10, సెప్టెంబర్ 2025, బుధవారం

సమస్య - 5240

11-9-2025 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రజనిని మెచ్చంగవలెను రైతులు నెమ్మిన్”

(లేదా...)

“రజనిని మెచ్చఁగావలెను రైతులు సత్ఫలసిద్ధిఁ గోరుచున్”


9 కామెంట్‌లు:

  1. కందం
    రుజలవి పంటలకెపుడు స
    హజముగ నాశమొనరించు నాపెడు కతనన్
    నిజమగు సత్తువనిడు న
    త్రజనిని మెచ్చంగవలెను రైతులు నెమ్మిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      రుజలవి పంటలన్ జిదుము లోకము నందుననెంచి చూడగన్
      సుజలము తోడుగన్, దెలిసి శోకము బాయగ, శాస్త్ర పద్ధతిన్
      నిజమగు సత్తువన్ బడసి నేర్పుగ పోరగ నందజేయ న
      త్రజనిని మెచ్చఁగావలెను రైతులు సత్ఫలసిద్ధిఁ గోరుచున్

      తొలగించండి
  2. చ.
    భుజముల బల్బలంబుల సుభూరి సమంచిత యత్నమెంచి దు
    న్ని జలము పార జేసినను, నేత్రము పంటల కావ వేసినన్
    రుజముల నిచ్చు పుర్గులట రోషము చూపుచు చేరు, మంచి న
    త్రజనిని మెచ్చగావలెను రైతులు సత్ఫల సిద్ధి గోరుచున్ !

    రిప్లయితొలగించండి
  3. ప్రజలకు వలసిన పంటలు
    నిజముగ పండింతురుగద నిరతము రైతుల్
    విజయము లభియింపగ న
    త్రజనిని మెచ్చంగవలెను రైతులు నెమ్మిన్



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గజిబిజి లేక పంటలను గట్టిగ యోచన చేయగాదగున్
      విజయము నిచ్చు పంటలను వేసిన చాలును సీరవాహకుల్
      నిజముగ పప్పుధాన్యముల నెన్నిక జేయగ లభ్యమైన న
      త్రజనిని మెచ్చఁగావలెను రైతులు సత్ఫలసిద్ధిఁ గోరుచున్

      తొలగించండి
  4. నిజమగు విత్తుల నొందుచు
    సజావుగ గమతమును గొనసాగించుటకై
    సుజనుల పక్షపు రంగగు
    రజనిని మెచ్చంగవలెను రైతులు నెమ్మిన్

    రిప్లయితొలగించండి


  5. గజయాన కైదవ తనమ
    గు, జనుల నిత్యావసరమగు సరుకుగను భే
    షజముగను పనికి వచ్చెడి
    రజనిని మెచ్చంగవలెను రైతులు నెమ్మిన్.

    (రజని=పసుపు)


    రుజలన్ దొలగించునది స
    హజశక్తినొసంగుచునది యారబమును భే
    షజముగ రక్షించెడి న
    త్రజనిని మెచ్చంగవలెను రైతులు నెమ్మిన్.


    ప్రజలిల మంగళమ్మనుచు భావన సేయు పదార్థమైన భే
    షజముగ మేలొనర్చెడి నిశాహ్వము మేటిగ లాభమిచ్చుచున్
    విజయము గూర్చునంచు కడు ప్రీతిని జూపుచు సాగు జేసెడిన్
    రజనిని మెచ్చఁగావలెను రైతులు సత్ఫలసిద్ధిఁ గోరుచున్.


    విజయమనంగనేమి యన విస్తృత మౌ ఫల సాయమందుటే
    నిజమది రోగమంటినను నిష్ఫలమౌ కృషి యంచు నెంచి భే
    షజముగ ముఖ్యమంచు వ్యవసాయము నందున వాడు నట్టి న
    త్రజనిని మెచ్చఁగావలెను రైతులు సత్ఫలసిద్ధిఁ గోరుచున్.

    రిప్లయితొలగించండి
  6. రుజలవి దరి రా నీ యక
    ప్రజలకు బంగారు పంట బాగుగ నొస గన్
    రుజువు గ బని చేసెడి న
    త్ర జనిని మె చ్చ o గ వలెను రైతులు నెమ్మి న్

    రిప్లయితొలగించండి
  7. చంపకమాల

    విజయము కోరి సైరికుడు వేళకు పైరుకు పెర్గటానికిన్
    సుజలము నందజేసినను శోభిలు చుండును క్షేత్రమంతయున్
    రుజయది రూపుమాపి ప్రతిరోజును మొక్కకు సత్తు విచ్చు న
    త్రజనిని మెచ్చగావలెను రైతులు సత్ఫలసిద్ధిగోరుచున్

    రిప్లయితొలగించండి