల
    మునిగెదమంచు విజ్ఞతను పుల్లెలఁ గోట్లుగ బైటవేయ, లో
    ననుగల కాల్బలమ్ములను నమ్ముచు భీతిని శత్రుసైన్యముల్
    వెనుకకు సాగిపోయిరట వీడియు కోటను! మేటి వ్యూహమే
    యొనరఁగఁ గూపభేకగతి నుండి ప్రగల్భములాడు టొప్పగున్!

    రిప్లయితొలగించండి


  5. *(కర్ణునితో శల్యుని మాటలుగా)*


    అనఘుడైన కుంతి కనిష్టుడర్జునుడను
    గెలువగను లేవు సారథి కృష్ణుడుండ
    నర్భకులకును కన నిస్సహాయులకును
    కూపభేకప్రగల్భముల్ గొప్పవి కద.


    వినుమిది యంగరాజ పురవీధులలో తిరు గాడెడ ల్పమౌ
    శునకమగోకసమ్ము దెగజూచుట సాధ్యము కానిరీతి నీ
    వనఘుడు సవ్యసాచినిట యంకమునన్ గెలువంగ జాలవే
    యొనరఁగఁ గూపభేకగతి నుండి ప్రగల్భములాడు టొప్పగున్.

    రిప్లయితొలగించండి
  6. దినమణి యట్లు వెల్గుచును దివ్యరథంబున ద్రోణశిష్యుడౌ
    ఘనుడు కిరీటి యుద్ధమున కర్ణుని పైకి శరంబు లేయగన్
    ధనువును వీడె భానుజుడు ధాటికి తాళక పోరు నింటిలో
    నొనరగ కూపభేకగతి నుండి ప్రగల్భములాడు టొప్పగున్

    రిప్లయితొలగించండి