8, సెప్టెంబర్ 2025, సోమవారం

సమస్య - 5238

9-9-2025 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తనకె తా మ్రొక్కి మోదంబుఁ గనును మిగుల”

(లేదా...)

“తనకే తాను నమస్కరించు కొని మోదంబందు నత్యంతమున్”

(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

7 కామెంట్‌లు:

  1. మ.
    ఘన బృందారక సేవ్య కృష్ణ విలసత్కమ్ర ప్రలీలా నివా
    సనమౌ భాగవతంబు నేర్చి కవి విస్ఫారోద్విశిష్టంబునౌ
    గుణముల్ కల్గు కవిత్వ లాస్యములఁ, దెన్గున్ మెచ్చి శ్రీఘ్రంబ పో
    తనకే తాను నమస్కరించు కొని మోదంబందె నత్యంతమున్ !

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. తేటగీతి
      కృష్ణ పరమాత్మ సాక్షాత్తు విష్ణువనుచు
      లోకమెల్లను మ్రొక్కంగ మోకరిల్లి
      వాసుదేవుండు తానని పౌండ్రకుండు
      తనకె తా మ్రొక్కి మోదంబుఁ గనును మిగుల

      మత్తేభవిక్రీడితము
      ఘనులే మ్రొక్కఁగ దివ్యరూపుడనుచున్ గావంగ రమ్మంచు మా
      మనసే నీదని మ్రొక్కఁగన్ హరిగ సన్మానించి శ్రీకృష్ణుఁ దా
      నన గృష్ణుండని పౌండ్రకుండు స్వపదారాధ్యానురక్తుండునై
      తనకే తాను నమస్కరించు కొని మోదంబందు నత్యంతమున్

      తొలగించండి
  3. ధనమును గడించుటందున దనను మించి
    పుడమి పయిన నింకెన్నడు పుట్టడనుచు
    దలచి , తనకె తా మ్రొక్కి మోదంబుఁ గనును ,
    మిగుల స్వార్థపరుడతడు మేదినిపయి

    రిప్లయితొలగించండి

  4. *(పరశు రాముడు, శ్రీరాముడు ఇరువురూ విష్ణ్వవతారులే అంటే ఇరువురొక్కటే అను భావముతో...)*

    కినుక బూని చేరిన యట్టి మునికి వినయ
    మందున నమస్కరించెనె యనఘు డైన
    దాశరథియన విబుధుడు తలచె నిటుల
    తనకె తా మ్రొక్కి మోదంబుఁ గనును మిగుల


    ఘనమౌ శంకర చాపమే యచట భగ్నంబైన యావెంటనే
    ముని యా భార్గవ రాముడే కినుకతో పూజ్యుండు కామారిదౌ
    ధనువున్ ముక్కలు సేసె నెవ్వడనుచున్ దానడ్గగా రాముడే
    తనకే తాను నమస్కరించు కొని మోదంబందు నత్యంతమున్.

    రిప్లయితొలగించండి
  5. విశ్వమంతయు తానైన విష్ణుమూర్తి
    సర్వ జీవులందుంటయు సత్యముగద
    పరగి మానవ రూపాన భక్తుడగుచు
    తనకె తా మ్రొక్కి మోదంబుఁ గనును మిగుల

    ధనమేమాత్రము లేని వాడు ఋణమున్ ధైర్యంబుగా గైకొనెన్
    మనసే వేగిరపాటునొంది నపుడే మారాజు చందంబుగా
    ఘనకార్యంబనఁ గట్టె నొక్క గృహమున్ గష్టాలతో నా నికే
    తనకే తాను నమస్కరించు కొని మోదంబందు నత్యంతమున్

    రిప్లయితొలగించండి
  6. అన్ని రంగా ల లో నేనె యా డ్యు డనుచు
    విఱ్ఱ వీగుచు మసలె డు వెర్రి వాడు
    తనకు తా మ్రొ క్కి మోద ంబు గనును మిగుల
    తనను మించ గ లేరంచు తలచి గాదె

    రిప్లయితొలగించండి