15-9-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అనృత విషయమ్ములెల్ల సత్యములె సుమ్ము”
(లేదా...)
“అనృతములెల్ల సత్యవిషయమ్ములు సుమ్మవి నమ్మగాఁ దగున్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తేటగీతినేలదున్నుచు రైతులు నింగినమ్మిచీడపీడల కోర్చుచు చేసి వ్యయమువానరాకయె నష్టాల వగచి కూలెడనృత విషయములెల్ల సత్యములె సుమ్ము!చంపకమాలఅనుదినమార్తితో పొలమునందు శ్రమించుచు కర్షకాళి కాదనకయె చేసి వెచ్చములు నాశలు దీర నిరీక్షఁ జేసినన్కినుకగు రాక వానలవి గేదల మేతకుసైతమేడ్చెడయ్యనృతములెల్ల సత్యవిషయమ్ములు సుమ్మవి నమ్మగాఁ దగున్!అనృతము = కృషి
చ.పనిగొని శాంభవీ కమల పాదయుగంబ మనస్సు నిల్పి తా ను నియతి వెల్గు వాడట వినూత్నముగా నిను చేరి గొప్పగా ధనమును గల్గి లేములను దాటెదవీవని పల్కె, భావి నా యనృతములెల్ల సత్యవిషయమ్ములు సుమ్మవి నమ్మగా దగున్ !
ఉన్నదానిని వేరుగ నుగ్గడించనానవాయితి యాతనిదదర కుండు ,వాడెవరి తోడనైనను వక్కణించుఅనృత విషయమ్ములెల్ల సత్యములె సుమ్ము
జగము లేలు వాడొక్కడే స్కంభుడనుచుపలుకు మాటలు నమ్మకవాస్తవములటంచు నాస్తికిలు పలుకు నట్టి మాటలనృత విషయమ్ములెల్ల సత్యములె సుమ్ము.జనులకు చెప్పె నాస్తికుడు స్కంభుడటంచును లేడు లోకమున్ ఘనుడని తెల్పు రాముడొక కల్పన కృష్ణుని పాత్ర యట్టిదే యనుచు వచించువాని నుడు లన్నియు బూటకమంచు వాడనేయనృతములెల్ల సత్యవిషయమ్ములు సుమ్మవి నమ్మగాఁ దగున్.
రెక్కలన్ ముక్కలుగ జేసి దుక్కి దున్నిపంట దండిగా పండించి ప్రజల కిడునుశ్రమను నమ్ముకొనుచు సదా సైరికుండుఅనృత విషయమ్ము లెల్ల సత్యములె సుమ్ముఅనృతము =కృషి
చూడ నెప్పుడు పల్కడు సూనృతములుసత్యమనుచు వచించె నసత్యములను తాఱుమాఱుగ విషయమ్ము తనరుచుండననృత విషయమ్ములెల్ల సత్యములె సుమ్ముఅనయము దుష్ట కర్మముల కాదరమొప్పగ సంచరించుచున్జనులకు దుష్టశీలుడట సత్యమటంచు వచించె కల్లలన్వినయము చిందులాడు మొగి పెంకెవచించెను తాఱుమాఱుగాననృతములెల్ల సత్యవిషయమ్ములు సుమ్మవి నమ్మగాఁ దగున్
అనయము పేదసాదలకు నాదటఁ నిల్చియొనర్చ సేవలన్పనిగొని రాజకీయమున పాల్గొనవచ్చితినన్న పల్కులేయనృతములెల్ల, సత్యవిషయమ్ములు సుమ్మవి నమ్మగాఁ దగున్జనులను మోసగించుటకు సల్పు నసంగతమైన వాక్కులే.
తే.గీ:సకలపాషండ మతములున్ సమసి పోయె,శంకరుడు రాగనే పరాజయము నొందె ననృత విషయమ్ములెల్ల, సత్యములె సుమ్ము”శంకరుని బోధ లవి విన శంక లుడుగు
(2)చం:అనయము సత్యమున్ బలుకు నట్టి మహర్షుల వాక్కులే ఫలించును, మరి దొంగ సాధువగుచున్ వచియించెడు వీని పల్కు లెంచిన నిజ మెట్టులౌ!నితడు చెప్పెడు నీదగు జాతకమ్ములోననృతము లెల్ల సత్యవిషయమ్ములు సుమ్మవి నమ్మగాఁ దగున్”(గొల్లపూడి మారుతీ రావు గారు ఒక సాధువు మీద ఒక సెటైర్ వ్రాసారు.ఆ సాధువు అందరినీ తిట్టి శాపాలు పెట్టే వాడట.వాడితో తిట్టించుకుంటే శుభమని అంతా తిట్టించుకునే వారు.అవును మరి.మహర్షులు మాట్లాడేవి సత్యా లౌతాయి కానీ వీడు దొంగ సాధువు కాబట్టి వీడు దీవిస్తే నాశన మౌతారు.శపిస్తే బాగు పడతారు.వాడు అబద్ధాలు చెపితే అవి నిజా లౌతాయి.)
తే॥ విదురుఁడు మరువక నెపుడు వినమటంచు ధర్మమార్గము నన్నకు తగు పగిదినినుడివెఁ గనమని కావని విడమఱచుచుననృత విషయమ్ము లెల్ల సత్యములె సుమ్ముచం॥ అనయము ధర్మమా విదురుఁడన్నకు బోధను జేసె తీరుగన్వినుమని నీతి సూక్తులను బ్రీతిని సంకట మందు స్ఫూర్తితోఁగనుఁగొన సూక్త పద్ధతినిఁ గామిత మొప్పఁగఁ గావు కావయా యనృతము లెల్ల సత్య విషయమ్ములు సుమ్మవి నమ్మఁగాఁ దగున్విదురుడు కావు అనృతములు ఎల్ల సత్యములు అని తెలిపినాడని అండి
జనులు నమ్ముచు నుందురు జగతి యందు*“అనృత విషయమ్ము లెల్ల సత్యములె సుమ్ము”*వినుమనెడుమాట నమ్మకు వేగిరముగనేల ననుమానము నరయ నెల్లకల్లెవినగనెసత్యమేమొయనిపించుచువేగమెనమ్ముచుందురా*యనృతములెల్ల,సత్యవిషయమ్ములు సుమ్మువినమ్మగా దగున్*మనమున నెల్లవేళలను మానుగ మాధవునే తలంచునామునివరులాడుమాటలవి మోక్షపు దారిని చూపు దారులే
సఖుని నవ్వించు కొఱకు నై చక్క నైనబొంకు లను జెప్పి చుండగ మోద మంద ననృత విషయ ము లెల్ల సత్యము లె సుమ్ము యనుచు మిత్రుండు తలచెతా నాత్మ యందు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
రిప్లయితొలగించండినేలదున్నుచు రైతులు నింగినమ్మి
చీడపీడల కోర్చుచు చేసి వ్యయము
వానరాకయె నష్టాల వగచి కూలె
డనృత విషయములెల్ల సత్యములె సుమ్ము!
చంపకమాల
అనుదినమార్తితో పొలమునందు శ్రమించుచు కర్షకాళి కా
దనకయె చేసి వెచ్చములు నాశలు దీర నిరీక్షఁ జేసినన్
కినుకగు రాక వానలవి గేదల మేతకుసైతమేడ్చెడ
య్యనృతములెల్ల సత్యవిషయమ్ములు సుమ్మవి నమ్మగాఁ దగున్!
అనృతము = కృషి
చ.
రిప్లయితొలగించండిపనిగొని శాంభవీ కమల పాదయుగంబ మనస్సు నిల్పి తా
ను నియతి వెల్గు వాడట వినూత్నముగా నిను చేరి గొప్పగా
ధనమును గల్గి లేములను దాటెదవీవని పల్కె, భావి నా
యనృతములెల్ల సత్యవిషయమ్ములు సుమ్మవి నమ్మగా దగున్ !
ఉన్నదానిని వేరుగ నుగ్గడించ
రిప్లయితొలగించండినానవాయితి యాతనిదదర కుండు ,
వాడెవరి తోడనైనను వక్కణించు
అనృత విషయమ్ములెల్ల సత్యములె సుమ్ము
రిప్లయితొలగించండిజగము లేలు వాడొక్కడే స్కంభుడనుచు
పలుకు మాటలు నమ్మకవాస్తవముల
టంచు నాస్తికిలు పలుకు నట్టి మాట
లనృత విషయమ్ములెల్ల సత్యములె సుమ్ము.
జనులకు చెప్పె నాస్తికుడు స్కంభుడటంచును లేడు లోకమున్
ఘనుడని తెల్పు రాముడొక కల్పన కృష్ణుని పాత్ర యట్టిదే
యనుచు వచించువాని నుడు లన్నియు బూటకమంచు వాడనే
యనృతములెల్ల సత్యవిషయమ్ములు సుమ్మవి నమ్మగాఁ దగున్.
రెక్కలన్ ముక్కలుగ జేసి దుక్కి దున్ని
రిప్లయితొలగించండిపంట దండిగా పండించి ప్రజల కిడును
శ్రమను నమ్ముకొనుచు సదా సైరికుండు
అనృత విషయమ్ము లెల్ల సత్యములె సుమ్ము
అనృతము =కృషి
చూడ నెప్పుడు పల్కడు సూనృతములు
రిప్లయితొలగించండిసత్యమనుచు వచించె నసత్యములను
తాఱుమాఱుగ విషయమ్ము తనరుచుండ
ననృత విషయమ్ములెల్ల సత్యములె సుమ్ము
అనయము దుష్ట కర్మముల కాదరమొప్పగ సంచరించుచున్
జనులకు దుష్టశీలుడట సత్యమటంచు వచించె కల్లలన్
వినయము చిందులాడు మొగి పెంకెవచించెను తాఱుమాఱుగా
ననృతములెల్ల సత్యవిషయమ్ములు సుమ్మవి నమ్మగాఁ దగున్
అనయము పేదసాదలకు నాదటఁ నిల్చియొనర్చ సేవలన్
రిప్లయితొలగించండిపనిగొని రాజకీయమున పాల్గొనవచ్చితినన్న పల్కులే
యనృతములెల్ల, సత్యవిషయమ్ములు సుమ్మవి నమ్మగాఁ దగున్
జనులను మోసగించుటకు సల్పు నసంగతమైన వాక్కులే.
తే.గీ:సకలపాషండ మతములున్ సమసి పోయె,
రిప్లయితొలగించండిశంకరుడు రాగనే పరాజయము నొందె
ననృత విషయమ్ములెల్ల, సత్యములె సుమ్ము”
శంకరుని బోధ లవి విన శంక లుడుగు
(2)చం:అనయము సత్యమున్ బలుకు నట్టి మహర్షుల వాక్కులే ఫలిం
రిప్లయితొలగించండిచును, మరి దొంగ సాధువగుచున్ వచియించెడు వీని పల్కు లెం
చిన నిజ మెట్టులౌ!నితడు చెప్పెడు నీదగు జాతకమ్ములో
ననృతము లెల్ల సత్యవిషయమ్ములు సుమ్మవి నమ్మగాఁ దగున్”
(గొల్లపూడి మారుతీ రావు గారు ఒక సాధువు మీద ఒక సెటైర్ వ్రాసారు.ఆ సాధువు అందరినీ తిట్టి శాపాలు పెట్టే వాడట.వాడితో తిట్టించుకుంటే శుభమని అంతా తిట్టించుకునే వారు.అవును మరి.మహర్షులు మాట్లాడేవి సత్యా లౌతాయి కానీ వీడు దొంగ సాధువు కాబట్టి వీడు దీవిస్తే నాశన మౌతారు.శపిస్తే బాగు పడతారు.వాడు అబద్ధాలు చెపితే అవి నిజా లౌతాయి.)
తే॥ విదురుఁడు మరువక నెపుడు వినమటంచు
రిప్లయితొలగించండిధర్మమార్గము నన్నకు తగు పగిదిని
నుడివెఁ గనమని కావని విడమఱచుచు
ననృత విషయమ్ము లెల్ల సత్యములె సుమ్ము
చం॥ అనయము ధర్మమా విదురుఁడన్నకు బోధను జేసె తీరుగన్
వినుమని నీతి సూక్తులను బ్రీతిని సంకట మందు స్ఫూర్తితోఁ
గనుఁగొన సూక్త పద్ధతినిఁ గామిత మొప్పఁగఁ గావు కావయా
యనృతము లెల్ల సత్య విషయమ్ములు సుమ్మవి నమ్మఁగాఁ దగున్
విదురుడు కావు అనృతములు ఎల్ల సత్యములు అని తెలిపినాడని అండి
జనులు నమ్ముచు నుందురు జగతి యందు
రిప్లయితొలగించండి*“అనృత విషయమ్ము లెల్ల సత్యములె సుమ్ము”*
వినుమనెడుమాట నమ్మకు వేగిరముగ
నేల ననుమానము నరయ నెల్లకల్లె
వినగనెసత్యమేమొయనిపించుచువేగమెనమ్ముచుందురా
*యనృతములెల్ల,సత్యవిషయమ్ములు సుమ్మువినమ్మగా దగున్*
మనమున నెల్లవేళలను మానుగ మాధవునే తలంచునా
మునివరులాడుమాటలవి మోక్షపు దారిని చూపు దారులే
సఖుని నవ్వించు కొఱకు నై చక్క నైన
రిప్లయితొలగించండిబొంకు లను జెప్పి చుండగ మోద మంద
ననృత విషయ ము లెల్ల సత్యము లె సుమ్ము
యనుచు మిత్రుండు తలచెతా నాత్మ యందు