21, సెప్టెంబర్ 2025, ఆదివారం

సమస్య - 5251

22-9-2025 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మర్త్యులెవ్వరు మెచ్చరు మా కవితను”

(లేదా...)

“మర్త్యులు మెచ్చరైరి గద మా కవితామృతమాధురిన్ గటా”


6 కామెంట్‌లు:

  1. తేటగీతి
    వ్రాయనెంతును వచ్చిన భాషలోన
    నారికేళ పాకమ్మని నాకుఁ జూపి
    భావ గోప్యత, పాండితీ ప్రతిభ లేని
    మర్త్యులెవ్వరు మెచ్చరు మా కవితను

    ఉత్పలమాల
    కీర్త్యపు భావనన్ విడచి కృత్తిమ రీతిగ భావమల్లి ని
    ర్వర్త్యమనంగ మానసము, వ్రాసిన, పాకము నారికేళ సం
    వర్త్యమటంచు కొందరిలఁ బల్కిరి, ప్రజ్ఞయె లేని కొందరున్
    మర్త్యులు మెచ్చరైరి గద మా కవితామృతమాధురిన్ గటా!

    రిప్లయితొలగించండి
  2. పురపు తెలుగు జక్కగ రాని మూఢులయిన
    మర్త్యులెవ్వరు మెచ్చరు మా కవితను ,
    తీరుగ కవితలల్ల మా తృప్తి కొరకె
    తలచితిమిక యీ వాడుక తక్కుజేయ

    రిప్లయితొలగించండి

  3. ఎంతటి చదువుల జడువ నేమి లాభ
    మంటి సంస్కారమించుక యంటకున్న
    సోదరా కన నీవంటి శుంఠు డైన
    మర్త్యులెవ్వరు మెచ్చరు మా కవితను.


    మర్త్యుడె జ్ఞానజీవిగను మౌలిని కీర్తి గడించె కాదుటే
    మర్త్యుడె విద్యనేర్చినను మాన్యుడు పండితు డౌను కాంచగన్
    మర్త్యులలోన నుండెదరు మందులు కొందరు యట్టి హీనులౌ
    మర్త్యులు మెచ్చరైరి గద మా కవితామృతమాధురిన్ గటా.

    రిప్లయితొలగించండి
  4. తే॥ ఆశల వలయమందున ననవరతము
    మానవుల జీవితమ్మిల మసలుచుండ
    సమయమేది యితరముల చవిఁ గనుఁగొన
    మర్త్యులెవ్వరు మెచ్చరు మా కవితను

    ఉ॥ మర్త్యులు బాల్యమంతయును మానక విద్యలు నేర్చుచుండఁగన్
    మర్త్యులు యవ్వనమ్మునను మానక విత్తముఁ గూర్చనెంచఁగన్
    మర్త్యులు వృద్థులై యటుల మానని జబ్బులఁ బోరుచుండఁగన్
    మర్త్యులు మెచ్చరైరి గద మా కవితామృత మాధురిన్ గటా

    మసలు విహరించు

    రిప్లయితొలగించండి
  5. ఆర్త్యనలంబు మానసమునందున నిండుగ ప్రజ్వలింపగన్
    కీర్త్యభికాంక్ష లేక వర కీర్తనముల్ రచియింప స్వామిపై
    స్ఫూర్త్యనుభూతి లేని రసశూన్యులు మత్సరమందు శుంఠలౌ
    మర్త్యులు మెచ్చరైరి గద మా కవితామృతమాధురిన్ గటా!!

    రిప్లయితొలగించండి
  6. మర్త్యులు గతించి చేరిరమరపురమ్ము
    వారట కవితాగానము పరిఘటించి
    చెప్పితిరట భూలోకము చేరకున్న
    మర్త్యులెవ్వరు మెచ్చరు మా కవితను

    మర్త్యులలో మహామహులు మాత్రము చేరిరి దేవభూమి న
    మ్మర్త్యులు తల్చినారచట మంజుల కైతల మైకమందునన్
    మర్త్యుల కెట్లుచేరునిది మంచికవిత్వము గాదె విన్కనే
    మర్త్యులు మెచ్చరైరి గద మా కవితామృతమాధురిన్ గటా

    రిప్లయితొలగించండి